అదే శ్రేణి యొక్క 3వ పాఠానికి సంబంధించిన వీడియో సహచరం, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: "డయాక్రోనిక్" మరియు "సింక్రోనిక్" మధ్య తేడా ఏమిటి? మనం సింక్రోనిక్ లేదా డయాక్రోనిక్ విశ్లేషణతో ప్రారంభించాలా? సింక్రోనిక్ లేదా డయాక్రోనిక్ విశ్లేషణ మరొకదానిపై ప్రాధాన్యత కలిగి ఉందా? బైబిల్ రచయితలు ఎప్పుడైనా సింక్రోనిక్ మరియు డయాక్రోనిక్ విధానాలను ఒకే సమయంలో ఉపయోగించారా? బైబిల్ యొక్క దేవుని సార్వభౌమాధికారాన్ని బైబిల్ లోని దేవుని సార్వభౌమాధికారాన్ని ఎలా సమన్వయం చేయాలి? దేవుడు తన మనసును మార్చుకున్నందున దేవుని వేదాంతం ఎప్పుడైనా సంభవిస్తుందా? అన్ని బైబిల్ వేదాంతశాస్త్రజ్ఞులు బైబిల్ను ఒడంబడికల ప్రకారం విభజిస్తారా? ఒడంబడికలకు యుగాలను సరిపోల్చడంతో పాటు, బైబిల్ వేదాంతశాస్త్రజ్ఞులు బైబిల్ను ఎలా విభజిస్తారు? దేవుడు అనేక ఒడంబడికలను ఎందుకు స్థాపించాడు? ఒడంబడికల బహుళత్వం దేవుని పాత్ర గురించి మనకు ఏమి బోధిస్తుంది? షరతులతో కూడిన మరియు బేషరతు ఒడంబడికలు ఉన్నాయా? కొన్ని ఒడంబడికలు ఇతరుల కంటే ఎక్కువ షరతులతో కూడినవి? కొత్త ఒడంబడిక షరతులతో కూడినదా? కొత్త ఒడంబడిక కింద మనం మన ఒడంబడిక బాధ్యతలను ఎలా నెరవేరుస్తాము? కాలానుగుణంగా మరియు విషయపరమైన అభివృద్ధి మధ్య తేడా ఏమిటి? స్క్రిప్చర్కు టాపికల్ విధానం యొక్క ప్రమాదాలు ఏమిటి? స్క్రిప్చర్ అధ్యయనాలలో టైపోలజీని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? పాత నిబంధనను అధ్యయనం చేసేటప్పుడు మనం ఎల్లప్పుడూ క్రీస్తు రకాలను వెతకవలసిన అవసరం ఉందా? ఒక రకం ఒక వాక్య రూపమా? ఒక రకం యొక్క అంశాలు ఏమిటి? రకాలు ఎలా దేవుని అభివృద్ధిపై ఆధారపడతాయి మరియు ప్రతిబింబిస్తాయి?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
మా దేశములో “పసిబిడ్డ ఎవరు?” అనే ఒక ఆట ఉంది. పార్టీని నిర్వహించువారు వచ్చిన తమ అతిధుల యొక్క చిన్ననాటి ఫొటోలను సేకరించి ఆ ఫోటోలలో ఉన్న వ్యక్తులను కనుగొనమని ఇతరులను కోరతారు. సాధారణముగానే, కొన్ని ఫొటోలు వచ్చిన అతిధుల పోలికలను కలిగియుంటాయి. ఏ వ్యక్తి కూడా తన చిన్నతనములోని ఫొటోలను ఖచ్చితముగా పోలియుండడుగాని, చాలా సార్లు కొన్ని ముఖ పోలికలు — మన కన్నుల ఆకారము, చక్కటి నవ్వు — చాలా సమాంతరముగా ఉంటాయి కాబట్టి ఏ పసివాడు ఏ విధముగా వయస్సులోనికి ఎదిగాడో మనము చెప్పవచ్చు.
పాత నిబంధన వేదాంతశాస్త్ర విషయములో కూడా ఇదే నిజమైయున్నది. పాత నిబంధన కొన్ని వేల సంవత్సరముల పాటు వ్రాయబడినది మరియు ఆ క్రమములో దాని వేదాంతశాస్త్రము అనేక మార్పులు చెందింది. సమాప్తములో అనగా పరిపక్వ దశలలో ఉన్న వేదాంతశాస్త్రము ఖచ్చితముగా ఆరంభములో అనగా యౌవ్వన దశలో ఉన్న వేదాంతశాస్త్రము వలె ఉండదు. అయితే మనము జాగ్రత్తగా పరిశీలన చేసిన యెడల, కాల క్రమములో పాత నిబంధన వాస్తవానికి ఒకే విశ్వాసమునకు ప్రాతినిథ్యం వహించింది అని మనము చూడవచ్చు.
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమములో ఇది మూడవ పాఠము. ఈ పాఠమునకు “పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములు” అని పేరు పెట్టాము. ఈ పాఠంలో, కాలక్రమములో పాత నిబంధన వేదాంతశాస్త్రము అభివృద్ధి చెందిన విధానము మీద బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దృష్టి పెడుతుంది అని మనము చూస్తాము.
మన మునుపటి పాఠంలో, చారిత్రికముగా లేఖనములను అర్థము చేసుకొనుట కొరకు క్రైస్తవులు మూడు ముఖ్యమైన ప్రణాళికలను ఉపయోగించారని మనము చూశాము: సాహిత్య విశ్లేషణ, అనగా కొన్ని దృక్కోణములను తెలియజేయుటకు రూపించబడిన ఒక సాహిత్య పటముగా బైబిలును చూచుట; అంశ విశ్లేషణ, అనగా మన సమకాలీన లేక సాంప్రదాయిక అంశములను మరియు ప్రశ్నలను ప్రతిబింబించు ఒక అద్దముగా బైబిలును చూచుట; మరియు చారిత్రిక విశ్లేషణ, అనగా అది నివేదించు చారిత్రిక సన్నివేశములకు కిటికీగా బైబిలును చూచుట. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ప్రాథమికముగా లేఖనముల యొక్క చారిత్రిక విశ్లేషణ మీద దృష్టి పెడుతుంది అని, ప్రత్యేకముగా బైబిలులో నివేదించబడిన చారిత్రిక సన్నివేశములలో దేవుడు పాలుపంచుకున్న మార్గములను పరిశీలిస్తుంది అని కూడా మనము చూశాము.
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అనగా లేఖనములో తెలియజేయబడిన దేవుని కార్యముల యొక్క చారిత్రిక విశ్లేషణ నుండి వెలువడిన వేదాంతశాస్త్ర ఆలోచనయైయున్నది.
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవుని కార్యముల యొక్క లేఖన కథనముల మీద దృష్టి పెడుతుంది మరియు ఆ సన్నివేశములలో నుండి క్రైస్తవ వేదాంతశాస్త్రము కొరకు అనుమితులను వెలికి తీస్తుంది.
మునుపటి పాఠంలో, చరిత్రలోని కాలములను సమయము యొక్క ఏకకాలిక భాగములుగా చేయుట ద్వారా, మరియు వేదాంతశాస్త్ర నిర్మాణములను వివేచించుట ద్వారా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క “ఏకకాలిక సంయోగము”ను ఎలా సృష్టించారో చూశాము మరియు అది ఆ కాలములలోని దైవిక కార్యము మరియు మాటల ప్రత్యక్షతల యొక్క కలయిక ద్వారా జరుగుతుంది. ఈ పాఠంలో, పాత నిబంధన వేదాంతశాస్త్రమును గూర్చి బైబిలానుసారమైన వేదాంతవేత్తలు కలిగియున్న రెండవ ముఖ్యమైన ఆందోళనను చూద్దాము: “భిన్నకాలిక పురోగమనములు,” అనగా కాల క్రమములో వేదాంతశాస్త్ర నిర్మాణములు ఎదిగిన లేక అభివృద్ధి చెందిన విధానములు.
ఈ అంశమును పరిశీలించుటకు, మనము మూడు ముఖ్యమైన విషయములను చూద్దాము. మొదటిగా, భిన్నకాలిక పురోగమనము పట్ల ఒక సామాన్య ధోరణిని పొందుకుందాము. రెండవదిగా, ప్రధానమైన చారిత్రిక కాలములు లేక యుగముల మధ్య చోటుచేసుకున్న యుగానుసార పురోగమనములను మనము చూద్దాము. మరియు మూడవదిగా, పాత నిబంధనలో కాలక్రమాన కొన్ని అంశములు ఎలా అభివృద్ధి చెందాయో చూద్దాము. భిన్నకాలిక పురోగమనము పట్ల గల సామాన్య ధోరణితో ఆరంభించుదాము.
భిన్నకాలిక పురోగమనము అను ఆలోచనను పరిచయము చేయగల ఉత్తమమైన మార్గములలో ఒకటి ఈ పదముల యొక్క అర్థము మీద దృష్టిపెట్టుట. మొదటిగా “భిన్నకాలిక” అను పదమును చూద్దాము. రెండవదిగా, “పురోగమనము” అనే పదము యొక్క అర్థమును చూద్దాము. మరియు మూడవదిగా, పాత నిబంధనలో భిన్నకాలిక పురోగమనమును సమీక్షించుటకు ఒక బైబిలు ఉదాహరణను చూద్దాము. మొదటిగా “భిన్నకాలిక” అనే పదమును చూద్దాము.
మన ఆంగ్ల పదమైన “డయక్రోనిక్” లేక భిన్నకాలిక అను పదము రెండు గ్రీకు పదములలో నుండి వెలువడింది: మొదటిగా, డియ అనే విభక్తి యొక్క అర్థము “ద్వారా,” లేక “అంతటా”; మరియు రెండవదిగా గ్రీకు నామవాచకమైన క్రోనోస్ యొక్క అర్థము “కాలము.” డయక్రోని అనునది గడచిన కాలమునకు సంబంధించినది. బైబిలానుసారమైన వేదాంతశాస్త్ర విషయములో, “భిన్నకాలిక” అను పదము కాల క్రమములో పాత నిబంధన వేదాంతశాస్త్రము మార్పుచెందిన, అభివృద్ధి చెందిన లేక పురోగమనము చెందిన విధానములను తెలియజేస్తుంది.
పాత నిబంధన పట్ల భిన్నకాలిక ధోరణులు మన మునుపటి పాఠ అంశమైన ఏకకాలిక సంయోగముతో ఎలా అనుబంధం కలిగియుంటాయో చూచుట మనకు సహాయకరముగా ఉంటుంది. ఒక వైపున, అది ఏకకాలిక సంయోగమునకు వ్యత్యాసముగా ఎలా నిలుస్తుందో చూద్దాము. మరియు మరొక వైపున, భిన్నకాలిక మరియు ఏకకాలిక ధోరణుల మధ్య ఉన్న పరస్పరాధారితమును మనము చూద్దాము. మొదటిగా వాటి మధ్య ఉన్న వ్యత్యాసమును చూద్దాము.
ఒక చలన చిత్రములోని కొన్ని సన్నివేశముల మీద దృష్టి, చిత్రములోని పొందికగల పాత్రలను ఒక్కొకటిగా చూచుట ద్వారా పాత నిబంధన యొక్క ఏకకాలిక సంయోగమును మనము పోల్చిన విషయము మీకు జ్ఞాపకము ఉండియుంటుంది. ఏకకాలిక సంయోగము బైబిలు చరిత్రలోని నిర్ణీత కాలములలో వెలువడిన వేదాంతశాస్త్ర నిర్మాణముల మీద దృష్టిపెడుతుంది. ఒక కాలములో దేవుడు దేనిని బయలుపరచాడు? వ్యత్యాసముగా, పాత నిబంధనను భిన్నకాలికముగా చూచుట, ఒక సన్నివేశము నుండి మరొక సన్నివేశములోనికి కదులుచున్న చలనచిత్రము యొక్క కథనము మీద దృష్టిపెట్టుటను పోలియున్నది. అనగా ఆరంభము నుండి అంతము వరకు చలనచిత్రము క్రమముగా కథనమును తెలియపరచు విధానము మీద దృష్టిపెట్టుట. బైబిలు పట్ల భిన్నకాలిక కథనములు కాలక్రమములో ఒక క్రమమున వేదాంతశాస్త్ర నిర్మాణములు ప్రత్యక్షమగు విధానము మీద దృష్టిపెడుతుంది. చరిత్ర ముందుకు కొనసాగుచుండగా దేవుని ప్రత్యక్షతలు ఎలా అభివృద్ధి చెందాయి?
నిర్గమ. 1:1-19:1లో నివేదించబడిన, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు యొక్క విమోచనను గూర్చిన కొద్ది కాలమును పరిగణించండి. ఈ కాలము పట్ల ఏకకాలిక దృక్కోణము ఇలాంటి ప్రశ్నలను అడుగుతుంది: “ఈ కాలములో దేవుడు ఏమి చెప్పాడు మరియు ఏమి చేశాడు?” “ఈ కాలమంతటిలో ఏ విధమైన వేదాంతశాస్త్ర నిర్మాణములు స్థాపించబడినవి?” అయితే, భిన్నకాలిక పద్ధతి వేదాంతశాస్త్ర నిర్మాణములలో కలిగిన మార్పుల మీద దృష్టి పెడుతుంది. అది ఇలాంటి ప్రశ్నలను అడుగుతుంది: “ఈ కాలములో పలు విధములుగా దేవుడు కార్యము చేసినప్పుడు మరియు మాట్లాడినప్పుడు వేదాంతశాస్త్రములో ఎలాంటి మార్పులు జరిగాయి?” “మోషే యొక్క బాల్యము మొదలుకొని మండుచున్న పొద యొద్ద అతడు పిలుపును అందుకున్న వరకు ఏ వేదాంతశాస్త్ర పురోగమనములు సంభవించాయి?” “మండుచున్న పొద యొద్ద దేవుని ప్రత్యక్షత ఐగుప్తులో ఆయన చేయబోవు కార్యము కొరకు ఎలా ఎదురుచూసింది?” పాత నిబంధనలోని ఈ భాగము పట్ల భిన్నకాలిక ధోరణులకు ఇవి మరియు ఇలాంటి అనేక ఇతర విషయములు కేంద్ర ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.
భిన్నకాలిక మరియు ఏకకాలిక పద్ధతులు ఎంత భిన్నముగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, అవి చాలా వరకు పరస్పరాధారితమైనవి కూడా. వాస్తవానికి, ఒకటి లేకుండా మరొక దానిని గూర్చి ఎక్కువ సేపు ఆలోచన చేయుట కూడా సాధ్యము కాదు. ఈ కారణము చేత, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు లేఖనములను ఉపయోగించుచుండగా, వారు ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతులను అనేక విధాలుగా ఆశ్రయిస్తుంటారు.
మన దృక్కోణము తక్కువ కాలము నుండి ఎక్కువ కాలము వరకు వ్యాప్తి చెందుచుండగా ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతుల మధ్య మనము ఎలా ఎంచుకోవాలో పరిగణించుదాము. ఆరంభించుటకు, కొన్ని భిన్నకాలిక సమీక్షలు చాలా చిన్న ఏకకాలిక సంయోగములకు ముందు కూడా కనిపిస్తాయి. ఒక కాలములో జరిగిన విషయములను క్రోడీకరించుటకు వేదాంతశాస్త్ర మార్పులను మనము భిన్నకాలికముగా అర్థము చేసుకోవాలి.
ఇప్పుడు, మనము సుదీర్ఘ కాలములను పరిగణించినప్పుడు, మన భిన్నకాలిక సమీక్ష ఏకకాలిక సంయోగము మీద ఆధారపడియుంటుంది. మొదటిగా మనము అనేక క్లుప్త కాలముల యొక్క ఏకకాలిక సంయోగములను సిద్ధపరుస్తాము, మరియు తరువాత ఆ రెండు క్లుప్త కాలముల మధ్య వేదాంతశాస్త్ర నిర్మాణములు ఎలా మార్పుచెందాయో మనము కనుగొంటాము. ఈ సుదీర్ఘ కాలమును ఒకసారి భిన్నకాలికముగా అర్థము చేసుకున్న తరువాత, దానిని మనము సంపూర్ణంగా కూడా సంయోగపరచవచ్చు. బైబిలు ప్రత్యక్షత యొక్క పూర్ణతకు చేరువరకు ఈ విధమైన ఊగిసలాట కొనసాగుతూనే ఉంటుంది.
ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతులు ఎంత భిన్నముగా ఉన్నప్పటికీ, మరొకదాని మీద కొంత వరకైనా ఆధారపడకుండా ఒక ప్రణాళికను ఉపయోగించుట సాధ్యము కాదు అని మనము ఎన్నడు మరచిపోకూడదు. అంటే దీని అర్థము ఒక పద్ధతి మరొక దాని కంటే ప్రాముఖ్యమైనది లేక ప్రధానమైనది అని కాదు. పాత నిబంధన యొక్క వేదాంతశాస్త్రమును సరైన విధముగా అర్థము చేసుకొనుటకు ఏకకాలిక మరియు భిన్నకాలిక పద్ధతులు రెండూ అవసరమైయున్నవి.
పాత నిబంధన పట్ల భిన్నకాలిక పద్ధతిని గూర్చిన సామాన్య ఆలోచనను మనము పొందుకున్నాము కాబట్టి, భిన్నకాలిక పురోగమనము యొక్క అర్థమును మనము వివరించాలి.
