ఈ పాఠం 3 యొక్క అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: సహజ వేదాంతం ద్వారా దేవుని గురించి మనకు అవసరమైనవన్నీ తెలుసుకోగలమా, లేదా మనకు ప్రత్యేక వెల్లడి కూడా అవసరమా? బైబిల్లో దేవుని గురించిన ధరవమైన పోలికలు దేవుని లక్షణాల గురించి మనకు ఎలా బోధించగలవు? కీర్తనలు 8 దేవుని ముందు మన విలువ, ప్రాముఖ్యత గురించి మనకు ఏమి బోధిస్తుంది? దేవుని ప్రతిమలో మనం సృష్టించబడ్డారని దేవుని అర్థం ఏమిటి? దేవుని గురించి కొంత జ్ఞానం లేకుండా మనం నిజంగా మనల్ని తెలుసుకోగలమా, మనల్ని తెలుసుకోవడానికి దేవుని గురించి కొంత జ్ఞానం అవసరమా? స్క్రిప్చర్ నుండి, ప్రత్యేకించి కథనం, కవిత్వం నుండి వేదాంత ప్రతిపాదనలను ఊహించడం కొన్నిసార్లు ఎందుకు కష్టం? స్క్రిప్చర్ యొక్క కథనాలు, కవిత్వం నుండి వేదాంత ప్రతిపాదనలను ఊహించడం ఎలా వేదాంతవేత్తలు చేయగలరు? దేవుడు మన కోసం తన ప్రేమ యొక్క లక్షణాన్ని ఎలా ప్రదర్శిస్తాడు? దేవుని ప్రేమ లక్షణం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి? సృష్టిలో దేవుడు తన జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తాడు? దేవుడు పవిత్రుడని, మనం కూడా పవిత్రులుగా ఉండాలని బైబిల్ చెప్పినప్పుడు దేవుడు అర్థం ఏమిటి? దేవుని పవిత్రత లక్షణం మన దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
ఎంతో గౌరవించబడిన ఒక గణితశాస్త్ర పండితుడు మరియు అధ్యాపకుని గూర్చి ఈ విధంగా ఒక కథ చెప్పబడింది. అతని పుస్తకములు మరియు బోధనలు ఒక సాధారణ మనిషికి అందనివిగాను, చాలాసార్లు తన ఉత్తమ విద్యార్థులకు కూడా అర్థము కానివిగాను ఉండేవి. అయితే ఒక రోజున, ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అధ్యాపకుని యొక్క ఖ్యాతి ఒక్కసారిగా నిత్యము నిలచునట్లు మారిపోయింది. అనేకమంది అంతర్జాతీయ విద్యార్థులు అతనితోను అతని కుటుంబముతోను క్రిస్మస్ దినమును గడపగా, వారు మునుపెన్నడూ ఊహించని ఒక కోణము అతని జీవితములో చూశారు. తన మనవండ్రు మనవరాండ్రు మరియు అతిధులు చుట్టు ఉండగా, ఈ ప్రఖ్యాతిగాంచిన అధ్యాపకుడు నేల మీద కూర్చొని, సంతోషముగా నాలుగు లేక ఐదు సంవత్సరముల పిల్లలు ఆడే ఆటలను ఆడుట ఆరంభించాడు. తరువాత రోజు, “అలాంటి వ్యక్తి మాలో ఒకని వలె ఉంటాడు అను విషయమును నమ్ముట మాకు చాలా కష్టమైయ్యింది” అని విద్యార్థులు వాపోయారు.
అనేక విధాలుగా, దేవుని గూర్చి లేఖనములు ఇలాంటి విషయమునే బోధిస్తాయి. దేవుడు సృష్టికి పైన స్వతంత్ర శ్రేష్టత కలిగియున్నాడని — ఆయన సంపూర్ణ భిన్నత్వము కలిగియున్నాడని — అవి స్పష్టము చేస్తాయి. అయితే, అవి దేవుడు మరియు సృష్టికి మధ్య ఉన్న అనేక పోలికలను గూర్చి కూడా మాట్లాడతాయి. అది అర్థము చేసుకొనుటకు ఎంత కష్టముగా ఉన్నప్పటికీ, దేవుడు కూడా మనను పోలియున్నాడని లేఖనములు బోధిస్తున్నాయి.
మన పాఠ్య క్రమమైన దేవుని నమ్ముచున్నాములో ఇది మూడవ పాఠం, మరియు దీనికి “దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడు” అనే శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, వేదాంతవేత్తలు దేవుని వ్యాప్తి చెందు గుణములు అని పిలచేవాటిని, అనగా దేవుడు మరియు ఆయన సృష్టికి మధ్య సారూప్యతలు కలిగియున్న మార్గములను చూద్దాము.
ఈ పాఠ్యక్రమములో ఇంతకు ముందు, దేవుని గుణములను మనము ఈ విధముగా నిర్వచించాము:
పలు రకముల చారిత్రిక వ్యక్తీకరణములలో బయలుపరచబడిన దేవుని సారము యొక్క పరిపూర్ణతలు.
ఇవాంజెలికల్ వేదాంతవేత్తలు దేవుని గుణములను రెండు గుంపులుగా విభజించారు అను విషయమును మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. దేవుని వ్యాప్తిచెందలేని గుణములు ఆయనను సృష్టి నుండి సంపూర్ణ వ్యత్యాసము గలవానిగా చూపు ఆయన సారములోని పూర్ణతలైయున్నవి. మరియు దేవుని వ్యాప్తి చెందు గుణములు ఆయన సృష్టి యొక్క గుణములకు సారూప్యముగా ఉన్న దేవుని సారములోని పూర్ణతలైయున్నవి. ఈ పాఠంలో, దైవిక పూర్ణతలలోని రెండవ శ్రేణియైన, దేవుని వ్యాప్తిచెందు గుణముల వైపు మన దృష్టిని మళ్లించుదాము.
“దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడు” అను అంశమును గూర్చిన మన అధ్యయనము రెండు ముఖ్య భాగములుగా విభజించబడింది. మొదటిగా, దేవుని సిద్ధాంతములోని ఈ కోణమును అన్వేషించుటకు కావలసిన బైబిలు పునాదులను మనము చూద్దాము. మరియు రెండవదిగా, దేవుని వ్యాప్తి చెందు గుణములను గూర్చి ఇవాంజెలికల్ క్రమబద్ధ వేదాంతవేత్తల యొక్క వేదాంతశాస్త్ర దృక్పథములను చూద్దాము. ఈ విషయములను చర్చించుటకు బైబిలు పునాదులతో ఆరంభించుదాము.
మన మానవ పరిమితుల కారణంగా, లేఖనములు దేవుని గూర్చి బోధించు విషయములను పరీక్షించుచుండగా మనము అనేక మర్మములను ఎదుర్కొంటాము. మరియు దేవుని వ్యాప్తి చెందు గుణములతో వ్యవహరించుచుండగా కూడా ఇది సత్యమైయున్నది. దేవుడు ఆయన సృష్టి నుండి సంపూర్ణ వ్యత్యాసము గలవాడని ఈ పాఠ్యక్రమములో మనము నేర్చుకున్నాము — కేవలం కొన్ని పూర్ణతలలో మాత్రమే కాదు గాని అన్ని పూర్ణతలలోను. అయితే అదే సమయములో, దేవుడు మరియు ఆయన సృష్టి సారూప్యతకలిగియున్నవని బైబిలు వివరిస్తుందన్న విషయం బైబిలునెరిగిన ప్రతివ్యక్తికి సుపరిచితమే. “పరిశుద్ధ,” “న్యాయమైన,” “నీతిగల,” “మంచి,” “నమ్మకమైన,” “ప్రేమించు” మరియు “శక్తిగల” అను మాటలు దేవునికి మరియు ఆయన సృష్టిలోని అనేక విషయములకు అన్వయించబడతాయి. కాబట్టి, ఈ రెండు దృష్టి కోణములు ఎలా కలిసియుంటాయో అర్థము చేసుకొనుట మనకు ఎంత కష్టమనిపించినప్పటికీ, దేవుడు సృష్టిని పోలియున్నాడు మరియు వేరుగా కూడా ఉన్నాడని ఉద్ఘాటించునట్లు బైబిలు విశ్వాసము మనకు పిలుపునిస్తుంది.
దేవుని వ్యాప్తిచెందు గుణములను గూర్చి అనేక విధములుగా అధ్యయనము చేయుటకు మనము బైబిలు పునాదులను క్రోడీకరించవచ్చు. అయితే మన ఉద్దేశముల కొరకు, మనము కేవలము రెండు దిశలలో మాత్రమే చూస్తాము. మొదటిగా, ఈ విషయములను ఎదుర్కొనుచుండగా బైబిలు రచయితలు అనుసరించిన మూడు ప్రాథమిక ప్రణాళికలను మనము గమనిద్దాము. మరియు రెండవదిగా, దేవుడు మరియు సృష్టికి మధ్య ఉన్న సారూప్యతలను నేర్చుకొనుటకు అవసరమైన మానవత్వమును గూర్చిన బైబిలు దృక్పథములను పరిగణిద్దాము. తమ పాఠకులకు దేవుని గూర్చి బోధించుటకు రచయితలు ఉపయోగించిన మూడు ప్రాథమిక ప్రణాళికలతో మనము ప్రారంభిద్దాము.