రెండు ముఖ్య ఆలోచనలను సూచించుటకు భిన్నకాలిక మార్పులను గూర్చి మాత్రమే మాట్లాడకుండా “పురోగమనము” అనే పదమును మనము ఉపయోగిస్తాము. మొదటిగా, పాత నిబంధన వేదాంతశాస్త్ర నిర్మాణములలోని మార్పులు ఎల్లప్పుడు చరిత్రలో దేవుని ఉద్దేశములను నెరవేర్చుటకు చేయబడ్డాయి. మరియు రెండవదిగా, మనము పురోగమనమును గూర్చి ఎందుకు మాట్లాడుతున్నామంటే, చరిత్రలో దేవుని యొక్క దైవకృత పాలుపంపుల ద్వారా మాత్రమే వేదాంతశాస్త్ర మార్పులు కలుగుతాయి. పాత నిబంధన వేదాంతశాస్త్రములోని ప్రతి మార్పు వెనుక ఉన్న దైవిక ఉద్దేశములను మొదట పరిగణించుదాము.
చరిత్రలోని ప్రతి ఒక్కటి, వేదాంతశాస్త్రములో కలుగు మార్పులతో సహా, ఆయన సృష్టి పట్ల దేవుడు కలిగియున్న విఫలముకాని ఉద్దేశములను ఎల్లప్పుడు నెరవేరుస్తాయని లేఖనమంతా ఉద్ఘాటిస్తుంది. యెషయా 46:10 పాత నిబంధన అంతటా ఒకే విధమైన దృష్టికోణమును ప్రతిబింబిస్తుంది. అక్కడ ఇలా వ్రాయబడియున్నది:
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను (యెషయా 46:10).
చరిత్ర ఎల్లప్పుడు క్రమమును అనుసరించి దాని కొరకు దేవుడు ఏర్పరచిన లక్ష్యములను చేరుతుంది అనే సామన్య పాత నిబంధన దృక్కోణమును ఇది మరియు అనేక ఇతర లేఖన భాగములు బయలుపరుస్తాయి. చరిత్ర కొరకు దేవుడు కలిగియున్న లక్ష్యములు కేవలం విశాలమైన, దీర్ఘకాలిక లక్ష్యములు మాత్రమే గాక ప్రత్యేకమైన అల్పకాలిక లక్ష్యములుగా కూడా ఉనికిలో ఉన్నాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలు మీద రాజుగా దావీదును నియమించుటలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన అల్పకాలిక కారణములు కలిగియుండెను; ఒక శాశ్వతమైన రాజరికమును మరియు రాజధాని పట్టణమును స్థాపించుట ద్వారా ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐక్యపరచాలని కోరాడు. ప్రతి కాలములోను, దేవుని అల్పకాలిక ఉద్దేశములను నెరవేర్చిన వేదాంతశాస్త్ర పురోగమనములు చోటుచేసుకున్నాయి.
అయితే ఈ పాఠ్యక్రమము అంతటిలో మనము చూసినట్లుగా, చరిత్ర కొరకు దేవుడు ఒక సమగ్రమైన రాజ్య ప్రణాళిక కూడా కలిగియున్నాడు. ఆరంభము నుండి, ఆయన పోలికె యొక్క కార్యము ద్వారా సమస్త భూమి మీద ఆయన పరలోక రాజ్యమును వ్యాపింపజేయుచు తనను తాను మహిమపరచుకోవాలనేది ఆయన ప్రణాళిక అయ్యుండినది మరియు ఈ ప్రణాళిక దేవుని ఉద్దేశములన్నిటిని ఐక్యపరుస్తుంది. ఉదాహరణకు, ఇశ్రాయేలు కొరకు దేవుని ప్రణాళికలో దావీదు యొక్క రాజరికము అవ్యవధాన ఉద్దేశములను కలిగియుండినా, దేవుని రాజ్యమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయు గొప్ప లక్ష్యము వైపుకు అది ఒక మెట్టైయుండినది. దావీదు సింహాసనము యొక్క స్థిరత్వము తండ్రి యొక్క మహిమకరమైన సన్నిధి కొరకు భూమిని సిద్ధపరచు పరిపూర్ణమైన నమ్మకమైన దావీదు కుమారుడైన క్రీస్తు రాకడకు రంగమును సిద్ధం చేసింది. ఈ గొప్ప గమ్యమును దృష్టిలో ఉంచుకొని దేవుడు చరిత్రను ఆరంభించాడు మరియు చరిత్రలోని ప్రతి సన్నివేశము విఫలము కాకుండా ఈ మహిమకరమైన గమ్యమునకు చేరుతుంది.
పాత నిబంధన వేదాంతశాస్త్ర నిర్మాణములు యాదృచ్ఛికమైనవి లేక గురిలేనివి కావు. అవి ఉద్దేశపూర్వకమైనవి. అవి విఫలముకాకుండా దేవుని అల్పకాల లక్ష్యములను మరియు ఆయన రాజ్య ప్రణాళికలను నెరవేర్చాయి. పాత నిబంధనలోని ఈ వేదాంతశాస్త్ర మార్పులను అర్థము చేసుకొనుట చరిత్రను మార్పుచెందని విధముగా దేవుని లక్ష్యముల వైపుకు నడిపించాయి అని తెలుసుకున్నాము కాబట్టి, ఇప్పుడు ఈ పురోగమనములు చరిత్రలో దేవుని యొక్క దైవకృతమైన పాలుపంపుల ద్వారా సంభవించాయని మనము గుర్తించాలి.
మనము వివరాల మీద దృష్టిపెట్టన్నప్పుడు, చాలా సార్లు పాత నిబంధన వేదాంతశాస్త్ర పురోగమనములు దూరము నుండి కనిపించు ఒక దారి వలె అగుపడుతుంటాయి. మనము వివరాలను ఎరిగినవారిగా ఉన్నప్పుడు, వేదాంతశాస్త్ర మార్పులు అను దారి చాలా మృదువుగాను తిన్నగాను కనిపిస్తుంది. అయితే మనము జాగ్రత్తగా పరిశీలించిన యెడల, పాత నిబంధన దారి లోతైన గుంటలు, వేగవంతమైన పల్లములు, మరియు కుడి ఎడమ వైపులకు పదునైన మలుపులు కలిగినదిగా ఉంటుంది. ఈ ఆకస్మిక మార్పులు దేవుని దైవకృతము ద్వారా, అనగా సృష్టిలో ఆయన క్లిష్టమైన పాలుపంపుల ద్వారా కలుగుతాయి.
నిస్సందేహంగా, కొన్ని దైవిక ప్రత్యక్షతలు మనము ఊహించిన విధముగానే చారిత్రిక సందర్భములతో ముడిపడియుంటాయి. ఉదాహరణకు, సంచారమునకు అనువుగా ఉండు ప్రత్యక్ష గుడారమును కట్టమని దేవుడు మోషేను ఆజ్ఞాపించాడు, ఎందుకంటే వాగ్దాన దేశము వైపుకు ప్రయాణము చేయుచుండగా ఇశ్రాయేలీయులు ఆయనను ఆరాధించవలసియుండినది. అదే సమయములో, పాత నిబంధనలో చోటు చేసుకున్న కొన్ని వేదాంతశాస్త్ర పురోగమనములు చాలాసార్లు మనకు యాదృచ్ఛికముగాను లేక క్లిష్టమైనవిగాను కనిపిస్తాయి. మనము నిశ్చయతతో ఇవ్వగల ఒకే వివరణ ఏమనగా, ఈ వేదాంతశాస్త్ర మార్పులు జరగాలని దేవుడు కోరాడంతే.
ఉదాహరణకు, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు నుండి ఆశించిన అనేక శుద్ధీకరణ ఆచారములను చూడండి. తన ప్రజలను పరిశుద్ధ జనాంగముగా చేయుటకు దేవుడు అనేక ఆచారములను పాటించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆశ్చర్యకరముగా, ఈ శుద్ధీకరణ నియమములలోని కొన్ని విషయములు పరిశుద్ధతకు గురుతులుగా కనిపిస్తాయి ఎందుకంటే అవి ఇతర సంస్కృతుల యొక్క ఆచారములకు, ఇశ్రాయేలు చుట్టు ఉన్న కనానీయుల సంస్కృతులతో సహా, భిన్నముగా కనిపిస్తాయి. అయితే పరిశుద్ధతకు ఇతర గురుతులు ఇతర సంస్కృతుల ఆచారములను, కనానీయుల ఆచారములను కూడా పోలియున్నాయి. ఇందుమూలముగా, కొన్ని సార్లు తమను తాము వేరుపరచుకొనమని ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు, మరికొన్నిసార్లు వారి పొరుగువారిని పోలిన విధముగా కార్యములను చేయమని వారిని ఆజ్ఞాపించాడు. దేవుని ప్రత్యక్షత ఇలా ఎందుకు చేసింది? ఈ ప్రత్యక్షతలోని మార్పులకు గల కారణము ఏమిటి? వీటిని అర్థము చేసుకొనుటకు మనము కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరికి ఇది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. ఆయన ప్రత్యక్షత ఈ విధముగా అభివృద్ధి చెందాలని దేవుడు నిర్ణయించాడు అనేది మాత్రమే మనకు నిశ్చయముగా తెలుసు.
మానవులు మరియు ఇతర సంకల్పశక్తిగల సృష్టములు తీసుకొన్న ఎంపికలకు దేవుడు స్పందించిన విధానము మూడవ రకమైన వేదాంతశాస్త్ర పురోగమనమునకు దారితీసింది. ఉదాహరణకు, ఇశ్రాయేలు చర్రిత్ర మానవ వైఫల్యములతో నిండియున్నది మరియు అది కొన్ని వేదాంతశాస్త్ర పురోగమనములను కలిగించు రీతిలో దేవుడు తనను తాను బయలుపరచుకొనుటకు దారి తీసింది. వాటిలో కొన్ని ఏమనగా: నిర్గమములోని మొదటి తరము వారికి దేవుడు వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొను భాగ్యం ఇచ్చాడుగాని, వారి దైవదూషణ వారి తిరస్కరణకు దారితీసింది. పశ్చాత్తాపపడి ఆయన తీర్పును తప్పించుకొనుటకు దేవుని ప్రవక్తలు ఇశ్రాయేలుకు ఒక అవకాశమును ఇచ్చారు, కాని ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు దేవుడు వారిని చెరలోనికి పంపునట్లు చేసింది. అవును, ఈ మానవ అవకాశములలో ఏవి కూడా దేవుని సార్వభౌమ నియంత్రణకు వెలుపల లేవు. అయినను, లేఖనములో మరలా మరలా, మానవ దృక్కోణము ప్రకారము, అనేక వేదాంతశాస్త్ర పురోగమనములు మానవులు మరియు ఇతర సంకల్పశక్తిగల సృష్టములు చేసుకున్న ఎంపికల ఆధారంగా సంభవించాయి.
అది దేవుని ఉద్దేశములను నెరవేర్చుచున్నది కాబట్టి పాత నిబంధన వేదాంతశాస్త్రము పురోగమనము చెందుచున్నది అని మనము మాట్లాడుట సరైనదే అయినప్పటికీ, ఈ పురోగమనము ఎంత క్లిష్టమైనదో కూడా మనము మనస్సులో పెట్టుకోవాలి. దేవుడు తన కార్యము ద్వారా మరియు తన మాటల ద్వారా అనేక విధములుగా తనను తాను బయలుపరచుకున్నాడు. మరియు ఈ కారణము చేత, పాత నిబంధన వేదాంతశాస్త్రములోని పురోగమనములు కూడా అనేక విధములుగా జరిగాయి.
ఈ సమయములో, బైబిలులోని పాత్రలు లేక రచయితలు లేఖనములను భిన్నకాలికముగా పరిగణించిన బైబిలు ఉదాహరణను మనము చూడవలసియున్నది. మన ఉద్దేశముల కొరకు, భిన్నకాలిక పురోగమనముల పట్ల మనము కలిగియున్న ఆసక్తిని ఉదాహరించు మరియు క్రమపరచు ఒక ఉదాహరణను మాత్రమే మనము చూద్దాము.
మత్తయి 19:3లో, కొంత మంది పరిసయ్యులు ఈ ప్రశ్నను అడిగి యేసును పరీక్షించారు:
ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? (మత్తయి 19:3).
ఇక్కడ వారు అడిగిన ప్రశ్న యేసు దినములలో రబ్బీల పాఠశాలలలో ఎక్కువగా చర్చించబడేది. మరియు వారి మధ్య భిన్నాభిప్రాయాలు ద్వితీయోపదేశకాండములో మోషే బోధన మీద ఆధారపడియుండేవి. ద్వితీ 24:1లో మోషే వ్రాసిన మాటలను వినండి:
ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను (ద్వితీ 24:1).
యేసు దినములలో, “మానభంగ సూచన” అనే పదము యొక్క అర్థమును గూర్చి పెద్ద వివాదము తలెత్తింది. భర్తను నొప్పించిన ఏ కారణమైనా విడాకులకు మాన్యమైన కారణమని ఈ వ్యక్తీకరణ తెలియజేస్తుంది అని కొందరు రబ్బీలు నమ్మారు, కాని మరి కొందరు ఈ పదమును జారత్వము అనే అర్థము వచ్చు విధముగా మాత్రమే అనువదించారు. మత్తయి 19:4-6లో యేసు మొదటిగా పరిసయ్యులకు స్పందించిన విధానమును వినండి.
ఆయన సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను (మత్తయి 19:4-6).
పరిసయ్యుల ప్రశ్నకు జవాబిచ్చుటకు, ఆదికాండము మొదటి అధ్యాయములలో వివాహమును గూర్చి ఇవ్వబడిన విషయములకు ఏకకాలిక సారాంశమును యేసు ఇచ్చాడు.
సృష్టిని పాపము పాడుచేయక ముందు “ఆది నుండి” ఉన్న ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చిన అనేక విశేషతల వైపుకు యేసు ఆసక్తిని మళ్లించిన విషయమును గమనించండి. ఆది. 1:27ను ప్రస్తావిస్తూ, దేవుడు మానవులను “స్త్రీగాను పురుషునిగాను” చేశాడని ఆయన గుర్తించాడు. ఆది. 2:24ను చెబుతూ, యేసు అన్నాడు, “ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు.” తరువాత యేసు ఈ ముగింపును ఇచ్చాడు, “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” వివాహము చేసుకున్న స్త్రీ పురుషులు ఏక శరీరులగుదురు అనేది వివాహమును గూర్చిన వాస్తవిక సృష్టి నియమము అయ్యున్నది.
సృష్టి సమయములోని వివాహమును గూర్చిన వేదాంతశాస్త్ర దృక్పథమును యేసు వివరించిన తరువాత, పరిసయ్యులు ఆయనను ప్రత్యేకముగా ద్వితీ. 24ను గూర్చి అడిగారు. మత్తయి 19:7లో వారు యేమని అడుగుతున్నారో వినండి:
ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెను? (మత్తయి 19:7)
మొదటి శతాబ్దములోని నమ్మకములకు అనుగుణంగా, వివాహమును గూర్చి మోషే బోధనలు ఆదియందు దేవుడు నియమించిన వేదాంతశాస్త్ర నిర్మాణములకు అనుగుణంగా ఉన్నాయని యేసుకు మరియు పరిసయ్యులకు తెలుసు. కాబట్టి, విడాకులను గూర్చి మోషే చెప్పిన విషయముల వెలుగులో తాను అప్పుడే పలికిన మాటలను యేసు ఎలా సమర్థించగలడు?
దీనికి స్పందనగా, సృష్టికి మరియు మోషే కాలమునకు మధ్య ఒక ప్రాముఖ్యమైన భిన్నకాలిక పురోగమనము, ఒక వేదాంతశాస్త్ర మార్పు జరిగింది అని యేసు వివరించాడు. మత్తయి 19:8లో ఆయన ఇలా అన్నాడు:
మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు (మత్తయి 19:8).
మోషే ధర్మశాస్త్రమును ఇచ్చే సమయమునకు, దేవుడు మానవ పాపమునకు స్పందించి వివాహమును గూర్చిన వేదాంతశాస్త్రమును కొన్ని విధములుగా మార్చాడని యేసు తెలియజేశాడు. లేఖనములను భిన్నకాలికముగా పరిశీలిస్తూ, మోషే కాలమును ఆదాము కాలముతో పోల్చుతూ ఇలా అన్నాడు, “ఆది నుండి ఆలాగు జరుగలేదు,” మరియు మోషే కాలములో “[ఇశ్రాయేలీయుల] యొక్క హృదయాలు కాఠిన్యత పొందాయని” ఆయన గుర్తు చేశాడు.
కాబట్టి, కొన్ని కారణముల వలన విడాకులను అనుమతిస్తూ దేవుడు మానవ స్థితికి స్పందించాడుగాని, అది దేవుడు కోరిన విషయము కాదు అని యేసు నిర్థారించాడు. ద్వితీ. 24లో ఉన్న ధర్మశాస్త్ర నియమము ఇశ్రాయేలీయుల యొక్క హృదయ కాఠిన్యతకు దేవుడు ఇచ్చిన అనుమతితో కూడిన నియమము మాత్రమే.
వివాహము మరియు విడాకుల పట్ల యేసు చేసిన భిన్నకాలిక సమీక్ష విడాకుల కొరకు కారణములను కఠినపరచునట్లు ఆయనను పురికొల్పింది. మత్తయి 19:9లో మనము చదువుతున్నట్లు:
వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, . . . మీతో చెప్పు చున్నాను (మత్తయి 19:9).
కాబట్టి యేసు వివాహమును మరియు విడాకులును పాత నిబంధన వేదాంతశాస్త్రములోని భిన్నకాలిక పురోగమనముల వెలుగులో అర్థము చేసుకున్నాడని మనము చూడవచ్చు. మొదటిగా, విడాకులు అనేది ఊహించలేనిది. తరువాత, పాపము దేవుని ప్రజల హృదయాలను కఠినపరచినప్పుడు, విడాకులు అనుమతించబడినదిగాని ప్రోత్సహించబడలేదు. ఈ సందర్భములో, మానవ పరిస్థితిలోని మార్పు పాత నిబంధన వేదాంతశాస్త్రములో మార్పుకు దారితీసింది. యేసు ఇక్కడ పాత నిబంధనను ఉపయోగించిన విధానము పాత నిబంధన వేదాంతశాస్త్రమును భిన్నకాలికముగా ఉపయోగించుట సరియైనదేనని మరియు అది మనకు నేడు ఎంతో అవసరమైనదని తెలియజేస్తుంది.
పాత నిబంధన పట్ల భిన్నకాలిక పద్ధతులను గూర్చి ఒక సామాన్య ధోరణిని మనము కలిగియున్నాము కాబట్టి, మన పాఠంలోని రెండవ ముఖ్యమైన అంశము వైపుకు మనము తిరగవలసియున్నది: యుగానుసార వేదాంతశాస్త్ర పురోగమనములు.
మీ జీవితములోని గత సంవత్సరమును గూర్చి మీరు మీ స్నేహితునికి ఒక ఉత్తరము వ్రాస్తున్నారని ఊహించుకోండి. ఈ ఉత్తరము వ్రాయుటకు మీరు ఉపయోగించదగిన ఒక ప్రణాళిక ఏమనగా, ఆ సంవత్సరమును కొన్ని ప్రాముఖ్యమైన భాగములుగా విభజించునట్లు మీ జీవితములోని కొన్ని ప్రాముఖ్యమైన కారకాలు కొన్ని విధాలుగా ఎలా కలిసాయో వివరించుట. ఉదాహరణకు, మీ కుటుంబ జీవితము, మీ సంఘ జీవితము, మరియు మీ ఆత్మీయ స్థితి సంవత్సరములోని ప్రతి నెలలో ఎలా మార్పుచెందాయో మీరు వివరించవచ్చు. మీ ఉత్తరములోని పేరాలను ఈ విధముగా మొదలుపెట్టవచ్చు: “జనవరిలో ఇలా జరిగింది”; “ఫిబ్రవరిలో ఇది జరిగింది” ఇంకా ఇలా.
ఇదే విధముగా, బైబిలు వేదాంతవేత్తలు చాలాసార్లు పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క పురోగమనమును దేవుని ప్రత్యక్షతలు చరిత్రను ముఖ్యమైన కాలములు లేక యుగములుగా విభజించిన విధానముల ఆధారంగా వివరిస్తారు.
పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క యుగానుసార పురోగమనములను వివరించుటకు, మనము రెండు విషయములను చూద్దాము. మొదటిగా, పాత నిబంధనలోని పలు యుగములలో భిన్నమైన వేదాంతశాస్త్ర ఉద్ఘాటనలను మనము చూద్దాము. మరియు రెండవదిగా, యుగముల మధ్య గల అవయవ సంబంధమైన వేదాంతశాస్త్ర ఐక్యతను మనము చూద్దాము. ప్రత్యేకమైన వేదాంతశాస్త్ర ఉద్ఘాటనలు కలిగిన యుగములుగా పాత నిబంధన ఎలా విభజించబడుతుందో మొదట చూద్దాము.
పాత నిబంధన చరిత్రను ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర కాలములుగా విభజించుటకు అనేక మార్గములు ఉన్నాయి. మనము భౌగోళిక విభజనల మీద దృష్టి పెట్టవచ్చు; పాత నిబంధనను మనము సాహిత్యపరముగా కూడా విభజించవచ్చు. అయితే ఈ పాఠంలో మనము ఈ పాఠ్యక్రమములోని మునుపటి పాఠములలో ప్రస్తావించిన పాత నిబంధనలోని ఒక ప్రాముఖ్యమైన లక్షణమును చర్చిస్తూ యుగానుసార పురోగమనములను వివరించుదాము: దైవిక నిబంధనల యొక్క ప్రభావము.
మునుపటి పాఠంలో మనము చూసినట్లు, పాత నిబంధన ప్రతి దైవిక-మానవ అనుబంధమును మూడు నిబంధనా క్రియాశీలకములతో వర్ణిస్తుంది: దైవిక ఉపకారము యొక్క ప్రదర్శన, దేవుని పట్ల మానవులు కలిగియుండవలసిన రాజభక్తి, మరియు విధేయతకు ఆశీర్వాదములు మరియు అవిధేయతకు శాపముల ఫలితములు. ఈ నిబంధనా క్రియాశీలకాలు పాత నిబంధన అంతటా స్థిరముగా ఉండినవి. కాబట్టి, పాత నిబంధన చరిత్రలో అగుపడు వేదాంతశాస్త్ర నిర్మాణములను క్రమపరచుటకు అవి ఉపయోగకరముగా ఉంటాయి.
అయితే పాత నిబంధన ఈ సామన్య దృష్టిలో మాత్రమే నిబంధనానుసారమైనది కాదు. భిన్నమైన వేదాంతశాస్త్ర ఉద్ఘాటనలతో దేవుడు ఆరు సార్లు ముఖ్యమైన నిబంధనలను స్థాపించాడు: ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే, దావీదుతో చేసిన నిబంధనలు మరియు నూతన నిబంధన. ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు, ప్రతి ముఖ్యమైన నిబంధన యొక్క వేదాంతశాస్త్ర ఉద్ఘాటనను గూర్చి ఒక త్వరిత అవలోకనమును ఇచ్చుట సహాయకరముగా ఉంటుంది.
ఆరు పాత నిబంధన నిబంధనలను మూడు ముఖ్యమైన శ్రేణులుగా విభజించవచ్చు. మొదటిగా, ఆదాము మరియు నోవహులతో చేసిన సార్వత్రిక నిబంధనలు. రెండవదిగా, అబ్రాహాము, మోషే, మరియు దావీదుతో చేసిన జాతీయ నిబంధనలు. మరియు మూడవదిగా, పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన నూతన నిబంధన. సార్వత్రిక నిబంధనలతో ఆరంభించి మూడు శ్రేణులను చూద్దాము.
ఆదాము మరియు నోవహుతో చేయబడిన నిబంధనలను మనము “సార్వత్రికమైనవి” అని సంబోధిస్తాము ఎందుకనగా అవి దేవుడు మరియు సమస్త మానవాళి మధ్య చేయబడినవి. కాబట్టి, ఈ నిబంధనల యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములు దేవుడు మరియు సమస్త ప్రజల మధ్య ఉన్న అనుబంధమును గూర్చి అనేక విషయములను తెలియజేస్తాయి.
ఆదాముతో చేసిన నిబంధన ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములలో స్థాపించబడిన దైవ-మానవ అనుబంధముల యొక్క నియంత్రణను సంబోధిస్తుంది. హెబ్రీ పదమైన బెరిట్, సాధారణముగా “నిబంధన” అని అనువదింపబడుతుంది, ఆదికాండము యొక్క మొదటి మూడు అధ్యాయములలో కనిపించనప్పటికీ, ఆదాముతో దేవుని అనుబంధమును నిబంధనగా లేక కనీసం నిబంధనను ప్రతిబింబించు ఒక ఏర్పాటుగా అర్థము చేసుకొనుటకు గొప్ప రుజువు ఉన్నదని ఇతర పాఠ్యక్రమములలో మనము చూశాము.
మొదటి దైవ నిబంధనా పరిపాలనలో, లేఖనమంతటిలో ఈ నిబంధన యొక్క వేదాంతశాస్త్ర ఉద్ఘాటన ఎంత మౌలికముగా ఉన్నదంటే దానిని మనము “పునాదుల నిబంధన” అని పిలువవచ్చు. ఆదాము మొదలుకొని నోవహు దినముల వరకు బయలుపరచబడిన ప్రతి వేదాంతశాస్త్ర నిర్మాణము ఆదాము నిబంధనలోని ఉద్ఘాటన ద్వారా బహుగా ప్రభావితము చెందింది. పాపమునకు ముందు మానవాళిని తోటలో ఉంచుట ద్వారా దేవుడు ఎంత ఉపకారిగా ఉండెనో మరియు పాపము తరువాత మానవాళికి చెడు మీద నిత్య విజయమును వాగ్దానము చేయుట ద్వారా దేవుడు ఎంత కరుణగలవాడో అవి ఉద్ఘాటించాయి. తమ సృష్టికర్తకు నమ్మకముగా సేవ చేయవలసిన మౌలిక బాధ్యత మానవులందరికీ ఉన్నదని ఆదాము మరియు దేవుని మధ్య అనుబంధము ఉద్ఘాటిస్తుంది. అంతేగాక, దేవుడు ఆజ్ఞాపించిన దానికి విధేయత చూపుటకు లేక అవిధేయత చూపుటకు మానవులు చేయు ఎంపిక ద్వారా వారికి కలుగు ఆశీర్వాదములు మరియు శాపములను గూర్చి ఆదికాండములోని ఈ అధ్యాయములు ఉదాహరిస్తాయి.
దేవుడు నోవహుతో చేసిన నిబంధన, రెండవ సార్వత్రిక నిబంధనయై యున్నది. ఈ నిబంధన ఆదికాండము 6 మరియు 7లో చాలా స్పష్టముగా ప్రస్తావించబడింది. నోవహు నిబంధనలో దేవుడు పాపము పట్ల మానవుడు కలిగియున్న వాంఛను పరిగణించి ప్రకృతిలో స్థిరత్వమును కలిగించుట ద్వారా మన పట్ల సహనమును కనుపరచాడు. ఈ కారణము చేత, ఈ నిబంధనను మనము “స్థిరత్వ నిబంధన” అని పిలువవచ్చు. ఆది. 8:21-22లో దేవుడు చెప్పినట్లు:
ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును, కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను (ఆది. 8:21-22).
21వ వచనము చెబుతున్నట్టు, “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అనే వాస్తవమును దేవుడు పరిగణించాడు. కాబట్టి, మానవుల యొక్క స్థిరమైన పాప స్వభావమునకు ప్రతిస్పందనగా, విమోచించబడిన మానవాళి ఆయన ఉద్దేశములను నెరవేర్చునట్లు ప్రకృతి పట్ల ఒక నూతనమైన సామాన్య కృపను కలిగించు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను దేవుడు స్థాపించాడు. మనము పడినను తిరిగి లేచి ఆయనను సేవించుటకు వీలుగా ఒక భద్రమైన, ఊహించదగిన ప్రాకృతిక లోకమును స్థాపించుట ద్వారా దేవుడు దీనిని చేశాడు.
నోవహు నిబంధనలోని క్రియాశీలకముల యొక్క గురి నోవహు మొదలుకొని అబ్రాహాము వరకు ఉన్న ప్రతి దైవిక ప్రత్యక్షతలో కనిపించాయి. ఈ కాలములోని ప్రతి దైవ మానవ సంకర్షణ ప్రకృతిలో సుదీర్ఘమైన స్థిరత్వము అను దేవుని ఉపకారము ద్వారా, ప్రతి మానవుడు దేవుని పట్ల మరియు ఆయన ఉద్దేశముల పట్ల కలిగియుండవలసిన రాజభక్తి యొక్క అవసరత ద్వారా, మరియు భూమియందు వ్యాపించుచు పలు దేశములను స్థాపించుచుండగా ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క పరిణామములను మానవులు ఎదుర్కున్న విశేషమైన మార్గముల ద్వారా ప్రభావితము చెందాయి.
సార్వత్రిక నిబంధనల తరువాత, తన విశేష జనాంగమైన ఇశ్రాయేలుతో దేవుడు జాతీయ నిబంధనలను స్థాపించాడు: అబ్రాహాము, మోషే మరియు దావీదులతో నిబంధనలు. చరిత్రలోని ఈ ఘట్టములలో, దేవుడు తన నిబంధనా ధ్యాసను కేవలం ఒక జాతి ప్రజలకు పరిమితము చేసి, మిగిలిన మానవాళి అంతటిని దేవుని సేవలోనికి నడిపించు దేశముగా ఇశ్రాయేలును స్థాపించాడు.
దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను గూర్చి మనకు ఆదికాండము 15వ మరియు 17వ అధ్యాయములో సువిదితమైన ఉల్లేఖనము లభిస్తుంది. అబ్రాహాముతో చేసిన నిబంధన ఇశ్రాయేలు యొక్క సంఖ్యాభివృద్ధిని గూర్చి మరియు వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుటను గూర్చి వాగ్దానము చేస్తుంది, మరియు దాని నుండి ఇశ్రాయేలు దేవుని ఆశీర్వాదములను లోకమంతటా వ్యాపింపజేయవలసి యుండినది. ఈ కారణాన్నిబట్టి అబ్రాహాముతో చేయబడిన నిబంధనను “వాగ్దాన నిబంధన”గా గుర్తించవచ్చు.
అబ్రాహాము మరియు మోషే కాలముల మధ్య ఉన్న సమయమును గూర్చి మనము ఏమి చదివినా, అబ్రాహాముతో దేవుని నిబంధన యొక్క ఉద్ఘాటన ఆ కాలమంతటిని నింపింది అని మనము కనుగొంటాము. అబ్రాహాము మరియు అతని వంశము పట్ల దేవుడు చూపిన విశేషమైన ఉపకారము, పితరుల నుండి ఆయన ఆశించిన రాజభక్తి, మరియు ఇశ్రాయేలు పితరుల మీద ఆయన ఆశీర్వాదములు మరియు శాపములను గూర్చిన ఉదాహరణలు మరలా మరలా కనిపిస్తాయి.
వారిని సీనాయి యొద్దకు తెచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో రెండవ నిబంధన చేశాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను గూర్చిన ప్రాథమిక రికార్డు మనకు నిర్గమ. 19-24 అధ్యాయాల్లో కనబడుతుంది. దేవుడు పన్నెండు గోత్రములను సేకరించి వారికి పది ఆజ్ఞలను మరియు నిబంధనా గ్రంథమును ఇచ్చుట ద్వారా వారిని రాజకీయపరముగా ఏక రాజ్యముగా చేసిన విషయములను ఈ అధ్యాయములు ఉద్ఘాటిస్తాయి. ఈ కారణాన్నిబట్టి, మోషేతో చేయబడిన నిబంధన, “ధర్మశాస్త్ర నిబంధన” అని పిలువబడవచ్చు.
మోషే మరియు దావీదు మధ్య కాలములో బయలుపరచబడిన వేదాంతశాస్త్ర నిర్మాణములు మోషేతో దేవుడు చేసిన నిబంధనా ఉద్ఘాటన ద్వారా బహుగా ప్రభావితము చేయబడినవి. ధర్మశాస్త్రము ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన ఉపకారముగా ఇవ్వబడినది. ఇశ్రాయేలు దేవునికి నమ్మకముగా ఉండవలసిన మార్గములను ధర్మశాస్త్రము తెలియజేసింది. ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క పరిణామాలు మోషే ధర్మశాస్త్ర ఆధారంగా ఇశ్రాయేలు యొక్క ఆదిమ జాతీయ చరిత్రలో ప్రత్యక్షపరచబడినవి.
తరువాత, దావీదు పరిపాలనలో ఇశ్రాయేలు ఒక సంపూర్ణ రాజ్యముగా మార్చబడినప్పుడు, దేవుడు దావీదుతో ఒక నిబంధనను చేశాడు. దావీదు జీవితములోని ఏ సమయములో దేవుడు ఈ నిబంధనను అధికారికముగా స్థాపించాడో మనకు తెలియదుగాని, 2 సమూ. 7, 1 దిన. 17, కీర్తనలు 89 మరియు కీర్తనలు 132 వంటి వాక్యభాగములు దావీదుతో చేసిన నిబంధనలోని మౌలిక విషయములను తెలియజేస్తాయి. దావీదుతో చేయబడిన నిబంధన ఇశ్రాయేలులో రాజరికము మీద ఉద్ఘాటన పలికింది. ఇంకా స్పష్టముగా చెప్పాలంటే, అది దావీదు యొక్క రాజరిక వంశము నిత్యము నిలచుటను గూర్చి, ఇశ్రాయేలు రాజధానిగా యెరూషలేమును గూర్చి మరియు దేవాలయములో ఆరాధనను గూర్చి వాగ్దానము చేసింది. దేవుని నుండి దూరమైనప్పుడు దావీదు వంశములోని ప్రతి ఒక్కరు శ్రమపొందవలసియున్నప్పటికీ, ఇశ్రాయేలు సింహాసనము మీద నిత్యముండునట్లు దావీదు కుటుంబమును దేవుడు ఎన్నుకొన్న విషయము ఎన్నడను విడనాడబడదు. ఈ కారణాన్ని బట్టి, దేవుడు దావీదుతో చేసిన నిబంధనను మనము, “రాజత్వమును గూర్చిన నిబంధన” అని పిలువవచ్చు.
దావీదు రాజరిక నిబంధన యొక్క క్రియాశీలకములు దావీదు కాలము నుండి పాత నిబంధన ముగింపు కాలము వరకు ఉన్న వేదాంతశాస్త్ర నిర్మాణములను బహుగా ప్రభావితము చేశాయి. దావీదు గృహము ద్వారా మరియు దావీదు గృహమునకు దేవుడు అనేక విధములుగా దయను చూపాడు. ఆయన దావీదు వంశములోని రాజుల నుండి మరియు వారి అధికారములో ఉన్న దేశము నుండి రాజభక్తిని ఆశించాడు. ఇశ్రాయేలుకు మరియు ఇతర దేశముల కొరకు ఆశీర్వాదములు మరియు శాపముల పరిణామములు ప్రత్యక్షంగానైనా లేక పరోక్షంగానైనా దావీదు యొక్క రాజ వంశమునకు ముడిపడియున్నాయి.
సార్వత్రిక మరియు జాతీయ నిబంధనల యొక్క ఉద్ఘాటనలను మనస్సులో ఉంచుకొని, పాత నిబంధనలో ప్రస్తావించబడిన చివరి ముఖ్య నిబంధనయైన నూతన నిబంధనను మనము చూడవలసియున్నది.