మునుపటి పాఠంలో, మధ్యకాలిక ఛాత్రవాద వేదాంతవేత్తలు ప్రాకృతిక వేదాంతశాస్త్రము మీద ఎక్కువ దృష్టి పెట్టారని మనము ప్రస్తావించాము. లేఖనముల మీద ఎలాంటి సూటైన దృష్టి పెట్టకుండా ప్రకృతిని గమనించుట ద్వారా మాత్రమే దేవుని గూర్చి నేర్చుకొనుటకు వారు ప్రయత్నిస్తారు. ప్రకృతి నుండి దేవుని గూర్చిన సత్యములను వివేచించుటకు వారు మూడు అధికారిక ప్రణాళికలను గుర్తించారు: “నిరాకరణ మార్గము” లేదా ల్యాటిన్ లో “వయ నెగషియోనిస్”; “సకారణత్వ మార్గము” లేదా “వయ కాసలిటాటిస్”; “ఔన్నత్య మార్గము” లేదా “వయ ఎమినెన్షియ.”
ఇప్పుడు, శతాబ్దములుగా, ఈ విధములుగా ప్రకృతి నుండి దేవుని గూర్చి అనేక విషయములను నేర్చుకోవచ్చని ప్రొటెస్టెంట్ వేదాంతవేత్తలు సరిగానే సమ్మతించారు. లేఖనములో విశేష ప్రత్యక్షతా మార్గదర్శకము యొక్క అవసరత కూడా ఉన్నదని ప్రొటెస్టెంట్ విశ్వాసులు ఉద్ఘాటించారు. లేఖనములు ఉన్నవి ఉన్నట్లుగా, స్పష్టతనిచ్చు కళ్ళద్దాల వలె సాధారణ ప్రత్యక్షతలో దేవుడు తనను గూర్చి తాను బయలుపరచిన విషయములను గూర్చి స్పష్టతనిస్తాయి. తాను వ్రాసిన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్, మొదటి పుస్తకము, ఆరవ అధ్యాయము, మొదటి భాగములో జాన్ కెల్విన్ వ్రాసినట్లుగా:
బలహీనమైన కంటి చూపుగలవారు ... కళ్ళద్దాల సహాయంతో స్పష్టముగా చదవగలుగుతారు; అదే విధముగా లేఖనము, మన మనస్సులలో దేవుని గూర్చి ఉన్న గందరగోళ జ్ఞానము, మన మందత్వమును తొలగించి, నిజమైన దేవుని స్పష్టముగా చూపుతుంది.
ప్రాకృతిక వేదాంతశాస్త్రము అనగా ప్రకృతి నుండి మనము నేర్చుకొనదగిన విషయములు. అది మాట్లాడుచున్నదానిని నిర్వచించుటకు అది అత్యంత స్పష్టమైన మరియు సులువైన మార్గముగా ఉన్నది. విశేష ప్రత్యక్షత ప్రకృతిలో, మన సొంత వ్యక్తిత్వములలో, మన చుట్టు ఉన్న లోకములో గాక, లేఖనములో మరియు తుదకు క్రీస్తులో దేవుడు తనను తాను బయలుపరచుకున్న విధానమును మరియు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా అన్వయించబడిన విధానమును గూర్చి మాట్లాడుతుంది. మరియు మన చుట్టు ఉన్న లోకములో అనగా సృష్టిలో దేవుని అదృశ్య గుణములు స్పష్టముగా కనిపించుచున్నాయని బైబిలు మనకు చెబుతున్నట్లు అనిపిస్తుంది — రోమా 1; కీర్తనలు 8... మరియు చూచుటకు కన్నులున్నవారికి అది స్పష్టముగా కనిపిస్తుంది. సమస్య ఏమిటంటే చూచుటకు మనకు కన్నులు లేవు, కాబట్టి మనము గ్రుడ్డివారము, కాబట్టి దేవుడు ఏమి చేశాడంటే, ఆయన ఒక ప్రత్యేకమైన విధముగా సిలువలో క్రీస్తు ద్వారా పాత మరియు క్రొత్త నిబంధన వాక్యములో కనిపించునట్లు తనను తాను బయలుపరచుకున్నాడు.
— డా. జోష్ మూడి
సాధారణ ప్రత్యక్షత ఎల్లప్పుడు ఉనికిలో ఉంది. మీరు ఆకాశమును చూడగా, అది సాధారణ ప్రత్యక్షత. మీరు నైతిక ధర్మశాస్త్రమును చూడగా, అది సాధారణ ప్రత్యక్షత. ప్రజలలో మీరు మనస్సాక్షిని చూచినప్పుడు, అది సాధారణ ప్రత్యక్షత... తుదకు, సాధారణ ప్రత్యక్షత ప్రజలకు ఇవ్వగలుగు ఏకైక విషయము దేవుడు ఉన్నాడను, దేవుడు శక్తిగలవాడను, మరియు దేవుడు నిత్యుడను జ్ఞానము. అయితే విశేష ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఒకరు ఈ నిత్య ఉనికిని, మరియు శక్తిగల దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, మంచివాడు, ప్రేమించువాడు, మరియు కరుణగలవాడని అర్థము చేసుకోగలరు. విశేష ప్రత్యక్షతను అర్థము చేసుకొనుట మూల తాళపు చెవిని కనుగొనుట, మరియు తరువాత ఆ తాళపు చెవిని సాధారణ ప్రత్యక్షతను నేర్చుకొనుట కొరకు ఉపయోగించుటను పోలియున్నది; తరువాత సమస్తము దృశ్యమైనదిగాను స్పష్టముగాను ఉంటుంది.
— రెవ. డా. స్టీఫెన్ టోంగ్, అనువాదము
ఈ విషయములను మరింతగా విడమరచుటకు, ఈ మూడు ప్రాథమిక ప్రణాళికలు లేఖనములో ఎలా కనిపిస్తాయో మనము పరిగణిద్దాము. మొదటిగా, నిరాకరణ మార్గమును మనము క్లుప్తముగా చూద్దాము. రెండవదిగా, సకారణత్వ మార్గమును మరింత స్పష్టముగా చూద్దాము. మరియు మూడవదిగా, ఔన్నత్య మార్గము యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము. నిరాకరణ మార్గముతో ప్రారంభించుదాము.
క్లుప్తంగా, నిరాకరణ మార్గము అనగా సృష్టికి వేరుగా చూపుతూ దేవుని గూర్చిన సత్యములను గూర్చి మాట్లాడుట. బైబిలు రచయితలు తరచుగా దేవునికి మరియు ఆయన సృష్టికి మధ్య వ్యత్యాసముల వైపుకు దృష్టిని మళ్ళిస్తుంటారు — పాపము మరియు చెడుకు సంబంధించిన వ్యత్యాసములు మాత్రమేగాక, సృష్టికి దేవుడిచ్చిన మంచి గుణములకు కూడా సంబంధించినవి. దేవుడు సమస్త వ్యత్యాసములపైన స్వతంత్ర శ్రేష్టత కలిగియున్నాడని చూపుతూ వారు తరచుగా దేవుని ఘనపరచారు. ఈ కారణము చేత, ఈ పద్ధతి ప్రాథమికముగా మన ధ్యాసను దేవుని వ్యాప్తి చెందలేని గుణముల వైపుకు ఆకర్షిస్తుంది. అయితే అలా చేయుట ద్వారా, దేవుని వ్యాప్తి చెందు గుణముల మీద మనము దృష్టి నిలుపుటకు రంగము సిద్ధము చేస్తుంది. తుదకు, దేవుడు మన కంటే పూర్ణ భిన్నత్వము కలిగి ఎలా ఉన్నాడో గ్రహించకుండా దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడో మనము చూడలేము. కాబట్టి, ఈ పాఠం దేవుని వ్యాప్తి చెందు గుణముల మీద దృష్టిపెడుతున్నప్పటికీ, లేఖనములోని నిరాకరణ మార్గము ఏదో ఒక విధముగా దేవుని గుణములు వాస్తవముగా వ్యాప్తిచెంద లేనివనే గొప్ప మర్మమును మరలా మరలా మనకు జ్ఞాపకం చేస్తుంది.
నిరాకరణ మార్గమునకు భిన్నముగా, రెండవ ప్రణాళికయైన సకారణత్వ మార్గము ప్రాథమికముగా మన దృష్టిని దేవుని వ్యాప్తి చెందు గుణముల వైపు ఆకర్షిస్తుంది.
లేఖనములో, దేవుడు చేసిన మంచి పనులను పోల్చుతూ దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడో వివేచించుటకు సకారణత్వ మార్గము ఒక దారిని సరాళము చేస్తుంది. చిత్రములను గీయుట చిత్రకారుని యొక్క నైపుణ్యత, భావోద్వేగములు మరియు ఆలోచనలను ప్రతిబింబిస్తుందని సాధారణ అనుభవము బోధిస్తుంది. అలానే ఒక మంచి సంగీతము సంగీతకారుని యొక్క తలాంతులను మరియు ఆలోచనా శక్తిని ప్రతిబింబిస్తుంది. ఫలితంగా, వారి పనులను అధ్యయనం చేయుట ద్వారా చిత్రకారులను గూర్చి మరియు సంగీతకారులను గూర్చి మనము అనేక విషయములను నేర్చుకోవచ్చు. అనేక విధాలుగా, దేవుడు చేసిన వాటిని గమనిస్తూ దేవునిని గూర్చిన విషయములను వెలికితీయుట ద్వారా బైబిలు రచయితలు కూడా ఇలాంటి పనే చేశారు. దేవుడు “మొదటి కారకమని,” లేక సృష్టికర్త అని గుర్తెరుగుట ద్వారా, సృష్టి మీద ఆయన కుమ్మరించిన మంచి గుణములను గుర్తిస్తూ ఆయనను గూర్చిన సత్యములను ప్రకటించారు.