పాత నిబంధన యొక్క తదుపరి చరిత్రలో, ఇశ్రాయేలు చెరలోనికి వెళ్లిన సమయమును ఇశ్రాయేలులోని ప్రవక్తలు ఎదుర్కొన్నారు. అయితే, చెర తరువాత స్థాపించబడబోవు నిబంధనను గూర్చి వారు మాట్లాడారు. ఆ కాలములో, ఇశ్రాయేలు పాపములను ఒప్పుకొంటుంది మరియు దేవుడు చరిత్రను అంతిమ ఘట్టములోనికి నడిపిస్తాడు. మరియు ఈ ఆశీర్వాదములతో పాటు, దేవుడు తన ప్రజలతో ఒక అంతిమ నిబంధనను స్థాపిస్తాడని ప్రవక్తలు తెలియజేశారు. ఈ అంతిమ నిబంధనను గూర్చి బైబిలులో అనేక చోట్ల ప్రస్తావించబడింది, కాని నూతన నిబంధనను గూర్చి యిర్మీయా 31:31లో యిర్మీయా సూటిగా ఎలా మాట్లాడుతున్నాడో వినండి.
ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు (యిర్మీయా 31:31).
చెర తరువాత ఆయన ప్రజలను పునఃస్థాపిస్తాననే వాగ్దానమును మరియు భూదిగంతముల వరకు ఆయన రాజ్యమును వ్యాపింపజేస్తాననే వాగ్దానమును దేవుడు నెరవేర్చినప్పుడు నూతన నిబంధన రూపొందించబడినది. మరియు ఈ కారణము చేత, నూతన నిబంధనను మనము “నెరవేర్పు నిబంధన” అని పిలువవచ్చు.
ఈ నూతన నిబంధనను గూర్చి రానున్న పాఠములలో మరింత క్షుణ్ణంగా పరిశీలించుదాము. కాని ఈ సమయములో అది ఎలా బహిర్గతమైనదో క్రోడీకరించుదాము. ఈ నెరవేర్పు యుగము క్రీస్తు యొక్క మొదటి రాకడతో ఆరంభమైనది అని క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. సిలువ మీద ఆయన చేసిన విమోచన కార్యము, ఆయన పునరుత్థాన విజయము, ఆయన ఆరోహణము, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు మరియు అపొస్తలుల యొక్క కార్యములు — ఈ సన్నివేశములన్ని బైబిలు చరిత్రలో ఒక నూతన యుగమును ఆరంభించాయి. మన రోజులలో, సువార్త ద్వారా క్రీస్తుయందు విశ్వాసము భూదిగంతముల వరకు వ్యాపించుచుండగా ఈ నూతన నిబంధన యొక్క కొనసాగింపును మనము అనుభవిస్తాము. మరియు యేసు తిరిగి వచ్చి సమస్తమును నూతనపరచునప్పుడు ఈ నూతన నిబంధన యొక్క ముగింపును మనము చూస్తాము.
ఈ నూతన నిబంధన క్రీస్తు యొక్క మొదటి రాకడ నుండి ఆయన మహిమకరమైన రెండవ రాకడ వరకు ఉన్న ప్రతి వేదాంతశాస్త్ర నిర్మాణముతో గుర్తింపబడుతుంది. దేవుడు క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ద్వారా మరియు అపొస్తలుల పరిచర్య ద్వారా కార్యము చేయుచుండగా ఆయన చూపిన ఉపకారము చరిత్రయంతటిలో కంటే ఈ కాలములో గొప్పదిగా ఉన్నది. క్రొత్త నిబంధన ప్రత్యక్షత మన దినములలో మనము ఆయన ఉపకారములను పొందు అనేక మార్గములను జ్ఞాపకము చేస్తుంది, కాని క్రీస్తు తిరిగివచ్చినప్పుడు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో మన దాయత్వమైన దయను మనము పొందుకుంటాము.
దీనికి తోడుగా, భూమి మీద యేసు గడిపిన సమయమును గూర్చిన క్రొత్త నిబంధన వివరణ ఆయనకు అందరు రాజభక్తి గలవారిగా ఉండాలని ఉద్ఘాటించింది. ఆయన కాలములో ఇది వాస్తవమైయున్నది, మరియు నేటికి కూడా ఇది వాస్తవముగానే ఉన్నది. మరియు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు, ఆయనకు మనము అంతములేని రాజభక్తిని చూపుతామని క్రొత్త నిబంధన వివరిస్తుంది.
క్రొత్త నిబంధన ప్రత్యక్షత క్రొత్త నిబంధన పరిణామములైన ఆశీర్వాదములు మరియు శాపములను గూర్చి కూడా తెలియజేస్తుంది. క్రీస్తు రాజ్య స్థాపనలో క్రీస్తును ఎరిగినవారు చేసుకున్న ఎంపికలకు మరియు అపొస్తలులకు గొప్ప పరిణామాలు ఉంటాయని అది నివేదిస్తుంది. విధేయత మరియు అవిధేయతలకు కలుగు పరిణామములను మనము నేడు పరిగణించవలసిన మార్గములను అది తెలియజేస్తుంది. మరియు, క్రీస్తు రాకడను గుర్చి క్రొత్త నిబంధన దర్శనములో అంతిమ, నిత్య తీర్పు మరియు ప్రతిఫలములను గూర్చిన నిబంధనా పరిణామములు ఉన్నాయి.
కాబట్టి ఆరు ముఖ్యమైన దైవిక నిబంధనలు అవి బయలుపరచబడిన కాలములోని వేదాంతశాస్త్రములో ఎంతగా చొచ్చుకుపోయాయంటే, అవి పాత నిబంధనలోని ముఖ్యమైన చారిత్రిక యుగముల యొక్క పలు ఉద్ఘాటనలను అర్థము చేసుకొనుటకు మనకు మార్గములను అందించాయి. ఆదాము నిబంధన పునాదుల యుగమును పరిచయం చేసింది; నోవహు నిబంధన ప్రాకృతిక స్థిరత్వ యుగమును ఆరంభించంది; అబ్రాహాము నిబంధన ఇశ్రాయేలు కొరకు వాగ్దానములను స్థాపించింది; మోషే నిబంధన దేవుని ధర్మశాస్త్రమును పరిచయం చేసింది; దావీదు నిబంధన రాజరికమును ఉద్ఘాటించినది మరియు నూతన నిబంధన మునుపటి నిబంధనలన్నిటిని అంతిమ నెరవేర్పులోనికి నడిపించంది.
ప్రతి నిబంధనా యుగములో భిన్నమైన ఉద్ఘాటనలు ఉన్నప్పటికీ, ఈ యుగములలోని వేదాంతశాస్త్రము యొక్క అవయవ సంబంధమైన ఐక్యతను గూర్చి కూడా మనము మాట్లాడవచ్చు. పాత నిబంధన చరిత్రలోని యుగములు ఒకదానితో ఒకటి పూర్తిగా భిన్నముగా లేవు. బదులుగా, ఒక సజీవమైన జీవిలోని ఎదుగుదల స్థాయిల వలె అవి ఒకదానితో ఒకటి కొనసాగింపును కనుపరచాయి.
ఈ అవయవ సంబంధమైన ఐక్యతను గూర్చి మరి ఎక్కువగా అర్థము చేసుకొనుటకు, పలు నిబంధనా యుగముల మధ్య ఉన్న అనుబంధములలోని మూడు అంశములను మనము పరిశీలించుదాము. మొదటిగా, దేవుని రాజ్యము యొక్క పరిపాలకులుగా పాత నిబంధన నిబంధనలు ఎలా ఐక్యపరచబడినవో మనము చూద్దాము. రెండవదిగా, తదుపరి నిబంధనలకు మునుపటి నిబంధనలు ఇచ్చిన అధికారమును చూద్దాము. మరియు మూడవదిగా, మునుపటి నిబంధనలను తదుపరి నిబంధనలకు అన్వయించవలసిన అవసరతను గూర్చి మాట్లాడదాము. ఆయన రాజ్య పరిపాలకులుగా దేవుని నిబంధనల ఐక్యతను మొదటిగా చూద్దాము.
లేఖనములోని ముఖ్యమైన దైవిక నిబంధనలు పలు చారిత్రిక ఘట్టములలో దేవుడు రాజ్యమును పాలించుటకు ముఖ్యమైన మార్గములుగా పని చేశాయి. పాత నిబంధన చరిత్ర లోకమంతటా దేవుని పరిపాలనను వ్యాపింపజేయు గమ్యము వైపుకు కొనసాగగా, పలు సమయాలలో పలు విధములుగా ఆయన రాజ్యములోని జీవితమును నడిపించుటకు దేవుడు పలు నిబంధనలను స్థాపించాడు. అయితే పాత నిబంధనలోని నిబంధనలన్ని ఒకే అంతిమ లక్ష్యము కలిగినవిగా ఉన్నాయి: భూమియందంతట దేవుని మహిమగల రాజ్యమును వ్యాపింపజేయుట.
నిబంధనల యొక్క ఈ పరిపాలనా కార్యము నిబంధనల మధ్య గొప్ప ఐక్యతను ఆశించునట్లు మనలను పురికొల్పుతుంది. అవి ఒకదానితో ఒకటి భిన్నముగా ఉన్నందున పరిగణ కోల్పోయిన వేర్వేరు కార్యక్రమములు కాదు. అవి ఒకే రాజ్య ఉద్దేశము ద్వారా విడదీయలేని విధముగా జతపరచబడినవి. వాస్తవానికి, పాత నిబంధన నిబంధనలు సంక్రమించు వరుస వాటి మధ్య ఉన్న ఐక్యతను బయలుపరుస్తుంది. ఆదాముతో చేసిన నిబంధన దేవుని రాజ్య లక్ష్యములోని మౌలిక అంశములను మరియు ఆ లక్ష్యమును చేరుటకు మానవులు చేసిన సేవను స్థాపించింది, నోవహుతో చేసిన నిబంధన ప్రాకృతిక స్థిరత్వమును ఒక భాగముగా స్థాపించింది, మరియు దానిలో విఫలమగు మానవాళి దేవుని రాజ్య లక్ష్యమును చేరు అవకాశమును పొందుకుంటుంది. అబ్రాహాముతో చేసిన నిబంధన సమస్త మానవాళిని దేవుని రాజ్య లక్ష్యము వైపుకు నడిపించు జనాంగముగా ఇశ్రాయేలును స్థాపించింది. మోషేతో చేసిన నిబంధన ఈ నాయకత్వ దేశమును రాజ్య లక్ష్యము వైపుకు నడిపించు ధర్మశాస్త్రమును బయలుపరచింది. దావీదుతో చేసిన నిబంధన వారిని ఇదే గమ్యమునకు నడిపించుటకు ఒక శాశ్వతమైన సింహాసనమును ఏర్పరచింది. మరియు చివరిగా, నూతన నిబంధన మానవాళి యొక్క వైఫల్యాలకు శాశ్వత పరిష్కారం అందించి దేవుని రాజ్య లక్ష్యమును పూర్తి చేస్తుంది. పాత నిబంధన నిబంధనల మధ్య గల ఈ తార్కిక పరిణామములు అవన్నీ కూడా దేవుని రాజ్య పరిపాలకులుగా ఐక్యపరచబడినవని సూచిస్తాయి.
పాత నిబంధన నిబంధనలు దేవుని రాజ్యము యొక్క ఒకే లక్ష్యమును ఎలా ఉపయోగించాయో చూశాము కాబట్టి, ఇప్పుడు వాటి మధ్య ఉన్న అవయవ ఐక్యతను వాటికున్న అధికారము వెలుగులో కూడా పరిశీలించాలి.
మునుపటి నిబంధనా యుగములు తరువాత కాలములలోని నిర్మాణములలో ఏ విధంగా గుర్తించబడినవో మనము పరిశీలించినప్పుడు, మునుపటి నిబంధనల యొక్క అధికారము తరువాత నిబంధనలకు కూడా వ్యాపించింది అని మనము వెంటనే నిర్థారణ పొందగలము. ఇది నిజమని తెలియజేయుటకు లెక్కలేనన్ని మార్గములు ఉన్నాయి, కాని సులువుగా ఉండుట కొరకు మనము కేవలం రెండు దశలలో మాత్రమే చూద్దాము; మొదటిగా, మోషేకు ముందు నిబంధనల యొక్క కొనసాగుచున్న అధికారము; మరియు రెండవదిగా, మోషేతో నిబంధన యొక్క కొనసాగుచున్న అధికారము.
ఆయనకు ముందు వచ్చిన దైవ నిబంధనలను మోషే ఎలా ఉపయోగించాడో మనము చూస్తే, అవి ఆయన దినములలో అధికారము కలిగియున్నవి అని అతడు పరిగణించాడనుటలో ఏ సందేహము లేదు. ఆదికాండమును ఒకసారి పరిగణించండి, అక్కడ మోషే ఆదాము, నోవహు మరియు అబ్రాహాముతో చేయబడిన నిబంధనలను గూర్చి వ్రాశాడు. ఈ మూడు నిబంధనలు మోషే దినముల కంటే చాలా ముందు స్థాపించబడినవి, కాని తన కాలములో నివసించుచున్న ఇశ్రాయేలీయుల ఎదుట వాటి అధికారమును ఉద్ఘాటించుటకు వాటిని గూర్చి అతడు ఆదికాండములో వ్రాశాడు. ఆదాము, నోవహు మరియు అబ్రాహాముకు మునుపు ఇవ్వబడిన నిబంధనలు అంతరించిపోయాయని మోషే నమ్మలేదు. ఆదికాండములో వ్రాసినట్లు వాటిని గూర్చి ఆయన ఎందుకు వ్రాశాడంటే, సీనాయి యొద్ద స్థాపించబడిన ధర్మశాస్త్ర నిబంధన క్రింద ఉన్న ఇశ్రాయేలీయుల జీవితముల మీద వాటికి అధికారం ఉందని అతడు నమ్మాడు. మోషే కాలములో నివసించిన ప్రజల యొక్క జీవితములను శాసించుటకు మునుపటి నిబంధనలకు ఇంకను అధికారం ఉండెను.
రెండవ స్థానములో, మోషేతో చేయబడిన నిబంధనను మనము పరిగణిస్తే, దానికి కూడా అతని కాలము తరువాత కొనసాగుచున్న అధికారం ఉండెను. ఉదాహరణకు, 2 దిన. 6:16లో దావీదు నిబంధనను గూర్చి మరియు మోషే నిబంధనను గూర్చి సొలొమోను మాట్లాడిన విధానమును వినండి.
నీవు నాముందర నడచినట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము (2 దిన. 6:16).
ఈ వాక్యభాగములో, సొలొమోను మొదటిగా ఇలా చెబుతూ దావీదుతో చేయబడిన రాజరిక నిబంధనను ప్రస్తావించాడు “ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట [దావీదుకు] నీకుండకపోడు.” అయితే సొలొమోను ఎంతో సునాయాసముగా మోషే నిబంధనలోనికి జారుకొనుటను గమనించండి. దావీదు కుమారులు “నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల” మాత్రమే పరిపాలిస్తారు అని అతడు జోడించాడు. దావీదు నిబంధన స్థాపించబడిన తరువాత కూడా మోషే నిబంధన అధికారికముగా ఉన్నదని సొలొమోను మాటలు ఇక్కడ తెలియజేశాయి.
ఇప్పుడు ఒక నిమిషంలో మనము ఇప్పటి వరకు చూసిన వాటికి కొన్ని అర్హతలను జతచేద్దాము, కాని తదుపరి పాత నిబంధన నిబంధనలు మునుపటి నిబంధనలలో దేవుడు బయలుపరచిన అధికారమును తృణీకరించవని ఈ ఉదాహరణలు సూచించుచున్నాయి. భిన్నముగా, మునుపటి నిబంధనా యుగములలోని వేదాంతశాస్త్ర నిర్మాణములు తదుపరి యుగముల మీద నిలిచియుండు అధికారమును కలిగియుండెను.
ఇప్పుడు, మునుపటి నిబంధనల యొక్క నిలిచియుండు అధికారమును గుర్తించుట ఎంత ప్రాముఖ్యమో, మునుపటి నిబంధనల యొక్క వేదాంతశాస్త్రమును తదుపరి యుగములలోనికి వ్యాపింపజేయుటకు శ్రద్ధగల అన్వయింపు యొక్క అవసరత ఎంతో ఉన్నదని కూడా మనము గుర్తించాలి. మునుపటి యుగములలోని నియమాలను తదుపరి కాలములకు ఉచితముగా ఉండు విధముగా అన్వయించాలి.
దీనిని గూర్చి ఈ విధంగా ఆలోచించండి. మనము పిల్లలకు కొన్ని హెచ్చరికలను ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికలు వారి వయస్సులకు అనుగుణంగా ఉండాలి అని తల్లితండ్రులందరికీ తెలుసు. ఉదాహరణకు, నాలుగు సంవత్సరముల బిడ్డకు “స్టవ్ ని అంటుకోవద్దు” అని మనమంతా చెబుతాము. అయితే ఒకసారి ఊహించుకోండి, ఒక రోజు ఉదయానే మీరు మీ 18 ఏళ్ల కూతురుని వంట చేయమని అడిగితే, ఆమె ”నేను చేయలేను. నువ్వే కదా నన్ను స్టవ్ అంటుకోవద్దని చెప్పావు,” అని అన్నది. అప్పుడు, మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఈ విధముగా అనవచ్చు, “నువ్వు ఇంకా నాలుగేళ్ల పిల్లవు కాదు. ఇప్పుడు నువ్వు స్టవ్ ను ముట్టుకోవచ్చు.” అయితే ఒకవేళ ఆమె నిర్లక్ష్యంగా ఉండి చెయ్యి కాల్చుకుంది అనుకుందాం. అప్పుడు మీరు “నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండలేదు? స్టవ్లు అపాయకరమైనవి అని నీకు చెప్పాను కదా” అని అనవచ్చు. అయితే ఆమె “స్టవ్లు అపాయకరమైనవి అని నీవు ఎన్నడును నాతో అనలేదు” అని అంటే, దానికి మీరు ఎలా స్పందిస్తారు? మీరు సరిగానే ఇలా అనవచ్చు, “నీకు స్టవ్ ముట్టుకోవద్దని చెప్పిన ప్రతిసారి, స్టవ్లు అపాయకరమైనవని నిన్ను నేను హెచ్చరించాను.” మీ కూతురుతో ఈ విధముగా మాట్లాడుతుండగా, ఆమెకు మీరు రెండు ముఖ్య ఆలోచనలను తెలియజేయుచున్నారు. ఒక వైపున, ఆమె నాలుగేళ్ల పాప వలె వ్యవహరించుట మీకు ఇష్టముండదు, కాని మరొక వైపు, నాలుగేళ్ల ప్రాయములో మీరు ఆమెకు నేర్పిన పాఠములు ఆమె మరచిపోకూడదు అని కూడా మీరు కోరతారు.
ఇంచుమించు ఇదే విధముగా, దేవుడు పాత నిబంధన అంతటిలో తన ప్రజలతో పరిపక్వత చెందు పిల్లల వలె వ్యవహరించాడు. మరియు ఈ కారణము చేత, దేవుని ప్రజలు రెండు విషయములను గుర్తుంచుకోవాలి. మొదటిగా, మునుపటి నిబంధనా యుగములో జీవించినట్లుగా వారు జీవించకూడదు. అలా చేయుట దేవుడు ఈ మధ్య ఇచ్చిన పూర్ణమైన ప్రత్యక్షతలను విసర్జించుట అవుతుంది. అయితే రెండవదిగా, తదుపరి కాలములలో ఉన్న దేవుని ప్రజలు మునుపటి యుగములలో దేవుడు బోధించిన జ్ఞానమును ఎన్నడును మరచిపోకూడదు. మునుపటి యుగములలోని వేదాంతశాస్త్రమును వారు దేవుడిచ్చిన నూతన కార్య మరియు వాక్య ప్రత్యక్షతల వెలుగులో అన్వయించాలి. ఉదాహరణకు, నోవహుతో చేసిన నిబంధన ఆదాముతో దేవుడు చేసిన మౌలిక నిబంధనా వేదాంతము మీద నిర్మించబడినది, కాని మొదటి నిబంధన యొక్క నియమాలు నోవహు దినములలో దేశములు వ్యాపించుచుండగా ప్రాకృతిక స్థిరత్వము మీద ఉద్ఘాటనలో అమర్చబడు విధముగా నియంత్రించబడ్డాయి.
అబ్రాహాము నిబంధన ఆదాము దినమున ఉన్న మౌలిక నియమాలను మరియు నోవహు యుగములోని ప్రాకృతిక స్థిరత్వమును హత్తుకున్నది. అయినను, అబ్రాహాము కాలము నాటికి, దేవుడు తన నిబంధనా దృష్టిని ప్రాథమికముగా ఆయన సొంత జనాంగముగా ఇశ్రాయేలు మీద కేంద్రీకరించాడు. మరియు ఈ కారణము చేత, మునుపటి నిబంధనల యొక్క సార్వత్రిక వేదాంతశాస్త్ర నిర్మాణములు యేర్పరచబడిన జనాంగముగా ఇశ్రాయేలు పితరులకు యోగ్యమైన మార్గములలో అన్వయింపబడాలి. ఉదాహరణకు, ఆదామునకు ఇవ్వబడిన ఫలించి, వృద్ధి చెంది భూమిని నింపుడి అనే ఆజ్ఞ ప్రత్యేకముగా వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుటకు ఒక పరుగుపందెముగా వృద్ధి పొందుటను అన్వేషించిన ఇశ్రాయేలుకు అన్వయించబడింది. వాగ్దాన దేశములో ప్రకృతి యొక్క ఆశీర్వాదములను ఆస్వాదించిన ఇశ్రాయేలు పితరులకు ప్రాకృతిక స్థిరత్వ వాగ్దానము అన్వయించబడింది.
మోషే యొక్క ధర్మశాస్త్ర నిబంధన ఆదాము పునాదిని, నోవహు స్థిరత్వమును మరియు అబ్రాహాము వాగ్దానములను చేరుకుంది కాని, మోషే తన దినమున నివసించుచున్న ఇశ్రాయేలీయులకు మునుపటి వేదాంతశాస్త్ర నిర్మాణములను చాలా జాగ్రత్తగా అన్వయించాడు. మునుపటి నిబంధనల యొక్క నియమాలను సీనాయి పర్వతము యొద్ద దేవుని ధర్మశాస్త్రములో బయలుపరచబడిన ఆరాధనా మరియు సామాజిక జీవితమునకు సంబంధించిన ప్రత్యేకమైన నియమముల వెలుగులో చూడాలి.
దావీదు యొక్క రాజరిక నిబంధన ఆదాము యొక్క పునాది, నోవహు యొక్క ప్రాకృతిక స్థిరత్వము, అబ్రాహాము వాగ్దానములు మరియు మోషే ధర్మశాస్త్రము మీద నిర్మించబడినది. అయితే దావీదు సింహాసనము స్థాపించబడిన తరువాత, మునుపటి వేదాంతశాస్త్ర నిర్మాణములన్నిటిని దావీదు రాజరికమును, యెరూషలేము పట్టణమును మరియు దానిలోని దేవాలయమును కేంద్రముగా చేసి దాని వెలుగులో చూడాలి.
దీనిని మనము ఈ విధముగా క్రోడీకరించవచ్చు. పాత నిబంధన యొక్క యుగముల పురోగమనములన్నిటిలో, మునుపటి నిబంధనల యొక్క వేదాంతశాస్త్ర దృక్కోణములు తరువాత కాలములకు అన్వయించబడినాయా అనేది ఇక్కడ అంశము కాదు; బదులుగా, అవి ఎలా అన్వయించబడినవి అనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబిచ్చుట పాత నిబంధన పట్ల యుగానుసార భిన్నకాలిక పద్ధతుల యొక్క కొనసాగు పనియైయున్నది.
ఒక నిబంధన యుగము నుండి మరొక దాని వరకు పాత నిబంధన వేదాంతశాస్త్రము ఎలా అభివృద్ధి చెందినదో మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మన మూడవ ముఖ్య అంశమును మనము చూడవలసియున్నది: పాత నిబంధన చరిత్రలో పలు అంశములు పురోగమనము చెందిన విధానములను బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఏ విధముగా వెలికి తీశారు.
గడచిన సంవత్సరములోని సన్నివేశములను గూర్చి ఒక స్నేహితునికి ఉత్తరము వ్రాయుటలో మనము ఉపయోగించగల ఒక ప్రణాళిక, ఎన్ని విషయములు కలిసి ఒక సంవత్సరమును వేర్వేరు కాలములుగా విభజించగలవో చూచుట అని మనము ఇంతకు ముందే చూశాము. ఈ పద్ధతి పాత నిబంధనలోని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు యుగముల పురోగమనములను అధ్యయనం చేయు మార్గములను పోలియుంటుంది. అదే సంవత్సరమును గూర్చి వ్రాయు రెండవ మార్గము ఏమనగా, మీ జీవితములో కొన్ని విభాగములను, అనగా మీ కుటుంబము, మీ సంఘము, మీ ఆత్మీయ పరిస్థితిని తీసుకొని ఆ విభాగములు సంవత్సరమంతటా ఏ విధంగా అభివృద్ధి చెందాయో వివరించుట. ఉత్తరములోని ప్రతి పేరా ఈ క్రింది మాటలతో మొదలవ్వవచ్చు: “గత సంవత్సరములో నా కుటుంబములో ఇలా జరిగింది.” “నా సంఘములో గత సంవత్సరములో ఇది జరిగింది.” “నా ఆత్మీయ జీవితములో గత సంవత్సరములో ఇలా జరిగింది.”
ఇంచుమించు ఇదే విధముగా, పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క పురోగమనములను కూడా ప్రత్యేకమైన అంశముల ఆధారంగా వివరించవచ్చు. ఈ పద్ధతి పని చేయు మార్గములను గూర్చి కొంత అవగాహన పొందుటకు, మనము రెండు దిశలలో చూద్దాము. మొదటిగా, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములోని సాంప్రదాయిక అంశములతో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎలా వ్యవహరించారో చూద్దాము. మరియు రెండవదిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అనే విశేష అంశమును చూద్దాము. క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము బైబిలానుసారమైన వేదాంతవేత్తల కొరకు అంశములకు సంబంధించిన సమస్యలను కలిగించిన విధములను మొదట చూద్దాము.
సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములోని అంశములు ఒక స్థిరమైన సమస్యల గుంపుగా అభివృద్ధి చెందాయి. చాలా వరకు, క్రమబద్ధీకులు మొదటిగా దేవుని గూర్చిన వేదాంతశాస్త్రమును, అనగా దేవుని సిద్ధాంతమును గూర్చి మాట్లాడతారు. తరువాత వారు మానవశాస్త్రము, అనగా మానవ సిద్ధాంతము వైపుకు తిరిగి, మానవాళికి ఉన్న రక్షణ అవసరత మీద దృష్టిపెడతారు. రక్షణశాస్త్రము తరువాత వస్తుంది; రక్షణ సిద్ధాంతము. తరువాత, సంఘశాస్త్రము, అనగా సంఘమును గూర్చిన సిద్ధాంతము మీద దృష్టి సారించబడుతుంది, మరియు చివరిగా, రాకడశాస్త్రము, అనగా అంత్య దినముల సిద్ధాంతము.
కాలక్రమములో, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు కూడా ఈ సామాన్య విభాగములను అనుసరిస్తూ పాత నిబంధన వేదాంతశాస్త్రమును క్రోడీకరించారు. మరియు ఇది కనీసం రెండు కారణముల వలన జరిగింది. ఒక వైపున, సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమునకు ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది మరియు బైబిలానుసారమైన వేదాంతవేత్తలకు ఇది ఎంతో ఉపయోగకరముగా ఉండినది. వాస్తవానికి, సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము యొక్క పరిణామములు ఎంత భావార్థకముగా ఉన్నాయంటే, చాలాసార్లు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దానిలో ఎంతో సహాయమును పొందారు. మంచి క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము ఎల్లప్పుడు బైబిలానుసారమైనదిగానే ఉంటుంది మరియు లక్ష్యమును అందుకున్నంత వరకు, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రముకు క్రమబద్ధకములు ఎంతో ఉపకరించగలవు. క్రమబద్ధమైన వేదాంతశాస్త్ర్రమునకు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క పురికొల్పు ఎంతగా అవసరం ఉందో, అంతగానే బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమునకు క్రమబద్ధకముల యొక్క ఘనమైన వారసత్వము మరియు స్థిరత్వము యొక్క అవసరత ఉంది.
మరొక వైపు, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములోని అంశములు చాలా సార్లు భిన్నకాలిక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ద్వారా అవలంబించబడినవి, ఎందుకనగా బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఉద్దేశము క్రమబద్ధకములకు వ్యాఖ్యాన సమాచారమును అందించుట అని అనేకమంది ఇవాంజెలికల్ క్రైస్తవులు నమ్మారు. మునుపటి పాఠంలో, వారి మధ్య భేదములు ఉన్నప్పటికీ ప్రఖ్యాతిగాంచిన పురుషులైన చార్లెస్ హడ్జ్, బెంజమిన్ బి. వార్ఫీల్డ్ మరియు గీర్హార్డస్ వాస్ వంటి వారు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును క్రమబద్ధమైన వేదాంతశాస్త్ర్రము మీద లేఖనము యొక్క ప్రభావమును చూపుటకు మార్గముగా పరిగణించారు. ఇందు మూలముగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము చాలాసార్లు దానిలో అదే సంపూర్ణమైనదిగా ఎంచబడలేదు, కాని లేఖనముల మీద ఆధారపడియున్న క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును అభివృద్ధి చేయుటకు సాధనముగా పరిగణించబడింది.
ఇవి మరియు అనేక ఇతర కారణముల వలన, పాత నిబంధనలోని పలు అంశముల యొక్క పురోగమనములను అన్వేషించుచుండగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము నుండి సంపూర్ణముగా స్వతంత్రులగుట ఇంచుమించు అసాధ్యమే అవుతుంది. వారు చేయు లేఖన అధ్యయనము ద్వారా వెలువడు నూతన మెళకువలను వారు పరిచయం చేసినప్పుడు కూడా, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము వారి చర్చలను ముఖ్యమైన మార్గములలోకి నడిపించింది. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనను దేవుని గూర్చిన వేదాంతశాస్త్రము, మానవశాస్త్రము, రక్షణశాస్త్రము, సంఘశాస్త్రము మరియు రాకడశాస్త్ర వెలుగులో అన్వేషించారు. అయితే బైబిలానుసారమైన వేదాంతవేత్తలు భిన్నకాలిక పురోగమనముల మీద దృష్టిపెట్టినప్పుడు, ఈ విషయములను గూర్చి వారు ఈ విశేషమైన ప్రశ్నను అడుగుతారు: పాత నిబంధనలోని వేదాంతశాస్త్ర మార్పుల చరిత్ర అంతటిలో ఈ సిద్ధాంతము ఏ విధముగా అభివృద్ధి చెందినది లేక పరిపక్వత పొందినది?
ఉదాహరణకు, ఒక బైబిలానుసారమైన వేదాంతవేత్త దేవుని గూర్చిన వేదాంతశాస్త్రమును అన్వేషించవచ్చు. అయితే సాంప్రదాయిక క్రమబద్ధకముల వలె నిత్య త్రిత్వ సిద్ధాంతము మీద దృష్టి పెట్టకుండా, బైబిలానుసారమైన వేదాంతవేత్త పాత నిబంధనలోని పలు కాలములలో దేవునిని గూర్చిన భిన్నమైన కార్య మరియు వాక్య ప్రత్యక్షతలను పరిశీలిస్తాడు, మరియు తదుపరి ప్రత్యక్షతను ఉల్లంఘించకుండా మరియు తదుపరి ప్రత్యక్షతను మునుపటి కాలములలో చదవకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తపడతాడు. ఒక బైబిలానుసారమైన వేదాంతవేత్త ఈ విధముగా ప్రశ్నించవచ్చు, “ఆదాము కాలములో దేవుడు తనను గూర్చి తాను ఏమి బయలుపరచుకున్నాడు?” “ఆయన తనను గూర్చి తాను నోవహు కాలములో ఏమి బయలుపరచుకున్నాడు?” “మోషే ఇచ్చిన దేవుని సిద్ధాంతము ఏమిటి?” మొదలగునవి. దేవుడు చరిత్రలో కార్యము చేయుచుండగా మరియు మాట్లాడుచుండగా, ఆయన తనను గూర్చి తాను ఎక్కువగా బయలుపరచుకున్నాడు. ఈ కారణము చేత, దేవుని సిద్ధాంతము పాత నిబంధన చరిత్రలో కొన్ని క్రమములను అనుసరించి అభివృద్ధి చెందినది.
అదే విధముగా, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధన అంతటిలో మానవశాస్త్రము, రక్షణశాస్త్రము, సంఘశాస్త్రము మరియు రాకడశాస్త్రము వంటివి ఎలా అభివృద్ధి చెందాయో కనుగొన్నారు. మానవ పరిస్థితిని గూర్చి పాత నిబంధన ఒక ధోరణిని ఎలా అభివృద్ధి చేసింది? అది రక్షణ మార్గమును ఒకొక్క మెట్టుగా ఎలా కనుపరచింది? పాత నిబంధన పలు కాలములలో దేవుని ప్రజలు అనే అంశముతో ఎలా వ్యవహరించింది? అంత్య దినములను గూర్చి ఒక దృక్కోణమును అది క్రమముగా ఎలా విప్పగలిగింది?
బైబిలానుసారమైన వేదంతవేత్తలు ఈ సాంప్రదాయిక అంశములలో ఒక్కొక్క దాని మీద దృష్టిపెట్టుచుండగా, చాలాసార్లు సాంప్రదాయిక క్రమబద్ధములలో నిర్లక్ష్యం చేయబడిన అనేక మెళకువలను వారు కనుగొన్నారు. కొన్నిసార్లు, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ద్వారా సరిచేయబడవలసిన మార్గములను కూడా వారు కనుగొన్నారు.
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని అంశ పురోగమనములు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రముతో ఎలా సంబంధం కలిగియున్నాయో మనము చూశాము కాబట్టి, ఇప్పుడు పాత నిబంధనలోని అంశ పురోగమనముల యొక్క రెండవ అంశమును మనము చూడవలసియున్నది. ఇక్కడ “బైబిలానుసారమైన ప్రతీకవాదం” అని తరచుగా పిలువబడు ఒక ప్రత్యేకమైన భిన్నకాలిక అంశము మన మనస్సులో ఉన్నది.
క్రైస్తవ పాస్టర్లు మరియు బోధకులు ఏదో ఒక దానిని గూర్చి మరొకదాని యొక్క గురుతు అని మాట్లాడినప్పుడు, సాధారణంగా వారు పాత నిబంధనలోని అంశములను క్రీస్తు గురుతులు లేక క్రైస్తవ విశ్వాసములో మరొకటి అని సంబోధిస్తుంటారు. మరియు “వారు అట్టి ప్రతీకవాదమును ఎలా ఉపయోగించారు?” “దానిని వారు ఎలా సమర్థించారు?” అని మనము ఆశ్చర్యపోతుంటాము. మరియు ఆ విషయానికొస్తే, “గురుతు అంటే ఏమిటి?” అని కూడా మనము అడగవచ్చు. బైబిలానుసారమైన ప్రతీకవాదములలో ఎన్నో అపార్థములు ఉన్నాయి కాబట్టి ఇట్టి ప్రశ్నలు తలెత్తడం సహజమే.
పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని ప్రతీకవాదమును అన్వేషించుటకు, మనము మూడు వేర్వేరు విషయములను చూద్దాము. మొదటిగా, బైబిలానుసారమైన ప్రతీకవాదమును నిర్వచించుదాము; రెండవదిగా, ప్రతీకవాదము యొక్క ఐదు ముఖ్యమైన లక్షణములను చూద్దాము; మరియు మూడవదిగా, ప్రతీకవాదములను గుర్తించు ప్రక్రియను మనము అన్వేషిద్దాము. మొదటిగా, బైబిలానుసారమైన ప్రతీకవాదమును నిర్వచించుదాము.
విజ్ఞానము మరియు సాహిత్య అధ్యయనములు వంటి ఇతర శాఖలలో “ప్రతీకవాదము” అనే పదము అనేక విధాలుగా ఉపయోగించబడుతుంది. అయితే ఈ పాఠంలో మనము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో ప్రతీకవాదము యొక్క ఆలోచనపై ఎక్కువ ఆసక్తిని చూపుతాము. విస్తృతమైన భావనలో, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ప్రతీకవాదము అనే పదమును పాత నిబంధన వేదాంతశాస్త్రములోని ఏ భిన్నకాలిక పురోగమన అంశముకైనా అన్వయిస్తుంది. ఒక అంశము యొక్క చారిత్రిక దశలలోని ప్రతి అంగము ఈ పదము యొక్క సామన్య భావనలో ఒక ప్రతీకవాదమును రూపొందిస్తుంది. కొన్ని సందర్భాలలో, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దేవుని సిద్ధాంతము యొక్క ప్రతీకవాదము, లేక ఆరాధన యొక్క ప్రతీకవాదములను గూర్చి మాట్లడతారు మరియు ఈ విధములలో బైబిలులోని ఈ అంశములు అభివృద్ధి చెందాయని దీని అర్థము. అయితే చాలా వరకు, ఆధునిక బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ప్రతీకవాదము అనే పదమును జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఈ విశేషమైన అర్థమును మనము ఈ విధముగా క్రోడీకరించవచ్చు.
బైబిలానుసారమైన ప్రతీకవాదము అనగా లేఖనములోని ప్రాముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు దగ్గర సంబంధము కలిగియున్న వేదాంతశాస్త్ర నిర్మాణముల మధ్య ఏర్పడు భిన్నకాలిక పురోగమనముల యొక్క అధ్యయనమైయున్నది.
సులువైన భాషలో, ప్రతీకవాదము అనగా గురుతుల యొక్క అధ్యయనము అని చెప్పవచ్చు. “గురుతు” అనే పదము గ్రీకు పదమైన టుపోస్ నుండి వెలువడుతుంది, మరియు ఇది క్రొత్త నిబంధనలో పదిహేను సార్లు ఉపయోగించబడింది. మూడు ముఖ్యమైన లేఖన భాగములలో, క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనలోని వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి క్రొత్త నిబంధన విశ్వాసములోని ఇతర వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క “గురుతులు”గా మాట్లాడారు.
ఉదాహరణకు, రోమా. 5:14లో ఆదామును గూర్చి పౌలు మాట్లాడిన విధానమును వినండి.
అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను (రోమా 5:14).
ఆదాము “రాబోవువానికి గురుతైయుండెను” అని ఇక్కడ పౌలు ప్రకటించిన విషయమును గమనించండి. ఇక్కడ “గురుతు” అని అనువదించబడిన గ్రీకు పదము టుపోస్. “రాబోవుచున్నవాడు” క్రీస్తు అని విస్తృత నేపథ్యము నుండి మనకు తెలుసు. కాబట్టి, ఈ సందర్భములో ఆదాము క్రీస్తుకు గురుతుగా ఉన్నాడని పౌలు గ్రహించాడు.
1 పేతురు 3:20-21లో పాత నిబంధన గురుతుకు క్రొత్త నిబంధన సమఉజ్జీని “సాదృశ్యము” అని పేతురు పిలిచాడు. అక్కడ ఇలా వ్రాయబడియున్నది:
నోవహు దినములలో . . . ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది (1 పేతురు 3:20-21).
ఈ లేఖన భాగములో “సాదృశ్యమైన” అని అనువదించబడిన గ్రీకు పదము యాంటిటుపోస్ లేక “యాంటిటైప్” కాబట్టి ఈ ఉదాహరణలో, క్రైస్తవ బాప్తిస్మము నోవహు కాలములోని ప్రళయమునకు సాదృశ్యముగా తెలియజేయబడినది.
కొలస్సీ. 2:17లో ఒకసారి అపొస్తలుడైన పౌలు పాత నిబంధన శుద్ధీకరణ నియమమును గూర్చిన పదజాలములో ఒక గొప్ప మార్పుతో మాట్లాడాడు.
ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది (కొలస్సీ. 2:17).
ఇక్కడ పౌలు మోషే యొక్క శుద్ధీకరణ నియమాలను “ఛాయ” (గ్రీకులో స్కియ) అని మరియు “రాబోవునవి” అని, “క్రీస్తులో ఉన్న నిజ స్వరూపమని” తెలియజేశాడు. అదే విధముగా, హెబ్రీ పత్రిక రచయిత గురుతులను ఛాయలని మరియు సాదృశ్యములను నిజ స్వరూపములని తెలియజేశాడు.
అయితే, చాలా సార్లు బైబిలు ప్రతీకవాదములను గూర్చి మాట్లాడుతున్నప్పుడు క్రొత్త నిబంధన రచయితలు ఏ విధమైన విశేషమైన పదజాలములను ఉపయోగించలేదు. వారు కేవలం కొన్ని పాత మరియు క్రొత్త నిబంధన విషయములను జతచేశారు. ఉదాహరణకు, యోహాను 3:14-15లో యేసు మోషే చేసిన ఇత్తడి సర్పము మరియు తనకు మధ్య ఉన్న వర్గీకరణ అనుబంధమును గూర్చి ఏ విధంగా మాట్లాడాడో వినండి.
అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను (యోహాను 3:14-15).
ఈ లేఖన భాగములో, ఏ విధమైన విశేషమైన పదజాలమును ఉపయోగించకుండా యేసు ఇత్తడి సర్పమును ఆయనతో సిలువవేయబడుటతో పోల్చాడు. అయినను సర్పము సిలువవేయబడుటకు గురుతు అని మరియు సిలువవేయబడుట సర్పమునకు సాదృశ్యమని మనము చెప్పవచ్చు.
ప్రతీకవాదమును గూర్చిన ఈ సామాన్య అవగాహనను దృష్టిలో ఉంచుకొని, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు సాధారణముగా గుర్తించు ప్రతీకవాదము యొక్క అనేక లక్షణములను మనము చూడవలెను.
మన ఉద్దేశముల కొరకు, మనము ఐదు విషయముల మీద దృష్టి పెడదాము. మొదటిగా, ప్రతీకవాదము ఒక భాషా రూపముగా ఎలా పనిచేస్తుందో మనము చూద్దాము. రెండవదిగా, బైబిలానుసారమైన ప్రతీకవాదములో గల పలు రకముల మూలకాల మీద దృష్టిపెడదాము. మూడవదిగా, ప్రతీకవాదములు వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క పోలికలు అని మనము గుర్తిస్తాము. నాల్గవదిగా, ప్రతీకవాదములు వేదాంతశాస్త్ర పురోగమనములకు ఎలా ప్రాతినిథ్యం వహిస్తాయో చూద్దాము. మరియు ఐదవదిగా, బైబిలులోని అనేక ప్రతీకవాదముల యొక్క క్రమ వరుస వైపుకు మన ధ్యాసను మళ్లించుదాము. మొదటిగా ప్రతీకవాదములు భాషా రూపములుగా ఎలా పని చేస్తాయో చూడండి.
సాహిత్య స్థాయిలో, లేఖనములోని ప్రతీకవాదముల యొక్క వ్యక్తీకరణమును ఒక విశేషమైన భాషా రూపముగా, లేక మరింత స్పష్టముగా, ఒక పోలిక రూపకముగా పరిగణించుట సహాయకరముగా ఉంటుంది. పోలిక రూపకములు అనగా మనము అలంకారములు లేక ఉపమాలంకారములు, సారూప్యములు మొదలగువాటితో మనము వ్యవహరించునట్లే, మరొకదానితో పోల్చుతూ కొన్ని విషయములను గూర్చి పరోక్షమైన మార్గములలో వర్ణించుట. దానిని పోలిక రూపకముగా చూచుట ద్వారా బైబిలులోని ప్రతీకవాదమును గూర్చిన మౌలిక విషయములను గూర్చి మనము మరింత అవగాహన పొందుకోవచ్చు.
ప్రతి పోలిక రూపకము మూడు ముఖ్యమైన మూలకాల ద్వారా పని చేస్తుంది: ముఖ్య వస్తువుయైన రూపకమును అందుబాటులో ఉన్న మరొక ముఖ్య వస్తువుతో పోల్చుట; మరియు రెంటి మధ్య పోలికా బిందువులు. ఉదాహరణకు, ఈ సులువైన ఉపమాలంకారమును గూర్చి ఆలోచన చెయ్యండి, “ఆ పొడవాటి భవనము పర్వతము వలె ఎత్తుగా ఉన్నది.” ఈ కథనములో, రూపము “పర్వతము.” ఇక్కడ ఒక వస్తువు ముఖ్యమైన విషయముతో పోల్చబడుతుంది. ఇక్కడ ముఖ్య విషయము లేక అంశము “పొడవాటి భవనము,” అనగా కనబడుతున్న భవనమైయున్నది. మరియు స్పష్టమైన పోలిక బిందువు రెండూ “పొడవు”గా ఉన్నాయి అను విషయము.
ఇప్పుడు భాషా రూపకాలను మనము ఉపయోగించిన ప్రతిసారి ఈ మూడు ములాకాలను మనము స్పష్టముగా తెలియజేయము. కాని రూపము, అంశము మరియు ఒకటి లేక అంత కంటే ఎక్కువ పోలిక బిందువులు సఫలవంతముగా తెలియజేయుటకు ఏ పోలిక రూపకములోనైనా ఉపయోగించబడతాయి. ఈ మూడు మూలకములు స్పష్టముగానైనా లేక పరోక్షముగానైనా బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో కూడా కనిపిస్తాయి. మొదటిగా, ఒక “గురుతు” ఒక రూపముగా అనగా, ముఖ్య విషయమునకు సంబంధించిన వస్తువుతో పోల్చబడిన వస్తువుగా పని చేస్తుంది. రెండవదిగా, “సాదృశ్యము” అనేది అంశముగా, అనగా గురుతు పోల్చబడు వస్తువుగా ఉన్నది. మరియు మూడవదిగా, గురుతు మరియు సాదృశ్యము ఒకదానితో ఒకటి ఒకటీ లేదా అంత కంటే ఎక్కువ పోలిక బిందువుల ద్వారా జతచేయబడతాయి.
ఉదాహరణకు, ఆదాము “రాబోవు క్రీస్తుకు గురుతుగాను సాదృశ్యముగాను” ఉన్నాడని రోమా. 5:14లో పౌలు ప్రకటించిన మాటను మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. కాబట్టి, ఈ సందర్భములో, ఆదాము క్రీస్తుతో పోల్చబడిన రూపముగాను లేక గురుతుగాను ఉన్నాడు, మరియు క్రీస్తు అంశముగాను లేక సాదృశ్యముగాను ఉన్నాడు. ఆదాము మరియు క్రీస్తు మధ్య ఉన్న పోలిక బిందువులు రోమా పత్రిక 5వ అధ్యాయము యొక్క విస్తృత నేపథ్యములో వివరించబడినాయి. ఆదాము క్రీస్తుకు గురుతుగా ఉన్నాడు ఎందుకంటే ఆదాము యొక్క కార్యములు మరియు క్రీస్తు యొక్క కార్యములు రెండు వారితో గుర్తించబడిన ప్రజల మీద గొప్ప ప్రభావమును చూపాయి. ఒక వైపున, ఆదాముతో గుర్తింపబడినవారు మృతినొందారు. మరొక వైపున, క్రీస్తుతో గుర్తింపబడినవారు నిత్య జీవమును పొందారు.
బైబిలానుసరమైన ప్రతీకవాదం యొక్క రెండవ లక్షణము ఏమనగా పోల్చబడిన మూలకములు భిన్నముగా ఉంటాయి. పలు రకముల వస్తువుల మధ్య పోలికలు చూపబడినవి. గురుతులుగాను సాదృశ్యములుగాను పని చేయు మూలకములను విభాగించుటకు అనేక మార్గములు ఉన్నాయిగాని, వాటిని గూర్చి మూడు సామాన్య శ్రేణులలో ఆలోచించుట సహాయకరముగా ఉంటుంది. గురుతులు మరియు సాదృశ్యములు ప్రాముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు, లేక సన్నివేశములు అయ్యుండవచ్చు. వ్యక్తులు అనగా, లేఖనములలో కనిపించు పాత్రలు, అనగా ప్రాముఖ్యమైన మానవ పాత్రలు, ఆత్మీయ సృష్టములు, దేవుడు, మరియు కొన్ని అరుదైన సందర్భాలలో శరీరరూపము దాల్చిన సృష్టిలోని ఇతర అంగములు. వ్యవస్థలు అనగా, నిలిచియుండు చారిత్రిక సత్యములు, అనగా ప్రాముఖ్యమైన స్థలములు లేక నిలిచియుండు ప్రాముఖ్యతగల ప్రాంతములు, ఆచారములు, సంస్థలు, ముఖ్యమైన భవనములు మొదలగునవి. మరియు సన్నివేశములు అనగా, ప్రాముఖ్యమైన చారిత్రిక సన్నివేశములు, అనగా జరిగిన విషయములు. గురుతులు మరియు సాదృశ్యములలో ఈ మూడు మూలకముల యొక్క ప్రతి కలయిక ఉంటుంది.
మనము గుర్తించిన క్రొత్త నిబంధన ప్రతీకవాదము యొక్క ఉదాహరణలు వీటిలో కొన్నింటిని ప్రతిబింబిస్తాయి. రోమా 5:14లో ఆదాము మరియు క్రీస్తుకు మధ్య పౌలు ఇచ్చిన ప్రతీకవాదము ఒక ముఖ్యమైన వ్యక్తిని మరొక ముఖ్యమైన వ్యక్తితో పోల్చింది. 1 పేతురు 3:21లో, నోవహు దినములలోని జలప్రళయమును పేతురు క్రైస్తవ బాప్తిస్మ వ్యవస్థతో పోల్చాడు. యోహాను 3:14లో, మోషే ఇత్తడి సర్పమును ఎత్తిన సన్నివేశమును యేసు తన సొంత సిలువవేయబడుటతో పోల్చాడు. ఇతర పోలికలు లేఖనములోని ఇతర భాగములలో కనిపిస్తాయి. ఏది ఏమైనా, ప్రతీకవాదములు ప్రాముఖ్యమైన వ్యక్తులను, వ్యవస్థలను మరియు సన్నివేశములను పోల్చుతాయి.
మూడవ స్థానములో, బైబిలులోని ప్రతీకవాదములు ఎల్లప్పుడు వాటి యొక్క మూలకములతో దగ్గర అనుబంధం కలిగియున్న వేదాంతశాస్త్ర నిర్మాణములను పోల్చుతాయి. దురదృష్టవశాత్తు, సద్భావన గల ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతవేత్తలు చాలాసార్లు ప్రతీకవాదము ద్వారా ఎంతగా కుతూహలం పొందుతారంటే, లేఖనములోని రెండు విషయముల మధ్య పోలికలను చూసిన ప్రతిసారి దానిలో వారు గురుతులను మరియు సాదృశ్యములను వెదకుతుంటారు. అయితే వారి పోలికలలో చాలా సార్లు అనుకోకుండా సంభవించిన లక్షణములే కనిపిస్తాయిగాని, స్థిరమైన వేదాంతశాస్త్ర సంబంధములు కనిపించవు.
ఉదాహరణకు, అబ్రాహాముకు రెండు చేతులు కలవు, కాని రెండు చేతులు కలిగియున్న తదుపరి బైబిలు పాత్రలకు అబ్రాహాము గురుతుగా ఉన్నాడని ఆలోచన చేయుటకు మంచి కారణము ఏదియు లేదు. పాత నిబంధనలో ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రజలు అంగీలను ధరించుకున్నారు అనే సత్యము వారు ఒకరికొకరు గురుతులుగాను మరియు సాదృశ్యములుగాను ఉన్నారని సూచించదు. ఇట్టి పోలికలు చారిత్రిక యాదృచ్ఛిక సన్నివేశములతో వ్యవహరించవు.
ఇట్టి అల్పమైన పోలికలతో దారి మళ్లుటకు బదులుగా, స్థిరమైన ప్రతీకవాదములు వాటి మూలకములతో ముడిపడియున్న ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క పోలికలను కలిగియుంటాయి. ప్రతీకవాదముల, వ్యక్తుల, వ్యవస్థల మరియు సన్నివేశముల యొక్క మూలకములు వాటి ప్రతీకవాదములలో ఒంటరిగా నిలిచియుండవు. అవి సంక్షిప్త పదాలుగాను, అనగా పెద్దవైన దగ్గర సంబంధము కలిగిన వేదాంతశాస్త్ర ఆలోచనల కొరకు నిలబడు భాగములుగా పనిచేస్తాయి. బైబిలు రచయితలు సదరు వ్యక్తులను, వ్యవస్థలను, లేక సన్నివేశములను ప్రతీకవాదములో మూలకములుగా ప్రస్తావించినప్పుడు, ఆ మూలకములు ప్రాతినిథ్యం వహించిన పెద్దవైన వేదాంతశాస్త్ర నిర్మాణములు వారి మనస్సులో ఉండేవి.