లేఖనములు సకారణత్వ మార్గమును రెండు ప్రధాన మార్గములలో ఉపయోగిస్తాయి. అవి దేవునికి మరియు ఆయన చేసిన వాటికి మధ్య సూటైన వ్యత్యాసమును తెలియజేస్తాయి. ఉదాహరణకు, కీర్తనలు 94:9 ఈ ప్రణాళికను ఈ క్రింది విధముగా ఉపయోగిస్తుంది:
చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? (కీర్తనలు 94:9)
ఇక్కడ మనము చూచుచున్నట్లు, దేవుడు “చెవిని కలుగజేశాడు” మరియు “కంటిని నిర్మించాడు,” కాబట్టి దేవుడు స్వయంగా “వినువాడు” మరియు “చూచువాడు” అనే నిశ్చయతను మనము కలిగియుండవచ్చు.
స్వయంగా రమ్యమైన దేవుడు గాక, ఎలాంటి దేవుడు భూమి యొక్క అందమును సృష్టిస్తాడు? క్రమముగా ఉన్న దేవుడు గాక, మరి ఏ దేవుడు క్రమమును సృష్టిస్తాడు? సజీవమైన దేవుడు గాక, ఏ దేవుడు జీవమునియ్యగలడు? దేవుడు చేసిన మంచి పనులను గుర్తించుట ద్వారా దేవుని గూర్చి మనము నేర్చుకొనగల సత్యములకు అంతము లేదు.
సూటైన వ్యత్యాసములతో పాటుగా, దేవుడు మరియు ఆయన సృష్టికి మధ్య చిత్రాత్మక వ్యత్యాసములను చేయుట ద్వారా బైబిలు రచయితలు సకారణత్వ మార్గమును ఉపయోగించారు. కొన్ని సార్లు, ఈ వ్యత్యాసములలో జీవములేని వస్తువులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, యెషయా 10:17లో మనము ఈ మాటలు చదువుతాము.
ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; . . . ఒక్కదినమున వాటిని మింగివేయును (యెషయా 10:17).
ఈ వాక్య భాగము యొక్క విస్తృత నేపధ్యము సూచించుచున్నట్లు, దేవుడు అష్షూరు సామ్రాజ్యమంతటిని నాశనము చేయబోవుచుండెను. ఇది ఎలా జరుగుతుందో వివరించడానికి, యెషయా దేవుని “దహించు మరియు కాల్చివేయు” “అగ్ని” లేక “జ్వాల” అని అలంకారరూపంలో సంబోధించుచున్నాడు. ఫలితంగా, అగ్ని యొక్క దహించు శక్తికి మరియు దేవుని యొక్క దహించు శక్తికి మధ్య పోలికలను యెషయా తెలియజేయుచున్నాడు.
దేవుని గూర్చిన ఇతర అలంకారములలో కూడా ఇలాంటి తర్కమే దాగియున్నది, ఉదాహరణకు కీర్తనలు 18:2లో కీర్తనకారుడు ఈ విధంగా చెబుతున్నాడు:
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము (కీర్తనలు 18:2).
ఇక్కడ కీర్తనకారుడు దేవుని ఆయన చేసిన అనేక వస్తువులతో పోల్చుతున్నాడు: గొప్ప “శైలము” లేక బండ, “కోట,” “కేడెము,” “శృంగము” మరియు “దుర్గము.” దేవుడు తనను తన శత్రువుల నుండి ఏ విధముగా రక్షించాడో మరియు భద్రపరచాడో తెలియజేయుటకు అతడు ఇలా చేశాడు.
లేఖనములు దేవుని జంతువులతో కూడా పోల్చుచున్నవి. ఉదాహరణకు, ద్వితీ. 32:10-11లో, మోషే ఇలా అన్నాడు:
. . . [దేవుడు] పరామర్శించి కనుపాపను వలె [యాకోబును] కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు . . . (ద్వితీ. 32:10-11).
ఇదే విధానములో, కీర్తనలు 91:4 ఈ క్రింది విధముగా చెబుతుంది:
[దేవుడు] తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది (కీర్తనలు 91:4).
ఇవి మరియు అనేక ఇతర బైబిలు భాగములు సూచించుచున్నట్లు, దేవునికి మరియు ఆయన సృష్టికి మధ్య ఉన్న పోలికలను గూర్చి బైబిలు లెక్కలేనన్ని విధాలుగా తెలియజేస్తుంది. దేవుడు ఆయన చేసిన దానిని పోలియున్న అనేక విధములను గూర్చి నేర్చుకొనుటకు ఈ ప్రాముఖ్యమైన బైబిలు దృక్పథము ఒక పునాదిని సిద్ధపరుస్తుంది.
దేవునిని మరియు ఆయన గుణములను మనము అర్థము చేసుకొనుటకు చిత్రాత్మక పోలికలు ఎంతో ప్రాముఖ్యమైనవైయున్నవి. మనము దేవుని అర్థము చేసుకోలేము. దేవుడు ఉన్నత పరిమాణములో ఉన్న ఒక మానవుడు కాడు. దేవుడు దేవుడైయున్నాడు. కాబట్టి, దేవుడు మన యొద్దకు దిగివచ్చి మనకు తనను తాను ప్రత్యక్షపరచుకొనుచుండగా, మనము గ్రహించలేని మరియు మనకు అర్థముకాని విధములలో ఆయన తనను తాను మనకు ప్రత్యక్షపరచుకొనడు. అయితే మనము అర్థము చేసుకొను విషయములతో ముడిపడియున్న మార్గములలో దేవుడు తనను తాను బయలుపరచుకొనుచుండగా దేవుని యొక్క కృప మరియు కరుణ కనుపరచబడుతుంది. కాబట్టి, ఈ చిత్రాత్మక ప్రాతినిధ్యములు, ఈ ఉదాహరణలు, ఈ సాదృశ్యములు, ఈ రూపకములు, ఈ ఉపమానములు మాత్రమే దేవుడు ఎవరో అర్థము చేసుకొనుటకు నిర్మాణ రాళ్లను కలుపుటకు మార్గములైయున్నవి.
— డా. వొడ్డి భౌచమ్, జూ.
నిరాకరణ మార్గము మరియు సకారణత్వ మార్గము యొక్క సాధారణ ప్రణాళికలతో పాటుగా, లేఖనములు మూడవ మద్యకాలిక ప్రణాళిక యొక్క విలువను కూడా ఉద్ఘాటిస్తున్నాయి: ఔన్నత్య మార్గము.
ఔన్నత్య మార్గము అనగా “ఉన్నతమైన” లేక “గొప్ప” మార్గమైయున్నది. దేవుడు మరియు ఆయన సృష్టికి మధ్య పోలికలను చేయుచు దేవుని వ్యాప్తి చెందు గుణములను గుర్తించుటలో ఈ పద్ధతి సహాయపడుతుంది. అయితే ఈ మూడవ ప్రణాళిక, దేవుడు సృష్టిని పోలియున్నప్పటికి కూడా, ఆయన ఎల్లప్పుడు ఉన్నతమైనవాడు, ఆయన చేసిన ప్రతిదానికంటే గొప్పవాడు అనే బైబిలు దృష్టి కోణము మీద ఆధారపడియున్నది. 1 తిమోతి 6:15-16లో పౌలు చెబుతున్నట్లు:
ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక (1 తిమోతి 6:15-16).
దేవుని గూర్చి “సర్వాధిపతి,” “రాజు” మరియు “ప్రభువు,” అని మాట్లాడుట ద్వారా, దేవుడు మానవ అధిపతులు, రాజులు మరియు ప్రభువులను అనేక విధములుగా పోలియున్నాడని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. ఇతరులందరి పైన దేవుని యొక్క ఔన్నత్యమును పౌలు వక్కాణించిన విధానమును ఒకసారి గమనించండి ఆయన “సర్వాధిపతి,” “రాజుల రాజు” మరియు “ప్రభువుల ప్రభువైయున్నాడు.” కేవలము దేవుడు మాత్రమే అమర్త్యమైనవాడును సమీపించరాని తేజస్సునందు వసియించువాడైయున్నాడు.
లేఖనములంతటిలో, దేవుడు తన సృష్టికి శక్తిని, సంక్లిష్టతను, విశాలత్వమును, మంచితనమును, ఘనతను మరియు ఇలాంటి అనేక విషయములను ఇచ్చాడని మనము నేర్చుకుంటాము. ఇవి మరియు అనేక ఇతర మార్గములలో, దేవునికి మరియు ఆయన సృష్టికి మధ్య పోలికలు ఉన్నాయి. అయితే, ఇది ఇలా ఉండగా, దేవుని శక్తి, సంక్లిష్టత, విశాలత్వము, మంచితనము మరియు ఘనత సృష్టిలో ఉన్న వాటి కంటే ఎంతో గొప్పవి మరియు ఎంతో ఉన్నతమైనవని లేఖనములు మరలా మరలా స్పష్టము చేస్తాయి. మరియు ఈ విధముగా, దేవుడు మనలను పోలియున్నప్పటికీ దేవుడు మనకంటే ఉన్నతమైనవాడని జ్ఞాపకము చేసుకొనుటలో మనకు సహాయం చేయుటకు లేఖనము మనకు తోడ్పడుతుంది.
కాబట్టి దేవునిని గూర్చిన సత్యములను వివేచించుటకు బైబిలు రచయితలు మూడు సాంప్రదాయిక ప్రణాళికలన్నిటిని అనుసరిస్తారు — నిరాకరణ మార్గము, సకారణత్వ మార్గము, మరియు ఔన్నత్య మార్గము మరియు వీటిని కలిపి పరిగణించుట ద్వారా, క్రమబద్ధ వేదాంతశాస్త్రములో దేవుడు సృష్టిని ఏ విధముగా పోలియున్నాడో కనుగొనుటకు ఈ సాధారణ ప్రణాళికలు స్థిరమైన బైబిలు పునాదులను స్థాపిస్తాయి.
దేవుని వ్యాప్తి చెందు గుణములను అన్వేషించుటకు బైబిలు పునాదులను స్థాపించుటలో సహాయపడు మూడు సాధారణ ప్రణాళికలను పరిగణించిన పిమ్మట, మానవత్వము మీద బైబిలు యొక్క క్లిష్టమైన దృక్పథములు దేవుడు ఆయన సృష్టిని పోలి ఎలా ఉన్నాడో బయలుపరచు విధానమును చూద్దాము.
సాధారణముగా సృష్టి అనేక విధములుగా దేవుని పోలియున్నదని లేఖనములు సాక్ష్యమిచ్చుచున్నాయి. మరియు ఆయన సృష్టిని జాగ్రత్తగా అధ్యయనము చేయుట ద్వారా మనము దేవుని గూర్చి అనేక విషయములు నేర్చుకోవచ్చు. అయితే మానవులను గూర్చి విశ్లేషించుట ద్వారా కూడా దేవుని గూర్చి మనము అనేక విషయములను నేర్చుకోవచ్చని లేఖనములు బోధిస్తున్నాయి. సృష్టిలో ఏ ఇతర సృష్టము కంటే కూడా ఎక్కువగా ఆయనను పోలియుండు ఘనతను దేవుడు మానవులకు అనుగ్రహించాడు. మరియు దేవుని యొక్క వ్యాప్తి చెందు పూర్ణతలను గూర్చి నేర్చుకొనుటకు ఈ పోలిక ఒక స్థిరమైన బైబిలు ఆధారమును స్థాపిస్తుంది.
ఈ విశ్వము యొక్క విశాలతను గూర్చి ఆధునిక విజ్ఞానము మనకు మరింత జ్ఞానమును ఇస్తుంది. కాబట్టి, మానవుల యొక్క ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయుట చాలా సులభమవుతుంది. మనము ఈ గ్రహములో కేవలము ఒక చిన్న ఇసుక రేణువును పోలియున్నాము. మరియు మన గ్రహము మన సౌర కుటుంబములో ఒక చిన్న నీలి చుక్కవంటిదైయున్నది. మన సౌర కుటుంబము మన నక్షత్ర వీధిలో ఒక సూక్ష్మ భాగమైయున్నది. మరియు విశ్వమంతటిలో లెక్కలేనన్ని బలమైన నక్షత్ర వీధులు కలవు. ఈ కారణము చేత, దేవుని గూర్చి మనము నేర్చుకోవాలని ఆశించినప్పుడు మానవులు నిమిత్తమాత్రులని అనిపించవచ్చు. కాని మనము ఎంత చిన్నగా ఉన్నప్పటికీ, వాస్తవానికి, మానవులు దేవుని సృష్టికి కిరీటముగా ఉన్నారు. కీర్తనలు 8:3-5 వచనములలో ఈ విధంగా వ్రాయబడియున్నది:
నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు (కీర్తనలు 8:3-5).
ఈ లేఖన భాగము మనకు తెలియజేయుచున్నట్లు, ఆకాశములతో పోల్చుకుంటే మానవాళి చాలా చిన్నగాను ప్రాముఖ్యత లేనిదిగాను అనిపించవచ్చు. అయితే ప్రత్యక్షతల తరువాత కూడా, దేవుడు మనలను “దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు” మరియు “మహిమ ప్రభావములతో [మనకు] కిరీటము ధరింపజేశాడు.”
హెబ్రీ 2:5-9లో హెబ్రీ పత్రిక రచయిత వివరించినట్లు, మానవులు దేవదూతల కంటే తక్కువ వారిగా ఉండుట కూడా తాత్కాలికమైనదే. క్రీస్తు మహిమలో తిరిగి వచ్చునప్పుడు, ఆయనను అనుసరించిన మానవులు ఉన్నతమైన ఆత్మీయ జీవుల కంటే కూడా అధికముగా హెచ్చించబడతారు. ఆది 1:26లో దేవుడు ఈ విధముగా చెప్పినప్పుడు, లేఖనములు మానవుల యొక్క ప్రత్యేక స్థాయిని మొదట గుర్తిస్తాయి:
మన స్వరూపమందు, మన పోలికె చొప్పున నరులను చేయుదము (ఆది. 1:26).
ఇక్కడ మనము చూస్తున్నట్లు, మిగిలిన సృష్టములన్నిటి కంటే భిన్నముగా మానవులు దేవుని రూపులోను పోలికలోను సృజించబడిరి.
ఇప్పుడు, మానవాళిని గూర్చి బైబిలు బోధన ఈ పాఠం యొక్క పరిమితులను దాటి ఉంటుంది. అయితే ఇక్కడ మన ఉద్దేశముల కొరకు, “రూపు” మరియు “పోలిక” అనే వ్యక్తీకరణములు సృష్టిలోని ఇతర విషయములన్నిటి కంటే ఎక్కువగా మానవులు దేవుని పోలియున్నారను మాటను ఉద్ఘాటించుచున్నాయని మాత్రమే ఇక్కడ మనము గుర్తుంచుకుందాము. ఆయన మహిమ కొరకు ఆయన రాజులైన యాజక ప్రతినిధులుగా భూమిని నిండించి లోపరచుకొనుటకు దేవుడు మానవులను ఆయన రూపములోను పోలికలోను చేశాడు. ఆరంభములో, మన ఆదిమ పితరులు ఎలాంటి కళంకము లేకుండా ఉండేవారు. తరువాత, దేవునికి విరోధముగా పాపము మరియు తిరుగుబాటు మానవ ఉనికిలోని ప్రతి కోణమును కలుషితము చేసింది. పాపముతో నిండిన తిరుగుబాటు దారులైన మానవులు కూడా దేవుని రూపము మరియు పోలికెగా గౌరవించబడతారని ఆది. 9:6 మరియు యాకోబు 3:9 వంటి లేఖన భాగములు సూచిస్తాయి. మరియు దీని కంటే ఎక్కువగా, తమ పాపముల నుండి మనస్సును మళ్లించి ఆయన పోలికెలో నూతనపరచబడాలని క్రీస్తు విమోచించిన స్త్రీ పురుషులను దేవుడు పిలచుచున్నాడు మరియు బలపరచుచున్నాడు. ఎఫెసీ. 4:22-24లో మనము చదువునట్లుగా:
కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను (ఎఫెసీ. 4:22-24).
మానవులు దేవుని పోలికె మరియు రూపములైయున్నారు కాబట్టి, మానవులతో పోల్చుట ద్వారా లేఖనములు తరచుగా దేవునిని గూర్చి బయలుపరుస్తాయి. కొన్ని ఉదాహరణలేమనగా, మత్తయి 7:11 వంటి లేఖన భాగములు దేవుని తండ్రి అని సంబోధించి ఆయనను మానవ తండ్రులతో పోల్చుతాయి. యెషయా 5:1-7 మరియు యోహాను 15:1 వంటి లేఖన భాగములు దేవుని ఒక తోటమాలితో పోల్చుతాయి. సంఖ్యా. 23:21 మరియు 1 తిమోతి 1:17 వంటి స్థలములలో దేవుడు ఒక రాజుగా వర్ణించబడ్డాడు. ఆది. 48:15 మరియు హెబ్రీ. 13:20 వంటి స్థలములలో దేవుడు ఒక కాపరితో పోల్చబడినాడు. యెషయా 54:5 వంటి వాక్య భాగములలో దేవుడు ఒక భర్తతో పోల్చబడినాడు; ఇలా ఈ పట్టిక ముందుకు కొనసాగుతుంది. అవును, దేవుడు ఏ మానవ తండ్రి, తోటమాలి, రాజు, కాపరి లేక భర్త కంటే కూడా ఉన్నతమైనవాడని ఔన్నత్య మార్గము మనకు జ్ఞాపకము చేస్తుంది. అయితే ఇవి మరియు అనేక ఇతర పోలికలు మానవులను అర్థము చేసుకొనుట ద్వారా దేవుని గూర్చి అనేక విషయములను నేర్చుకోవచ్చు అని తెలియజేస్తాయి.
అయితే ఈ ప్రక్రియలో మనలను గూర్చి మనము కొంత అవగాహనను పొందకుండా దేవుని గూర్చిన జ్ఞానమును పొందగలమా లేక పొందలేమా అనేది ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న. మరియు దీనికి జవాబు, వాస్తవానికి, ఈ రెండు కలిసికట్టుగా జరుగుతాయి. జాన్ కెల్విన్ ఈ బిందువును తాను వ్రాసిన ఇన్స్టిట్యూట్స్ అఫ్ ది క్రిస్టియన్ రిలీజియన్ లో ఒక భాగముగా వ్రాశాడు. ఆరంభములో మీకు దేవుని జ్ఞానము మరియు స్వయమును గూర్చిన జ్ఞానము ఉంటుంది. దేవుని జ్ఞానము లేకుండా, స్వయమును గూర్చిన జ్ఞానము లేదు... మనము ఆయన వైపుకు వెళ్లునట్లు ప్రేరేపించబడితిమి, మరియు ఆయనను గూర్చిన జ్ఞానము మనలను స్వయమును గూర్చిన జ్ఞానములోనికి నడిపిస్తుంది. మరియు స్వయమును గూర్చిన నిజమైన జ్ఞానము ఆయనను తెలుసుకొనుటలో ఒక ముఖ్య భాగమైయున్నది.