ఉదాహరణకు, రోమా. 5:14లో క్రీస్తుకు గురుతుగా ఆదామును గూర్చి పౌలు మాట్లాడిన ఉదాహరణను మరొక సారి చూడండి. ఇద్దరు పురుషులకు జుట్టు ఉండెను అనే సత్యమును పౌలు పోల్చలేదు. ఇద్దరికి రెండు కన్నులు మరియు రెండు చెవులు ఉన్న సత్యము వైపుకు అతడు ఆసక్తిని మళ్లించలేదు. బదులుగా, పౌలు ఆదాము మరియు క్రీస్తు యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను పోల్చుతున్నాడు కాబట్టి అతడు ఈ ప్రతీకవాదమును ఉపయోగించాడు. వారితో గుర్తించబడిన ప్రజల మీద ఇద్దరు పురుషులు గొప్ప ప్రభావమును చూపారు అనే గమనిక మీద పౌలు యొక్క పోలిక ఆధారపడినది.
1 పేతురు 3:20-21లో నోవహు కాలములోని జల ప్రళయమును క్రైస్తవ బాప్తిస్మమును పోల్చిన పేతురును గూర్చి కూడా ఇదే చెప్పవచ్చు. దేవుని తీర్పు పొందిన లోకములో నుండి దేవునిచే ఆశీర్వదించబడిన లోకములోనికి నోవహు ప్రవేశించుటకు మాధ్యమముగా జలప్రళయము యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను గూర్చి అతడు ఆలోచించాడని పేతురు వ్రాసిన పత్రిక యొక్క విస్తృత నేపథ్యము స్పష్టము చేస్తుంది. అవును, క్రైస్తవ బాప్తిస్మము అదే విధమైన నమ్మకములతో ముడిపడియున్నది ఎందుకంటే తీర్పుకు సిద్ధపడిన లోకములో నుండి క్రీస్తులోని నూతన సృష్టిలోనికి ప్రవేశించుటకు అది ఒక చిహ్నముగా ఉన్నది. ఈ స్థాయిలో పేతురు నోవహు దినములలోని నీటిని మరియు బాప్తిస్మములోని నీటిని పోల్చాడు.
లేఖనములో ప్రతీకవాదము యొక్క నాల్గవ లక్షణము ఏమనగా, అవి ఎల్లప్పుడు భిన్నకాలిక పురోగమనములను ప్రతిబింబిస్తాయి. లేఖనములు గురుతులను మరియు సాదృశ్యములను గుర్తించినప్పుడు అవి ఎల్లప్పుడు చరిత్రలోని పలు కాలములకు చెందినవిగా ఉంటాయి మరియు ఆ విధముగా, అవి ఆ కాలములలోని భిన్నకాలిక వేదాంతశాస్త్ర పురోగమనములను ప్రతిబింబిస్తాయి. ఈ కారణము చేత, అన్ని పోలికల రూపకముల వలెనె, ప్రతీకవాదములో కూడా వాటి మూలకముల మధ్య సారుప్యతలు మరియు భిన్నత్వములు ఉంటాయి. ఒక వైపున, మనము సారుప్యతలను చూడగలగుతున్నాము. కొందరు వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములు తదుపరి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు గురుతులుగా ఉన్నాయి ఎందుకంటే వాటి వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతలు సారుప్యతగలవిగా ఉన్నాయి. అయితే మరొక వైపు, ఈ పోల్చదగిన మూలకములు భిన్నత్వముగలవిగా కూడా ఉన్నాయి; అవి ఎన్నడు కూడా ఖచ్చితముగా ఒకే విధముగా లేవు. కాలము గడచిన కొలది, వాటి వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతలలో పురోగమనములను కలిగించిన గురుతులు మరియు సాదృశ్యముల మధ్య నూతన ప్రత్యక్షతలు వెలుగులోనికి వచ్చాయి.
రోమా. 5:14లో పౌలు ఇచ్చిన ప్రతీకవాదమును గూర్చి మరొకసారి ఆలోచన చెయ్యండి, అక్కడ ఆదాము గురుతుగా ఉన్నాడు మరియు క్రీస్తు సాదృశ్యముగా ఉన్నాడు. ఇప్పుడు, మనము ఇంతకు ముందు చూసినట్లుగా, ఆదాము వేదాంతపరముగా క్రీస్తుతో సారుప్యత కలిగియున్నాడు మరియు వారితో గుర్తింపబడినవారిని దేవుడు చూసిన విధానము మీద ఇరువురు విస్తృతమైన ప్రభావమును చూపారు. అయితే భిన్నకాలిక పురోగమనముల కారణంగా పౌలు వారి మధ్య ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసమును తెలియపరచాడని కూడా మనము గమనించాలి. రోమా. 5:15లో ఆయన చెప్పిన మాటలను వినండి:
అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసు క్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. (రోమా. 5:15).
ఇక్కడ పౌలు కేవలం ఆదాము మరియు క్రీస్తుకు మధ్య ఉన్న సారుప్యతలను మాత్రమే తెలియజేయడం లేదని గుర్తించండి. వారి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వ్యత్యాసమును అతడు వ్రాస్తున్నాడు. ఆదాము బైబిలు చరిత్ర యొక్క ఆరంభ యుగములో జీవించాడు మరియు అతని అవిధేయత మానవ చరిత్రకు పాపము మరియు మరణమును పరిచయం చేసింది. అయితే, క్రీస్తు దేవుని విమోచనా ప్రణాళికలు నెరవేర్చబడవలసియున్న బైబిలు చరిత్ర యొక్క ఆఖరి దశలలో నివసించాడు. ఫలితంగా, క్రీస్తు చూపిన విధేయత నిత్య జీవమును కలిగించింది. పౌలు యొక్క ప్రతీకవాదములకు ఆదాము మరియు క్రీస్తు మధ్య ఉన్న భిన్నత్వములు వాటి సారుప్యతల వలెనె ప్రాముఖ్యమైయున్నవి, మరియు అన్ని ప్రతీకవాదములకు ఇది వర్తిస్తుంది.
ప్రతీకవాదముల యొక్క మరొక లక్షణము ఏమనగా అవి ఎల్లప్పుడు ఒక క్రమములో కనిపిస్తాయి. కేవలం ఒక గురుతు మరియు సాదృశ్యము మాత్రమే కలిగియుండుట కంటే, దానిలో మూడు లేక అంతకంటే ఎక్కువ మూలకాల యొక్క క్రమము ఉంటుంది. ఉదాహరణకు, పాత నిబంధనలోని క్రమమైన ఆరాధనా ప్రతీకవాదమును చూడండి. సామాన్య మాటలలో, భూమి మీద మానవులు చేయు ఆరాధన ఎల్లప్పుడు ప్రతి స్థాయిలోను పరలోకములో దేవదూతలు దేవునికి చేయు ఆరాధనను అనుకరిస్తుంది అని మరియు ప్రతిబింబిస్తుంది అని మనము చెప్పవచ్చు. కాని భూమి మీద ఆరాధనా అలవాటు చారిత్రికముగా పురోగమనము చెందింది మరియు ఈ చారిత్రిక పురోగమనములు క్రమవరుసలో ఉన్న ప్రతీకవాదములను సృష్టించాయి. మొదటిగా, ఆదాము హవ్వలను దేవుడు తన పరిశుద్ధమైన తోటలో ఉంచినప్పుడే ఆరాధన ఆరంభమయ్యింది. ఆది. 2:15లోని నివేదికను వినండి:
మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను (ఆది. 2:15).
తోటలో ఆదాము హవ్వల యొక్క పనిని వర్ణించుట కొరకు ఉపయోగించిన భాష చాలా అసాధారణమైనదిగా ఉన్నది. సంఖ్యా. 3:7-8 మరియు 8:26 వంటి పంచకాండములోని ఇతర స్థలములలో ఇది కనిపిస్తుంది, అక్కడ మోషే ప్రత్యక్ష గుడారములో లేవీయుల పరిచర్యను గూర్చి వర్ణించాడు. తోటలోని ఆదాము హవ్వలను వర్ణించుటకు ప్రత్యక్ష గుడార భాషను మోషే ఉపయోగించుట, ఏదెను తోట మరియు ప్రత్యక్ష గుడారము మధ్య మోషే ఒక వర్గీకరణ విధానమైన అనుబంధమును చూశాడని సూచిస్తుంది. ప్రత్యక్ష గుడారము యొక్క కట్టడము మరియు అలంకారములు ఏదెను తోటలోని పరదైశును ప్రతిబింబించాయి అనే సత్యము ఈ ప్రతీకవాదమును నిర్థారిస్తుంది.
ఆరాధన యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణము ఏదెను తోటలో ఆరంభమైనదని ఏదెను తోటలో ఆదాము హవ్వల యొక్క కార్యకలాపాలను మోషే వర్ణించిన విధానము సూచిస్తుంది. మానవాళి తోటలో నుండి త్రోసివేయబడినప్పుడు, ఆరాధనలో ఒక భిన్నకాలిక అభివృద్ధి ఆరంభమయ్యింది. హేబెలు, సేతు, నోవహు మరియు అబ్రాహాము యొక్క ఉదాహరణలు సూచించుచున్నట్లు, వేర్వేరు స్థలములలో ఆరాధన కొరకు బలిపీఠములను నిర్మించి తోట వెలుపల కూడా తన ప్రజలు ఆయనను ఆరాధించాలని దేవుడు పిలచాడు.
తరువాత దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి బయటకు పిలచి సీనాయి యొద్ద వారితో నిబంధన చేసుకున్నప్పుడు, ఆరాధనలో మరొక ప్రాముఖ్యమైన భిన్నకాలిక పురోగమనము చోటుచేసుకున్నది. ఇశ్రాయేలు యొక్క ఆరాధన ప్రత్యక్ష గుడారములో ఉన్నభూమిమీద దేవుని పాదపీఠమైన నిబంధనా మందసము చుట్టూ కేంద్రీకరించబడినది. తరువాత, ఇశ్రాయేలు వాగ్దాన భూమిలో స్థిరపడిన వెంటనే మరొక భిన్నకాలిక పురోగమనము ఆరంభమయ్యింది. నిబంధనా మందసమును యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి మార్చి అక్కడ ఆరాధన చేయమని దేవుడు తన ప్రజలకు పిలుపునిచ్చాడు.
తుదకు, సొలొమోను నిర్మించిన దేవాలయమును బబులోనీయులు నాశనం చేసిన తరువాత, ఆరాధనను గూర్చి ప్రవక్తయైన యెహేజ్కేలు ఒక క్రొత్త ప్రత్యక్షతను ప్రకటించాడు. చెర తరువాత దావీదు సింహాసనము మరియు యెరూషలేము పునరుద్ధరించబడిన తరువాత మరింత గొప్ప దేవాలయము నిర్మించబడుతుంది అని అతడు ప్రవచించాడు. ఆశ్చర్యమేమి లేకుండా, జెరుబ్బాబెలు దినములలో, చెర తరువాత వాగ్దాన దేశములోనికి తిరిగి వచ్చినవారు దేవుని ఆరాధించుట కొరకు ఒక నూతన దేవాలయమును నిర్మించాలని ప్రవక్తలైన హగ్గయి మరియు జెకర్యా కోరారు.
కాబట్టి, ఏదెను తోట మొదలుకొని, మోషే దినములకు ముందు కట్టబడిన ఆరంభ బలిపీఠముల నుండి, మోషే ప్రత్యక్ష గుడారము, సొలొమోను దేవాలయము మరియు జెరుబ్బాబెలు దేవాలయము వరకు పలు ఆరాధనా వేదాంత నిర్మాణములలో మనము వరుస క్రమములో ప్రతీకవాదమును చూస్తాము. పాత నిబంధనలో చాలా సార్లు, ముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు సంబంధించిన ముఖ్యమైన వేదాంతశాస్త్ర విషయములను గూర్చి దేవుడు మరలా మరలా మాట్లాడాడు. మరియు ఈ విషయముల పట్ల దేవుడు చూపిన పునరావృత్త ఆసక్తి వరుస క్రమ ప్రతీకవాదములను రూపొందించింది.
లేఖనములో ప్రతీకవాదముల యొక్క ఐదు ముఖ్యమైన లక్షణములను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మన మూడవ అంశమును చూడవలసియున్నది: పాత నిబంధనలోని ప్రతీకవాదములను ఎలా గుర్తించాలి. పాత నిబంధన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు సంబంధించి విశేషమైన వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క పురోగమనములను మనము అన్వేషించుచుండగా మనము పాటించవలసిన ప్రక్రియలు ఏమిటి?
ప్రతీకవాదముల యొక్క రెండు ముఖ్యమైన దృక్పథములను పరిశీలించుట ద్వారా మనము ఈ ప్రశ్నకు జవాబునిద్దాము. మొదటిగా, ఎదురుచూపుగా ప్రతీకవాదమును చూచుట. మరియు రెండవదిగా, విశ్లేషణగా ప్రతీకవాదమును చూచుట. ఎదురుచూపుగా ప్రతీకవాదమును మొదటిగా పరిశీలన చేద్దాము. ఎదురుచూపుగా ప్రతీకవాదమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు, పాత నిబంధనలో గురుతులు ప్రత్యక్షమైనప్పుడు, అవి రాబోవు సాదృశ్యముల వైపుకు చూపుటకు రూపొందించబడినాయి అనే నమ్మకము మన మనస్సులో ఉంటుంది. సంఘ చరిత్ర అంతటా, అనేకమంది అనువాదకులు లేఖన ప్రతీకవాదములను ఈ విధముగా చూశారు. ఈ అభిప్రాయములో, భవిష్యత్తులో రాబోవువాటిని గూర్చి ఆ రోజులలో నివసించుచున్న ప్రజలకు సూచించుట కొరకు చరిత్రలో దేవుడు తన సార్వభౌమత్వములో ముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములను నియుక్తిచేశాడు. ఈ సాంప్రదాయిక దృక్పథము ప్రతీకవాదము పట్ల ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆరంభ దశాబ్దములతో సహా క్రైస్తవ కందకములన్నిటిని వర్ణించింది.
ఇప్పుడు నేటి దినములలో, అనేక మంది బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఒక నూతన దృక్పథమైన “అంతర్ విషయము” అనుదానిని ఉపయోగిస్తూ ఈ సాంప్రదాయిక ఎదురుచూపు అభిప్రాయమును తిరస్కరించారు. అంతర్ విషయము ప్రతీకవాదములను రానున్నవాటిని సూచించుట కొరకు దేవుడు మార్చిన చారిత్రిక సత్యములుగా పరిగణించక ఒక బైబిలు లేఖన భాగము మరొక భాగముతో వ్యవహరించునట్లు ఒక సాహిత్య దృగ్విషయముగా మాత్రమే పరిగణిస్తుంది. బైబిలానుసారమైన ప్రతీకవాదములు కొన్ని వేదాంతపరమైన అవసరతల కొరకు తదుపరి బైబిలు లేఖన భాగములు మునుపటి బైబిలు లేఖన భాగములను ఉపయోగించుకున్న మార్గములుగా మాత్రమే ఉపయోగించబడ్డాయి.
ఈ నూతన ధోరణులకు భిన్నముగా, క్రొత్త నిబంధన రచయితలు ఈ ప్రతీకవాదమును “అంతర్ సత్యములు” అని వర్ణించారు. మరొక మాటలో, గురుతులు సాదృశ్యములుగా భవిష్యత్ చారిత్రిక వాస్తవములను గూర్చి ఎదురుచూసిన చారిత్రిక వాస్తవములుగా ఉన్నాయి. మీకు గుర్తున్నట్లయితే, రోమా. 5:14లో పౌలు ఆదామును “రాబోవువానికి గురుతైయుండెను” అని పిలిచాడు. పౌలు చారిత్రిక ఆదామును గూర్చి, చారిత్రిక క్రీస్తు యొక్క పుర్వగామిగా వ్రాసాడుగాని, ఆదికాండములో లేఖన భాగమును గూర్చి కాదు. అదే విధముగా, కొలస్సీ. 2:17లో, పాత నిబంధన శుద్ధీకరణ నియమము యొక్క గురుతును పౌలు “రాబోవు వాటికి ఛాయ” అని పిలచాడు. పాత నిబంధన శుద్ధీకరణ నియమములు క్రీస్తు యొక్క వాస్తవికతలు మునుపటి కాలము యొక్క చారిత్రిక వాస్తవికతల మీద ఛాయలను వేయుట ద్వారా కలిగిన పరిణామాలైయున్నవని ఛాయను గూర్చిన ఈ ఉపమాలంకారము సూచిస్తుంది. పాత నిబంధన సాక్ష్యమును అనుసరించి, కొందరు మునుపటి వ్యక్తులు, వ్యవస్థలు, మరియు సన్నివేశములు తదుపరి వ్యక్తులను, వ్యవస్థలను, మరియు సన్నివేశములను గూర్చి ఎదురుచూచునట్లు దేవుడు తన దైవకృతములో చరిత్రను అమర్చాడని మనము ఉద్ఘాటించాలి.