— డా. రిచర్డ్ ఫిలిప్స్
సంఘ చరిత్ర అంతటిలో, మానవులు దేవుని పోలికెలో ఉన్న అనేక విధానములను క్రైస్తవ వేదాంతవేత్తలు తెలియజేశారు. అయితే చాలా వరకు, వారు మూడు ముఖ్య మానవ గుణముల మీద దృష్టిని కేంద్రీకరించారు. ఈ గుణముల మీద పాఠంలోని తరువాత భాగములో మనము ఎక్కువ సమయము గడుపుతాము, కాని ప్రస్తుతానికి ఈ మూడు మానవ గుణముల యొక్క అవలోకనమును మాత్రమే మనము ఇద్దాము.
మొదటి స్థానములో, లేఖనములు మానవుల యొక్క బుద్ధి సంబంధ స్వభావమును గూర్చి బోధిస్తాయని వేదాంతవేత్తలు ఉద్ఘాటించారు. పాపములో పడిపోవుట మన మనస్సులను కలుషితము చేసినప్పటికీ, భూమి మీద ఉన్న ఇతర సృష్టముల కంటే బుద్ధి విషయములో మనము ఉన్నతమైనవారిగా ఉన్నాము. ఖచ్చితముగా, దేవుని మనస్సు మానవ మనస్సు కంటే ఎంతో ఉన్నతమైనది, కాని మన సృష్ట బుద్ధి సంబంధమైన సామర్థ్యములు మనలను దేవుని వంటి వారిగా చేస్తాయి. బైబిలు మనకు బోధించుచున్నట్లు, అనేక విధములుగా, మన వలెనె దేవుడు ఆలోచన చేస్తాడు, ప్రణాళికలను రూపిస్తాడు మరియు తర్కిస్తాడు.
రెండవ స్థానములో, మానవుల యొక్క సంకల్పశక్తిని గూర్చి, అనగా దేవుడు మనకు మానవ చిత్తమును అనుగ్రహించాడను సత్యమును గూర్చి మాట్లాడారు. మరలా, పాపము మానవ చిత్తమును కలుషితము చేసింది, కాని ఒక బండ లేక ఒక జీవములేని వస్తువునకు భిన్నంగా, ఎంపికలను చేసుకొను శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని చిత్తము మానవ చిత్తము కంటే ఎంతో ఉన్నతమైనదని మనకు తెలుసు కాని, మన చిత్తమును ఉపయోగించుటకు మనకు గల శక్తి మనలను దేవుని పోలినవారిగా చేస్తుంది.
మూడవ స్థానంలో, మనము దేవుని పోలియున్నామనుటకు మానవుల యొక్క నైతిక స్వభావమును వేదాంతవేత్తలు వక్కాణించారు. ఇతర భౌతిక జీవులకు భిన్నంగా, మన ఆలోచనలు మరియు ఎంపికలకు నైతిక గుణములు ఉన్నాయి. ఇప్పుడు, దేవుని నైతిక స్వభావము ఖచ్చితముగా పరిపూర్ణముగా ఉన్నది, కాబట్టి, అది మనకు అందనిదిగా ఉన్నది. అయినను, దేవదూతలు మరియు దయ్యములతో పాటుగా, వారు చేయు ఎంపికల యొక్క నైతిక గుణముల కొరకు మానవులు కూడా బాధ్యులుగా ఎంచబడతారు.
పాఠంలో తరువాత, ఈ మూడు మానవ గుణముల మీద బైబిలు ఉద్ఘాటన దేవుని వ్యాప్తి చెందు గుణములను నేర్చుకొనుటకు క్రమబద్ధ వేదాంతవేత్తలకు ఏ విధంగా దిశను సమకూర్చినదో మనము చూద్దాము. మానవ ఉనికి యొక్క బుద్ధి సంబంధ, సంకల్ప మరియు నైతిక గుణములను గూర్చి లేఖనములు చెప్పు విషయములు దేవుడు సృష్టిని పోలి ఏ విధంగా ఉన్నాడో అను విషయమును గూర్చి అధికారిక చర్చను చేయుటకు కేంద్రముగా ఉన్నాయి.
దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడో నేర్చుకొనుటకు ఉపయోగపడు బైబిలు పునాదులను చూసిన పిమ్మట, మనము మన రెండవ ముఖ్యఅంశము వైపుకు మళ్ళుదాము: ఈ అంశము మీద అధికారిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములో అభివృద్ధి చెందిన వేదాంతశాస్త్ర దృక్పథములను చూద్దాము.
దేవుడు ఆయన సృష్టిని పోలియున్నాడని లేఖనములు అనేక విధములుగా బోధించుచున్నవని గుర్తించుట ఒక విషయము. అయితే, మనము చూడబోవుచున్నట్టు, క్రమబద్ధ వేదాంతవేత్తలు ఈ బైబిలు పునాదుల మీద ఏ విధముగా నిర్మించారో గ్రహించుట మరొక విషయమైయున్నది. సాంప్రదాయిక క్రైస్తవ వేదాంతవేత్తలు దేవుని పూర్ణతలు — ఆయన అమితమైన, నిత్యమైన మరియు మార్పులేని పూర్ణతలు — ఏ విధముగా వ్యాప్తి చెందునవో వీలైనంత స్పష్టముగా నిర్థారించుటకు ప్రయత్నించారు. మరియు దీనిని చేయుటకు, వారు అనేక ముఖ్యమైన ప్రశ్నలను అడిగారు. ఉదాహరణకు, ఈ గుణములు ఏమిటి? అవి సృష్టిలో, ముఖ్యముగా మానవులలో, ఏ విధముగా ప్రతిబింబించబడినవి? మరియు దేవుని గూర్చిన వేదాంతశాస్త్రము యొక్క ఈ కోణములో స్పష్టమైన దృక్పథములను నిర్మించుటకు ఉత్తమమైన మార్గమేది?
దేవుని వ్యాప్తి చెందు గుణముల మీద వేదాంతశాస్త్ర దృక్పథములను వర్ణించుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే, మనము కేవలం నాలుగు విషయములను మాత్రము చూద్దాము. మొదటిగా, ఈ అంశమును గూర్చి విచారించుచుండగా సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు అనుసరించిన రెండు ప్రక్రియలను మనము క్రోడీకరించుదాము. రెండవదిగా, ఈ దైవిక పూర్ణతలను గూర్చి అధికారిక ప్రొటెస్టెంట్ దృక్పథములకు ప్రాతినిధ్యం వహించు అనేక చారిత్రిక ప్రతుల మీద దృష్టిపెడదాము. మూడవదిగా, సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములో దేవుని వ్యాప్తి చెందు గుణముల యొక్క క్రమబద్ధీకరణను గూర్చి చర్చించుదాము. మరియు నాల్గవదిగా, ఈ అధికారిక దృక్పథముల యొక్క అనేక పరిణామములను చూద్దాము. క్రమబద్ధ వేదాంతవేత్తలు అనుసరించిన ప్రక్రియలతో ఆరంభించుదాము.
మునుపటి పాఠములలో ఒకదానిలో మనము చెప్పిన్నట్లుగా, దేవుని గుణములను గూర్చిన బైబిలు బోధనలు లేఖనమందంతట వ్యాపించియుండుట క్రమబద్ధ వేదాంతవేత్తలు ఎదుర్కొనుచున్న ఒక గొప్ప సవాలైయున్నది. బైబిలు మనకు ఎన్నడును దేవుని గుణములను గూర్చిన ఒక సంపూర్ణమైన అధికారిక పట్టికను ఇవ్వదు మరియు అది క్రమబద్ధముగా వాటిని నిర్వచించదు లేక వివరించదు కూడా. కాబట్టి, వారి పనిని పూర్తి చేయుట కొరకు, క్రమబద్ధ వేదాంతవేత్తలు ఈ రకరకాల రూపములను మరియు రంగులను వివేచించి, వాటిని కొన్ని మిశ్రమ చిత్రములుగాను లేక మరకలైన గాజు కిటికీలుగాను రూపొందించవలసియుండినది. అప్పుడు, ఈ “కిటికీలు” దేవుని వ్యాప్తి చెందు గుణముల లోనికి స్పష్టమైన మెళకువలను మనకు అందిస్తాయి. ఈ సమ్మేళనములను సృష్టించుటకు, క్రమబద్ధ వేదాంతవేత్తలు అనేక ప్రక్రియలను ఉపయోగించారు.
సమయమును దృష్టిలో ఉంచుకొని, క్రమబద్ధ వేదాంతవేత్తలు అనుసరించిన అనేక ప్రక్రియలలో రెంటిని మాత్రమే మనము చూద్దాము. మొదటిగా, వారు సాంకేతిక పదములను ఎలా ఉపయోగించారో చూద్దాము. మరియు రెండవదిగా, వారు వేదాంతశాస్త్ర ప్రతిపాదనలను ఎలా రూపొందించారో చూద్దాము. వారు సాంకేతిక పదములను ఉపయోగించిన విధానమును మొదట చూద్దాము.
దేవుని వ్యాప్తిచెందు పూర్ణతలను గూర్చి మాట్లాడుటకు లేఖనములు అనేక రకముల పదములను ఉపయోగిస్తాయి. వాస్తవానికి, అవే విషయములను తెలియజేయుటకు బైబిలు రచయితలు వేర్వేరు వ్యక్తీకరణములను ఉపయోగించారు. మరియు వేర్వేరు అంశములను చూపించుటకు పలు వాక్య భాగములలో వారు ఒకే పదములను కూడా ఉపయోగించారు.
కాబట్టి, దేవుని గుణములను గూర్చిన బైబిలు బోధనల యొక్క నమ్మకమైన సమ్మేళనములను సృష్టించుటకు, వేదాంతవేత్తలు సాంకేతిక పదములను అన్వయించుకున్నారు. వేరే మాటల్లో, వారు కొన్ని వ్యక్తీకరణములను ఉపయోగించుటకు నిర్ణయించుకున్నారు మరియు ఆ వ్యక్తీకరణములకు ప్రత్యేకమైన అర్థములను ఇచ్చారు. ఇప్పుడు, ప్రతి క్రమబద్ధ వేదాంతవేత్త అవే సాంకేతిక పదములను అవే విధములలో ఖచ్చితముగా ఉపయోగిస్తే, దేవుని వ్యాప్తి చెందు గుణములను గూర్చిన అధికారిక చర్చలు సులభతరమవుతాయి. కాని వారు అలా ఉపయోగించరు. ఉదాహరణకు, అనేక మంది వేదాంతవేత్తలు దేవుని “బుద్ధిని” దేవుని “జ్ఞానము” అనే విశాలమైన విభాగములో మాట్లాడారు. అయితే ఇతర వేదాంతవేత్తలు దేవుని “బుద్ధి” మరియు “జ్ఞానము” మధ్య స్పష్టమైన వ్యత్యాసము ఉండాలని ఒత్తి చెప్పారు. అదే విధముగా, కొందరు వేదాంతవేత్తలు దేవుని “మంచితనము”ను ఒక విశాలమైన విభాగములో మాట్లాడారు. లేఖనములు దేవుని యొక్క “కృప,” “కరుణ,” “ప్రేమ” మరియు ఇతర సంబంధిత పదములను గూర్చి మాట్లాడిన సందర్భములను వారు మంచితనము యొక్క వ్యక్తీకరణములుగా పరిగణించారు. అయితే, ఇతర వేదాంతవేత్తలు దేవుని మంచితనము, కృప, కరుణ, మరియు ప్రేమలను ప్రత్యేకమైన విధములుగా నిర్వచించారు.
ఇవి మరియు ఇతర కారణముల వలన, క్రమబద్ధ వేదాంతవేత్తలు ఉపయోగించు ప్రత్యేకమైన పదములను గూర్చి ఎక్కువగా చింతించకుండా ఉండుట ఎంతో ప్రాముఖ్యమైన విషయమైయున్నది. ఇవాంజెలికల్ క్రమబద్ధ వేదాంతశాస్త్రము యొక్క లక్ష్యము లేఖనము యొక్క భిన్నమైన పదములను ఉన్నవున్నట్లు పలుకుట కాదుగాని, లేఖనములోని అంశముల యొక్క నమ్మకమైన సారాంశములను సృష్టించుటయే. మరియు దేవుని గూర్చిన బైబిలు అంశములను అనేక రకముల సాంకేతిక పదములలో వ్యక్తీకరించవచ్చు.
వేదాంతవేత్తలు దేవుని గుణములను అనేక మార్గములలో క్రమపరచారు. మరియు నిజముగా, ఇవన్ని కూడా దేవుని మరియెక్కువగా అర్థము చేసుకొనుటకు మార్గమైయున్నవి. కాబట్టి మనము దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి మాట్లాడునప్పుడు కూడా ఇదే వాస్తవమైయున్నది... ఉదాహరణకు ప్రేమ వంటి విషయములు, ఉదాహరణకు సత్యము వంటి విషయములు. మరియు అనేక ఇతరములను మనము చెప్పవచ్చు. కొందరి పట్టికలు చిన్నవిగా ఉంటాయి; మరి కొందరివి పెద్దగా ఉంటాయి. మరలా, వీటన్నిటిలో, వీటిని గూర్చి సులువైన మార్గములో ఆలోచించు మార్గము ఏమనగా, దేవుని పోలిక మరియు దేవుని కార్యములను పోలి మానవులు ఏమి చేయవలసియున్నది, ఎలా ఉండవలసియున్నది?
— రెవ. వెర్మన్ పియరీ
సాంకేతిక పదములను పలు విధములుగా ఉపయోగించుటతో పాటుగా, దేవుడు మనలను పోలి ఉన్న విధమును వివరించుటకు క్రమబద్ధ వేదాంతవేత్తలు వేదాంతశాస్త్ర ప్రతిపాదనలను ఎలా ఉపయోగించారో కూడా మనము చూడాలి.
వేదాంతశాస్త్ర ప్రతిపాదనలు క్రమబద్ధ వేదాంతశాస్త్రములోని ప్రతి కోణమునకు సాధారణ నిర్మాణ రాళ్లుగా ఉన్నాయి. విశాలముగా మాట్లాడితే, వేదాంతశాస్త్ర ప్రతిపాదన అనగా కనీసము ఒక వాస్తవిక వేదాంతశాస్త్ర దావానైనా సూటిగా ఉద్ఘాటించు ఒక కథనమైయున్నది. ఇప్పుడు, దేవుని వ్యాప్తిచెందు గుణముల పట్ల ఈ సూటైన పద్ధతి చాలా సులువుగా అనిపిస్తుంది; అయితే లేఖనములు దేవుని వ్యాప్తి చెందు గుణములను గూర్చి అనేక రకముల రచనా శైలులను బయలుపరుస్తాయి: కథనము, పద్య భాగము, ధర్మశాస్త్రము, ప్రవచనము, పత్రికలు, మరియు మొదలగునవి. మరియు వీటిలో ప్రతి రచనా శైలి కూడా దేవుని గూర్చిన సత్యములను అనేక విధాలుగా వ్యక్తపరుస్తుంది. కాబట్టి, ఈ బైబిలు బోధనలకు తార్కికముగా స్పష్టమైన వ్యక్తీకరణలను సృష్టించుటకు, క్రమబద్ధ వేదాంతవేత్తలు ప్రతి విధమైన బైబిలు రచనా శైలికి వేదాంతశాస్త్ర ప్రతిపాదనలను కనుగొనవలసి వచ్చింది.
వేదాంతశాస్త్ర ప్రతిపాదనలను కనుగొను ఈ ప్రక్రియను ఇతర భాగములతో పోల్చుకుంటే కొన్ని బైబిలు భాగములకు ఉపయోగించుట సులువుగా ఉంటుంది. ఉదాహరణకు, దేవుని యొక్క పూర్ణతలను గూర్చి ప్రతిపాదన రూపములో ఉన్న అనేక దావాలను బైబిలు కలిగియున్నది. కీర్తనలు 34:8లో దావీదు యొక్క పద్యభాగ గీతము “యెహోవా ఉత్తముడు” అని మనకు చెబుతుంది. 1 యోహాను 4:8లో, “దేవుడు ప్రేమ స్వరూపి” అని మనము చదువుతాము. ఇట్టి బైబిలు ప్రతిపాదనలు దేవుని వ్యాప్తి చెందు గుణములను గూర్చిన అధికారిక వేదాంతశాస్త్ర చర్చలోనికి సులువుగా ఇమిడిపోతాయి.
ఇతర లేఖనములు దేవునిని గూర్చిన సూటైన వివరణలను తెలియజేస్తాయి. ఉదాహరణకు, ప్రవచన పుస్తకమైన యెషయా 1:4లో దేవుడు “పరిశుద్ధుడు” అని వర్ణించబడ్డాడు. ఈ వర్ణనను క్రమబద్ధ వేదాంతవేత్తలు ఒక సులువైన ప్రతిపాదనగా మార్చుటను చూచుట కష్టమైన పని కాదు: “దేవుడు పరిశుద్ధుడు.” ద్వితీ. 7:9లోని ధర్మశాస్త్ర రచనా శైలిలో, దేవుడు “నమ్మదగిన దేవుడు” అని వర్ణించబడినాడు. మరొక మాటలో, “దేవుడు నమ్మదగినవాడు.”
అయితే అన్ని బైబిలు భాగములు అధికారిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములోనికి సులువుగా ఇమడలేవు. బైబిలు కథనములతో వ్యవహరించునప్పుడు, ఒకే కథలో నుండి మనము అనేక వేర్వేరు ప్రతిపాదిత వాక్యములను కనుగొనవచ్చు. ఉదాహరణకు, ఆదికాండము 2లోని సృష్టి వృత్తాంతములు, “దేవుడు బలవంతుడు,” “దేవుడు జ్ఞాని” మరియు “దేవుడు మంచివాడు” అని తెలియజేస్తాయి. ఆదికాండము 19లోని సొదొమ గొమొర్రాలను గూర్చిన కథనము “దేవుడు పరిశుద్ధుడు,” “దేవుడు కరుణగలవాడు” మరియు “దేవుడు నీతిమంతుడు” అని తెలియజేస్తుంది. ప్రతి బైబిలు కథనము కూడా దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములను గూర్చి పలు రకముల ప్రతిపాదనలను కనుగొనుటకు క్రమబద్ధ వేదాంతవేత్తలకు అవకాశములను ఇచ్చింది.
రూపకములు, అలంకారములు మరియు సాదృశ్యముల వంటి వాటి మీద బైబిలు ఎక్కువగా ఆధారపడిన సందర్భములలో కూడా మనము దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములను చూడవచ్చు. ఇది బైబిలు పద్య భాగములలో మరింత స్పష్టముగా కనిపిస్తుంది. ఉదాహరణకు, కీర్తనలు 89:26 వంటి పద్య భాగ వాక్యములు, మరియు యెషయా 64:8 వంటి ప్రవచన వాక్యములు, దేవుని “తండ్రి” — దేవుని గూర్చి మనకు అనేక విషయములను బోధించు అలంకారము — అని సంబోధిస్తాయి. “తండ్రి”గా దేవుని యొక్క బహుముఖ చిత్రమును ఉపయోగించుటకు బదులుగా, క్రమబద్ధ వేదాంతవేత్తలు సూటైన ప్రతిపాదనలైన “దేవుడు మంచివాడు” అని వాటి వైపు ఎక్కువ మొగ్గుచూపారు.