గురుతుల ఎదురుచూపు అభిప్రాయములను ఉద్ఘాటించునప్పుడు మనము ఎదుర్కొను ఒక ప్రశ్న ఏమనగా: పాత నిబంధనలో నివసించిన ప్రజలు గురుతులు చూపుచున్న భవిష్యత్తును అర్థము చేసుకున్నారా? తమ దినములలో ఉనికిలో ఉన్న గురుతులను చూచుట ద్వారా పాత నిబంధన కాలములోని పాత్రలు మరియు రచయితలు రాబోవు సాదృశ్యములను గూర్చి తెలుసుకోగలిగారా?
“అవును,” అని మనము జవాబు ఇచ్చుటకు కొన్ని భావనలు ఉన్నాయి. మొదటి స్థానంలో, అట్టి భవిష్యద్ జ్ఞానమును కలిగియుండుటకు కాల క్రమములో దేవుడు ప్రజలకు విశేషమైన, ప్రత్యేకమైన ప్రత్యక్షతలను ఇచ్చాడు అను విషయమును మనము త్రోసిపుచ్చలేము. ఉదాహరణకు, గురుతులు రాబోవు సాదృశ్యములను గూర్చి ఏ విధముగా ఎదురుచూశాయో పాత నిబంధనలోని ప్రవక్తలు మరియు ప్రాముఖ్యమైన వ్యక్తులు చూసియుండవచ్చు.
రెండవ స్థానములో, కొన్ని సార్లు గురుతుల కాలములో నివసించుచున్న ప్రజలు సాధారణ మాధ్యమాలను ఉపయోగించుట ద్వారా రాబోవు సాదృశ్యములను గూర్చి ఎదురుచూశారు. చాలా తరచుగా, దేవుడు వాటి భవిష్యద్ పురోగమనములను ముందుగానే బయలుపరచిన వేదాంతశాస్త్ర నిర్మాణములతో పాత నిబంధన గురుతులు ముడిపడియుండేవి. అనగా, కొన్ని వేదాంతశాస్త్ర నిర్మాణములు ఒక ఉన్నతమైన గమ్యము వైపుకు ముందుకు సాగవలసిన మార్గములను దేవుడు ముందుగానే సూచించాడు. ఆదిమ గురుతులు రానున్న వాస్తవికతలతో ముడిపడియున్నంత వరకు, ఎటువంటి భవిష్యద్ సాదృశ్యములను మనము ఆశించాలో అవి సూచించాయి.
ఉదాహరణకు, ఈ పాఠ్యక్రమములో మనము చెప్పిన విధముగా, ఆది. 1:28లో ఆదాము హవ్వలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుచు ఏదెను వనములో ఉన్న పరదైశును వ్యాపింపజేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు భూమి యొక్క అంతిమ గమ్యమును బయలుపరచాడు. లోకమంతటిని ఏదెను వంటి అద్భుతమైన పరిశుద్ధమైన స్థలముగా మార్చుటకు దేవుడు తన స్వరూపమును నియమించాడని దేవుడు ఆరంభము నుండే బయలుపరచాడు. ఏదెను వనము అనే అద్భుతమే ఒక గురుతు అని, మరియు లోకమంతా ఒక దినాన అలానే ఉంటుంది అని ఆదాము హవ్వలు అర్థము చేసుకున్నారు.
ఆది. 15:18లో, ఏదెను వనములో ఉన్న నదులతో అనుబంధము కలిగియుండు విధముగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దాన దేశము యొక్క నదీ సరిహద్దులను గుర్తించాడు. కాబట్టి, అబ్రాహాము తనకు వాగ్దానము చేయబడిన దేశములో నడచుచుండగా, ఆ దేశము మాత్రమే సరిహద్దు కాదని, మరియు తన సంతతి వారు దేవుని ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు అది ఒక ఆరంభ బిందువని అతడు అర్థము చేసుకున్నాడు. అందు వలననే పౌలు రోమా. 4:13లో ఇలా వ్రాస్తున్నాడు:
అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను . . . కలిగెను (రోమా 4:13).
అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన దేశము ఇశ్రాయేలీయులు దేవుని ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు ఒక ఆరంభ బిందువుగా ఉండినది. ఈ భావనలో, ఏదెను తోట వలెనె, అబ్రాహాము సంతతికి ఇవ్వబడిన వాగ్దాన దేశము లోకమంతా ఒకదినమున మారబోవు రూపమునకు ఒక గురుతుగా ఉన్నది.
దీనికి తోడుగా, ఆది. 15:18లో ప్రస్తావించబడిన వాగ్దాన దేశము యొక్క సరిహద్దులు కొన్ని తరముల తరువాత దావీదు రాజ్యము అందుకున్న సరిహద్దులైయున్నవి. అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన దేశమును సంపూర్ణతలో దావీదు చేరుకున్నాడు. అక్కడ నుండి, దావీదు యొక్క నమ్మకమైన సంతతి వారు దేవుని ఆశీర్వాదములను ఇతర దేశములకు వ్యాపింపజేయుట మీద మనస్సు పెట్టారు. కాబట్టి ఈ భావనలో, భూమి మీదనున్న ఈ ప్రాంతములో దావీదు సింహాసనము యొక్క స్థాపన లోకమంతట ఒక దినమున సంభవించు కార్యము కొరకు ఎదురుచూసింది. దావీదు యొక్క భవిష్యద్ కుమారుని రాజ్యమును గూర్చి కీర్తనలు 72:11, 17 ఎదురు చూసిన విధానమును గూర్చి వినండి.
రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు. . . . అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు (కీర్తనలు 72:11, 17).
కాబట్టి, ఆదాము హవ్వలు ఏదెనులో నుండి భూదిగంతముల వరకు వ్యాప్తి చెందవలసియుండినట్లు, అబ్రాహాము దేవుని ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు వాగ్దాన దేశమును పొందుకున్నట్లు, దావీదు వంశము దేవుని రాజ్యమును మరియు ఆశీర్వాదమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నదని మనము చూస్తాము.
ప్రతి దశలోను, దేవుడు సాధించినది భవిష్యత్తులో రాబోవువాటిని గూర్చి ఎదురుచూసినది. ఆయన ప్రజలు తమ దినమున అనుభవించువాటి యొక్క ప్రతీకవాదము యొక్క ప్రాముఖ్యత భవిష్యత్తులో రానున్న గొప్ప సాదృశ్యము వైపుకు ఎలా దిశను చూపుతున్నదో అని కొంత వరకు ఎదురు చూడవచ్చు. అనేక ఇతర సందర్భాలలో, దేవుని ఉద్దేశములను అర్థము చేసుకున్న పాత నిబంధన ప్రజలు కొందరు వ్యక్తులు, వ్యవస్థలు, మరియు సన్నివేశములు రానున్న వాటికి గురుతులై ఎలా ఉన్నాయో చూడగలిగారు. వారి అవగాహన నిజముగానే పరిమితమైనదైయుండెను, కాని వారి దినములలోని గురుతులు భవిష్యత్తు కొరకు ఎదురుచూసిన అనేక మార్గములను వారు అర్థము చేసుకునేవారు.
ఇప్పుడు ఇది ఎంత నిజమైయున్నదో, అనేక ఇతర సందర్భాలలో గురుతులను మరియు సాదృశ్యములను అర్థము చేసుకొనుట ఎదురు చూసే విషయముగాక విశ్లేషణకు సంబంధించిన విషయమైయుండెనని గుర్తించుట కూడా అంతే ప్రాముఖ్యమైయున్నది. అనేక గురుతులు సాదృశ్యములుగా ఎలా అభివృద్ధి చెందుతాయో గుర్తించుటలో, మునుపటి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములను గూర్చి తదుపరి సమయముల యొక్క అవసరతలకు అనుగుణంగా విశ్లేషించుట యొక్క సంలగ్నత ఉంటుంది.
ఈ ఉదాహరణను చూడండి. మీ చేతిలో ఒక విత్తనము ఉన్నది అనుకోండి మరియు అది పెరిగి పెద్ద వృక్షమైన తరువాత అది ఎలా కనిపిస్తుందో మీకు చూడాలని ఉంది. పూర్తిగా ఎదిగిన సింధూర వృక్షము ఒక విత్తనము కంటే చాలా వేరుగా కనిపిస్తుంది. కాబట్టి, భవిష్యత్తును ప్రవచించగల అద్భుతమైన సామర్థ్యం ఉంటే తప్ప, మీ చేతిలో ఉన్న విత్తనము ఎదిగి వృక్షమైన తరువాత ఎలా కనిపిస్తుందో కనుగొనుట సులువైన పని కాదు.
అనేక విధాలుగా, పాత నిబంధనలోని ప్రజలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చాలా సార్లు, గురుతులు వాటి సాదృశ్యముల కంటే ఎంత భిన్నముగా కనిపిస్తాయంటే, వాటి యొక్క పురోగమనములను ఊహించుట ఇంచుమించు అసాధ్యమవుతుంది. ఉదాహరణకు, పేతురు నోవహు కాలములోని జలప్రళయమును క్రైస్తవ బాప్తిస్మముతో గుర్తించినప్పటికీ, వారి కాలములోని ప్రపంచ జల ప్రళయము ఒక దినాన ప్రజలు క్రీస్తులో పొందు బాప్తిస్మమును ఎదురు చూచినది అని నోవహు దినములలో ఎవరు ఊహించియుంటారు? మోషే ఇత్తడి సర్పము క్రీస్తు యొక్క సిలువకు పూర్వగామిగా ఉన్నదని మోషే దినములలోని సగటు ఇశ్రాయేలీయుడు ఊహించుట ఇంచుమించు అసాధ్యమైన పనే. అద్భుతమైన ప్రత్యక్షత లేకుండా వాటిని గూర్చి ముందుగా తెలియజేయుటకు సాదృశ్యములు గురుతుల కంటే ఎంతో భిన్నమైనవైయున్నవి.
కాబట్టి మన ఉదాహరణలోనికి తిరిగి వెళ్లి ముందుకు చూద్దాము. మన చేతిలో ఉన్న విత్తనమును మధ్యలోనికి కోసి దానికి డి ఎన్ ఏ పరీక్షలు చేశామనుకుందాము. ఆ విధముగా చేయుట ద్వారా, ఆ విత్తనము యొక్క మరుగైన అనేక గుణములను గూర్చి మనము నేర్చుకోవచ్చు. అయినను, డి ఎన్ ఏ కూడా ఈ విత్తనము ఎదగబోవు సంపూర్ణ వృక్షము యొక్క లక్షణములన్నిటిని నిర్థారించలేదు. ఆ విత్తనము ఒక ఆపిల్ లేక ముంతమామిడి వృక్షముగాక సింధూర వృక్షమవుతుంది అని మనకు నిర్థారణ కలుగుతుంది. కాని దాని ఎత్తు, కొమ్మల సంఖ్య లేక వేర్ల కొలత వంటి విషయములు మాత్రం మనము నిర్థారించలేము. ఈ లక్షణములు బాహ్య శక్తులైన వాతావరణము, నీరు, పోషణ, వెలుగు మరియు వ్యాధి వంటి వాటి ద్వారా ప్రభావితము చేయబడతాయి. ఇవి ఒక జెనెటిక్ కోడ్ ద్వారా పూర్తిగా నిర్థారించబడలేవు.
ఇంచుమించు ఇదే విధముగా, బైబిలు చరిత్రలో గురుతులుగా పని చేయు ప్రాముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములకు సంబంధించిన జెనెటిక్ కోడ్స్ లేక వేదాంతశాస్త్ర నిర్మాణములను మనము అర్థము చేసుకోగలము. ఈ జ్ఞానము తదుపరి పురోగమనముల కొరకు కొన్ని ఆకాంక్షలను మనకు అందించగలదు, కాని ఈ గురుతు మరియు సాదృశ్యములకు మధ్య ఉన్న పురోగమనములు ఈ విధముగా పూర్తిగా తెలుసుకొనబడలేవు. దేవుడిచ్చు నూతన ప్రత్యక్షతలు చాలా సార్లు చరిత్రను ఊహించని దశలలోనికి నడిపిస్తాయి. ఒక గురుతు యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను పూర్తిగా అర్థము చేసుకొనుట ద్వారా కూడా, దాని సాదృశ్యము యొక్క వివరాలను మనము పూర్తిగా ఊహించలేము.
గురుతుల నుండి సాదృశ్యములను ఊహించుట ద్వారా వాటిని అర్థము చేసుకొనుటకు ప్రయత్నించుటకు బదులుగా, మనము సాధారణంగా విశ్లేషణ ప్రక్రియ మీద ఆధారపడాలి. బైబిలు రచయితల వలె, మన చారిత్రిక సందర్భము ఇచ్చు అవకాశమును మనము స్వీకరించి మునుపటి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశములు తదుపరి సాదృశ్యములుగా అభివృద్ధి చెందిన మార్గములను మనము విశ్లేషించాలి.
మన ఉదాహరణను మరొకసారి పరిశీలన చేద్దాము, మన దగ్గర అనేక విత్తనములు ఉండి వాటిని ఇతర విత్తనాలతో పాతినట్లయితే, అనేక సంవత్సరముల తరువాత అడవిలో ఉన్న ప్రతి వృక్షము యొక్క డి ఎన్ ఎ ను మనము ఇంతకు ముందు చేసిన విత్తనాల డి ఎన్ ఎ తో పోల్చవచ్చు. ఈ ఉపయోగకరమైన బిందువు ద్వారా, ఏ చెట్టు ఏ విత్తనములో నుండి వచ్చినదో మనము కనుగొనగలము. ఇంచుమించు ఇదే విధముగా, బైబిలు చరిత్రలోని తదుపరి కాలముల యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను తెలుసుకొను ఉపయోగకర బిందువు నుండి, గురుతుల యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను తదుపరి వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశముల యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములతో పోల్చుట ద్వారా మనము గురుతులను కనుగొనవచ్చు.
ఒక క్రైస్తవునిగా, క్రీస్తు విధేయతకు సంబంధించిన వేదాంతశాస్త్ర నిర్మాణములను పౌలు అర్థము చేసుకున్నాడు మరియు ఆదాము అవిధేయతకు సంబంధించిన అవే విధమైన వేదాంతశాస్త్ర నిర్మాణములతో వాటిని పోల్చి చూడగలిగాడు. దీని ఆధారంగా, ఆదాము క్రీస్తుకు గురుతుగా ఉన్నాడని చెప్పాడు. క్రైస్తవ బాప్తిస్మములోని నీటితో ముడిపడియున్న వేదాంతశాస్త్ర నిర్మాణములను పేతురు అర్థము చేసుకున్నాడు మరియు నోవహు జలప్రళయములోని నీటితో ముడిపడియున్న వేదాంతశాస్త్ర నిర్మాణములతో వాటిని పోల్చి చూశాడు. యేసు సిలువ వేయబడుట యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను గ్రహించాడు మరియు మోషే దినములలోని అదే విధమైన ప్రాముఖ్యత ఉన్న ఇత్తడి సర్పము సరసన దానిని ఉంచాడు. కాబట్టి, గురుతులు నిజముగా వాటి యొక్క సాదృశ్యముల కొరకు ఎదురుచూడగా, సాధారణంగా ఈ గురుతులను మనము వాటి యొక్క సాదృశ్యములు చరిత్రలో ప్రత్యక్షమైన తరువాతనే గుర్తించగలము.
ఈ విశ్లేషణ ప్రక్రియను మనము ఒకసారి అర్థము చేసుకున్న పిమ్మట, పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములను అధ్యయనం చేయుటలో ప్రతీకవాదములను గుర్తించుట ఒక ముఖ్యమైన భాగమని మనము చూడగలుగుతాము. ఖచ్చితముగా ఉండుటకు, లేఖనములు ప్రతీకవాదములను గుర్తించునప్పుడు, అది నిర్దేశకమైన విషయము కాబట్టి దానిని మనము నిరాకరించకూడదు. అయితే లేఖనములు భిన్నకాలిక వేదాంతశాస్త్ర పురోగమనములను సంపూర్ణంగా వెలికితీయవు. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనలోని వేదాంతశాస్త్రమును సంపూర్ణంగా వెలికితీయుటకు అన్వేషించుచుండగా, వారు తదుపరి ప్రత్యక్షతలో గల వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశముల యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను నేర్చుకోవాలి, మరియు వారి ఎదురుచూపులను మునుపటి కాలములోని ప్రత్యక్షతతో గుర్తించుకోవాలి. ఈ విధముగా, పాత నిబంధన వేదాంతశాస్త్రము కాల క్రమములో ఏ విధముగా పురోగమనము చెందినదో వారు చూడగలుగుతారు.
ఈ పాఠంలో, పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములను మనము పరీక్షించాము. పాత నిబంధన వేదాంతశాస్త్రము పట్ల భిన్నకాలిక లేక పురోగమన పద్ధతులను గూర్చి ఒక సామన్య ధోరణిని మనము పొందుకున్నాము. చారిత్రిక యుగములు లేక దశలలో పాత నిబంధన వేదాంతశాస్త్రము ఏ విధముగా పురోగమనము చెందినదో మనము చూశాము. మరియు పాత నిబంధన వేదాంతశాస్త్రములో విశేషమైన అంశముల యొక్క పురోగమనమును కూడా మనము అన్వేషించాము.
పాత నిబంధనలోని భిన్నకాలిక పురోగమనములను గూర్చి ఇంకా ఎన్నో విషయములను చెప్పవచ్చు. కాని ఈ పాఠములో మేము తెలియజేసిన విషయాలను అర్థము చేసుకొనుట ఆదికాండము యొక్క ఆరంభ దినముల నుండి పాత నిబంధన యొక్క చివరి దినముల వరకు వేదాంతశాస్త్రము పురోగమనము చెందిన విధానములను మరి ఎక్కువగా పరిశీలించుటకు ఒక స్థిరమైన పునాదిని అందిస్తుంది.
Continue reading the full transcript