కీర్తనలు 24:8 మరియు నిర్గమ 15:3 వంటి పద్య భాగ వాక్యములు, మరియు యెహోషువ 23:10 వంటి గద్యభాగ వాక్యములు దేవుని ఒక యుద్ధవీరునిగా చూపిస్తాయి. అయితే క్రమబద్ధ వేదాంతవేత్తలు తమ దృష్టిని “దేవుడు బలవంతుడు” అనే ప్రతిపాదన వైపుకు ఎక్కువగా కుదించారు. కీర్తనలు 118:27 మరియు 1 యోహాను పత్రిక 1:5 వంటి పద్యభాగ వాక్యముల ఆధారంగా, “దేవుడు వెలుగైయున్నాడు” అని మనము చెప్పవచ్చు. అయితే క్రమబద్ధ వేదాంతవేత్తలు ఈ అలంకారమును “దేవుడు నైతికముగా పవిత్రుడు” అనే ప్రతిపాదనగా అనువదించుటకు ఎక్కువ మొగ్గు చూపారు.
ఇట్టి పోల్చు చిత్రములు దేవుడు ఆయన సృష్టిని పోలియున్నాడని బయలుపరచుచున్నవని మనము గమనించవచ్చు. మరియు అనేక విధములుగా, చిత్రాత్మక భాషను ఉపయోగించుట అనేక విధాలుగా దేవుని వ్యాప్తి చెందు గుణములను గూర్చిన మన చర్చలను బలపరుస్తాయి. అయితే, క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని గూర్చిన ఇవే సత్యములను సూటైన వేదాంతశాస్త్ర ప్రతిపాదనలలో తెలియజేయుట మీద ఎక్కువ దృష్టి పెట్టారు. మరియు అలా చేయుట ద్వారా, దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణముల మీద తార్కికముగా స్పష్టమైన బోధనలను సృష్టించుటలో వారు సఫలీకృతులైయ్యారు.
వేదాంతశాస్త్ర పద్ధతి అనే ప్రశ్న లేఖనము మీద దృష్టి పెడుతుంది ఎందుకంటే లేఖనము మన యొక్క సమస్త వేదాంతశాస్త్రమునకు ఒక ప్రాథమిక మూలముగాను నిరంకుశమైన అధికారముగాను ఉన్నది. మరియు ఆ విధముగా, మనము లేఖనమును చూచిన ప్రతిసారి, మనము ఒక ప్రశ్నను అనగా, లేఖనములోని వేదాంతశాస్త్ర ప్రశ్నను అడుగుటకు ప్రయత్నించుచున్నాము: ఇక్కడ మనకు ఏమి బోధించబడుచున్నది? ఇప్పుడు, మనము ఈ విధంగా చేసినప్పుడు, మనము లేఖనములోనికి నడిపించబడుచుండగా మనము వెంటనే ఎదుర్కొనే విషయము ఏమిటంటే, లేఖనము క్రమబద్ధ వేదాంతశాస్త్రమునకు ఒక చేతిపుస్తకమో మరొకటో కాదు. లేఖనములో ఒక స్పష్టమైన కథన నిర్మాణము ఉన్నది, మరియు అవును, లేఖనము చాలా వరకు ఖచ్చితమైన కథనముగా ఉన్నది. మరియు మనకు కీర్తనలు కూడా ఉన్నాయి, మరియు లేఖనములో మనము ఉపమానములను మరియు అనేక ఇతర రచనా శైలులను ఎదుర్కొంటాము. కాబట్టి, వేదాంతశాస్త్ర నిర్మాణము మరియు తర్కమును ఉపయోగపడు విధముగా ఒక లేఖన భాగములో నుండి బోధను రాబడుతూ, మనకు ఇవ్వబడిన విధముగా లేఖన భాగమును అర్థము చేసుకొనుట నుండి సిద్ధాంత విధములలోనికి మనము ఎలా తొలగిపోతాము? అను విషయముల వంటి వాటిని గూర్చి ప్రాముఖ్యమైన వ్యాఖ్యాన ప్రశ్నలను మనము ఎదుర్కొంటాము. మరియు లేఖనములో దేవుని గూర్చి చాలా చాలా సూటిగా మాట్లాడు కథనములు కూడా ఉన్నాయి... అయితే మరలా... లేఖనములో మనకు ఇవ్వబడిన వేదాంతశాస్త్రము చాలా వరకు వ్రాయబడిన దాని ఆధారంగా అట్టి ముగింపులకు దారి తీస్తుంది... లేఖన భాగమును దాని వాస్తవికతలో సరైన విధముగా అర్థము చేసుకొనుటకు మనము కొన్ని కనీస వ్యాఖ్యాన నియమాలను ఉపయోగించవలసియున్నది. మరియు మనము ఆ విధముగా చేసినప్పుడు, దేవుడు ఎవరైయున్నారు అనే విషయము మీద మనకు మరింత అవగాహన కలుగుతుంది.
— డా. బ్రూస్ బౌగస్
దేవుని వ్యాప్తి చెందు గుణములను గూర్చి వేదాంతశాస్త్ర దృక్పథములను రూపొందించిన కొన్ని ప్రక్రియలను పరిగణించిన పిమ్మట, దేవుని గూర్చిన వేదాంతశాస్త్రములోని ఈ కోణమును ఇవాంజెలికల్ క్రైస్తవులు క్రోడీకరించిన విధానమునకు ప్రాతినిధ్యము వహించు కొన్ని చారిత్రిక ప్రతులను పరిగణించుట సహాయకరముగా ఉంటుంది.
పేరుగాంచిన ఇవాంజెలికల్ వేదాంతవేత్తల యొక్క రచనల సర్వేను మనము చేయవలసియుంటే, దేవుని వ్యాప్తిచెందు గుణములను గూర్చి వారు కలిగియున్న అభిప్రాయములు సాధారణంగా ఒకే రకముగా ఉన్నాయని వెంటనే అర్థమవుతుంది. దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడో వ్యక్తపరచుటకు సంఘ చరిత్రలో క్రైస్తవులు ఉపయోగించిన ఎన్ని పట్టికలనైనా మనము ప్రస్తావించవచ్చు. కాని సులభతరము చేయుట కొరకు, ఈ పాఠ్యక్రమములో మనము అనేక సార్లు ప్రస్తావించిన మూడు చారిత్రిక ప్రతులను మనము పరిగణించుదాము. ఈ ప్రతులు దేవుని వ్యాప్తిచెందు పూర్ణతల యొక్క అధికారిక సారంశములను ఇవాంజెలికల్ క్రైస్తవులు అభివృద్ధి చేసిన సాధారణ మార్గములకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
1530లో వ్రాయబడిన ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ ను మొదట చూచుట ద్వారా ఈ చారిత్రిక ప్రతులను మనము విశ్లేషించుదాము. తరువాత 1561లో వ్రాయబడిన బెల్జిక్ కన్ఫెషన్ ను మనము పరీక్షించుదాము. మరియు చివరిగా, 1647లో వ్రాయబడిన వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజంను విశ్లేషణ చేద్దాము. మొదటిగా లూథరన్ సంఘము యొక్క ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ తో ఆరంభించుదాము.
ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసం దేవుని గుణములను ఈ విధముగా క్రోడీకరిస్తుంది అని మీరు జ్ఞాపకముంచుకొనవచ్చు:
పిలువబడిన మరియు దేవుడైయున్న దైవిక సారము ఒకటి కలదు: నిత్యమైన, శరీరము లేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనముగలవాడు.
మొదటి వ్యాసము దేవుని వ్యాప్తిచెందని గుణములు — ఆయన సృష్టికి భిన్నముగా ఆయన ఎలా ఉన్నాడు — అని సాధారణంగా గుర్తించబడిన విషయములను ప్రస్తావిస్తుంది. అయితే కన్ఫెషన్ దేవుని శక్తి, జ్ఞానము, మరియు మంచితనమును కూడా ప్రస్తావిస్తుంది. ఈ మూడు గుణములను సాధారణంగా వ్యాప్తి చెందు గుణములుగా, లేక దేవుడు ఆయన సృష్టిని పోలి, ప్రత్యేకముగా మానవులను పోలి ఉన్న విధానములను గుర్తిస్తుంది.
దేవుడు ఈ పూర్ణతలన్నిటిని సృష్టికి అనుగ్రహించాడు గాని, తక్కువ పరిమాణములో ఇచ్చాడు. దేవుడు శక్తిని కలిగియున్నాడని, మరియు ఆయన తన సృష్టికి అదే రకమైన శక్తిని తక్కువ పరిమాణములో ఇచ్చాడని కీర్తనలు 68:34, 35 వంటి వాక్యభాగములు బోధిస్తాయి. దేవుడు జ్ఞానమును కలిగియున్నాడని మరియు ఆ జ్ఞానమును మానవులకు తక్కువ పరిమాణములో ఇచ్చాడని దాని. 2:20, 21 వంటి వాక్యభాగములు బయలుపరుస్తాయి. దేవుడు మంచివాడు మాత్రమే గాక, ఆయన తన సృష్టిలో మంచితనమును ఉంచాడని కీర్తనలు 119:68 మరియు 2 పేతురు 1:3-5 వంటి లేఖన భాగములు సూచించుచున్నవి. కాబట్టి, లేఖన బోధనల ఆధారంగా, దేవుని శక్తి, ఆయన జ్ఞానము మరియు ఆయన మంచితనము అన్ని వ్యాప్తి చెందు గుణములని మనము సరిగానే చెప్పవచ్చు.
ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ లోని దేవుని వ్యాప్తి చెందు గుణముల యొక్క పట్టికను మనస్సులో ఉంచుకొని, మన రెండవ చారిత్రిక ప్రతుయైన, బెల్జిక్ కన్ఫెషన్ వైపు తిరిగి, అది దేవుని గుణములను ఎలా తెలియజేస్తుందో చూద్దాము.
బెల్జిక్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసములో మనము ఈ మాటలను చదువుతాము:
మనము దేవుడని పిలచు ఒకే సులువైన ఆత్మీయ జీవము ఉన్నది .... ఆయన నిత్యుడు, ఊహకు అందనివాడు, అదృశ్యమైనవాడు, మార్పులేనివాడు, అమితమైనవాడు, సర్వశక్తిగలవాడు, సర్వ జ్ఞాని, నీతిమంతుడు, మంచివాడు, మరియు సమస్త మేలుల యొక్క ఉప్పొంగు ఊట.
బెల్జిక్ కన్ఫెషన్ లోని ఈ వ్యాసము దేవుని గుణములను పది మాటలలో క్రోడీకరిస్తుంది. మొదటి ఆరు సాధారణంగా దేవుని యొక్క వ్యాప్తి చెందలేని గుణములకు సంబంధించినవి. మిగిలిన గుణములు — సర్వశక్తిగల, సంపూర్ణ జ్ఞాని, న్యాయవంతుడు మరియు మంచివాడు — సాధారణంగా దేవుని వ్యాప్తి చెందు గుణములకు సంబంధించినవి.
ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ వలెనె, బెల్జిక్ కన్ఫెషన్ కూడా దేవుడు సర్వశక్తివంతుడని లేక దేవునికి శక్తి ఉన్నదని ప్రస్తావిస్తుంది; అనగా ఆయన జ్ఞానవంతుడు మరియు ఆయన మంచివాడు. అయితే దేవుడు న్యాయవంతుడు, లేక “నీతిగలవాడు,” అని అనువదించబడు మరొక గుణమును కూడా అది జోడిస్తుంది. ఈ వ్యాప్తిచెందు గుణముకు మద్దతుగా, కీర్తనలు 7:9 వంటి చోట్ల లేఖనములు దేవుడు నీతిమంతుడు లేక న్యాయవంతుడు అని తరచుగా మాట్లాడతాయి. మరియు హొషేయ 12:6 మరియు 2 తిమోతి 3:16 వంటి లేఖనములు, సృష్టముల పరిమాణములో మానవులు కూడా “న్యాయవంతులుగాను” లేక “నీతిమంతులుగాను” ఉండగలరు అని బోధిస్తున్నాయి. కాబట్టి, శక్తి, జ్ఞానము, మరియు మంచితనముతో పాటుగా, న్యాయమును కూడా దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణముగా ఎంచవచ్చు.
ఇది మనలను మూడవ చారిత్రిక ప్రతు వైపుకు నడిపిస్తుంది. ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ మరియు బెల్జిక్ కన్ఫెషన్ వలెనె వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజం కూడా దేవుని వ్యాప్తిచెందు గుణములను తెలియజేస్తుంది.
“దేవుడు అంటే ఏమిటి” అనే షార్టర్ కేటకిజంలోని నాల్గవ ప్రశ్నకు హితోపదేశము ఈ విధముగా జవాబిస్తుంది:
దేవుడు ఆత్మయైయున్నాడు మరియు ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయములో, మంచితనములో, మరియు సత్యములో అమితమైనవాడు, నిత్యుడు, మరియు మార్పులేనివాడు.
ఈ దైవిక పూర్ణతలలోని చివరి ఏడు వ్యాప్తి చెందునవే: దేవుని ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, నీతి, మంచితనము మరియు సత్యము.
ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ మరియు బెల్జిక్ కన్ఫెషన్ వలెనె, షార్టర్ కేటకిజం కూడా జ్ఞానము, శక్తి మరియు మంచితనమును గూర్చి మాట్లాడతాయి. అది న్యాయమును జోడించుట ద్వారా బెల్జిక్ కన్ఫెషన్ ను కూడా ప్రతిబింబిస్తుంది. అయితే హితోపదేశము దేవుని యొక్క సారము లేక ఉనికి, దేవుని యొక్క పరిశుద్ధత, మరియు దేవుని యొక్క సత్యము లేక నమ్మకత్వమును కూడా జతచేస్తుంది. సృష్టి యొక్క సారము లేక ఉనికి రెండవ ప్రాధాన్యతను కలిగియుంటుంది మరియు దేవుని సారము మీద ఆధారపడియుంటుంది అని ఆది. 1:1 మరియు యోహాను 1:3 వంటి లేఖన భాగములు స్పష్టము చేస్తాయి. కాని మనము దేవుని పోలిన విధానములలో ఉనికిలో ఉంటాము. ఎఫెసీ. 4:24 ప్రకారం, పరిశుద్ధత సృష్టి యొక్క పలు భాగములలో మరియు మానవులలో కూడా ప్రతిబింబించు దేవుని గుణమైయున్నది. మరియు కీర్తనలు 25:5 వంటి లేఖన భాగములలో, సత్యము లేక నమ్మకత్వము కేవలం దేవుని యొక్క పరిపూర్ణత మాత్రమే కాదుగాని, అది మానవులకు కూడా ఇవ్వబడింది.
దేవుడు ఆయన సారము, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతిలోని కొన్ని గుణములను మనకు ఇవ్వగలడు ... మరియు దీని యొక్క అతి సులువైన వివరణ వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజంలో ఉన్నది. “దేవుడు ఎవరు? దేవుడు ఆత్మయైయున్నాడు, అమితమైన, నిత్యమైన మరియు మార్పులేనివాడైయున్నాడు” — ఇవి మూడు పంచి ఇవ్వలేని లేక వ్యాప్తిచెందలేని గుణములు — “ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో, మంచితనములో మరియు సత్యములో.” ఇవి దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములు. కాబట్టి, తరువాత ఇవ్వబడిన గుణములలో మనము దేవునితో పాలివారము కావచ్చుగాని, అమితముగాను, నిత్యముగాను లేక మార్పులేనివారిగాను ఉండుట మనకు ఇవ్వబడిన గుణము కాదు. మరియు అవును, ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో, మంచితనములో మరియు సత్యములో పాలుపంచుకొనుటకు ఆయన మనకు ఇచ్చిన అవకాశమును బట్టి మనము ఆయనను మహిమపరచుచున్నట్లే, మనము పాలుపంచుకొనని ఆయన అమితమైన, నిత్యమైన మరియు మార్పుచెందని గొప్పతనమును బట్టి ఆయనను మహిమపరుస్తాము.
— డా. సాండర్స్ ఎల్. విల్సన్
ఈ పట్టికలు ఈ విషయముల మీద ప్రొటెస్టెంట్ ఇవాంజెలికల్ దృక్పథములకు ప్రతినిధులుగా ఉన్నాయి. అయినను, వేదాంతవేత్తలు దేవునికి ఆపాదించిన ప్రతి వ్యాప్తిచెందు గుణము ఈ ప్రతులలో ఉండదని కూడా మనము తెలియజేయాలి. వ్యక్తిగత వేదాంతవేత్తలు తరచుగా ఇతర వ్యాప్తిచెందు గుణములను కూడా సంబోధించారు. ఉదాహరణకు, మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, దేవుని జ్ఞానమును వ్యాప్తి చెందు గుణముగా పరిగణించుట చాలా సాధారణమైన పని. మరియు కొలస్సీ. 1:10 వంటి వాక్యభాగములలో, దేవుడు మరియు మానవులు కూడా జ్ఞానమును కనుపరచుతారని మనము కనుగొంటాము. దేవుని కరుణ చాలా సార్లు ఈ దైవిక పరిపూర్ణతల శ్రేణిలో ఎంచబడుతుంది, ఎందుకంటే లూకా 6:36 వంటి లేఖన భాగములలో మానవులు మరియు దేవుడు కూడా కరుణగలవారని లేఖనములు స్పష్టము చేస్తున్నాయి. అవును, ద్వితీ. 7:9 వంటి లేఖన భాగములలో దేవుని ప్రేమను కూడా లేఖనములు వ్యాప్తి చెందు గుణముగా పరిగణిస్తాయి.
వేదాంతవేత్తలు అనుసరించు ప్రక్రియలను మరియు అనేక ప్రాతినిధ్య చారిత్రిక ప్రతులను పరిగణించిన పిమ్మట, దేవుని వ్యాప్తి చెందు గుణముల మీద వేదాంతశాస్త్ర దృక్పథములలోని మూడవ కోణమును మనము చూద్దాము: క్రమబద్ధ వేదాంతశాస్త్రములో ఈ విషయముల యొక్క క్రమబద్ధీకరణ.
మనము ఇంతకు ముందు చూచినట్లుగా, పలు ప్రాతినిధ్య చారిత్రిక ప్రతులు మరియు ఖ్యాతిగాంచిన వేదాంతవేత్తలు దేవుని వ్యాప్తి చెందు గుణములను అనేక విధాలుగా క్రమపరచారు. దురదృష్టవశాత్తు, ఈ ప్రత్యేకత కారణంగా ఏ దైవిక గుణముల యొక్క పట్టిక సరైనదని అనేకసార్లు అనుభవములేని విద్యార్థులను సంఘర్షణకు గురి చేస్తుంది. కాని వాస్తవానికి, దేవుని వ్యాప్తి చెందు గుణములకు ఒక మూలాధారమైన క్రమము ఉన్నది. మరియు ఈ తార్కికమైన క్రమము, దేవుడు మనలను పోలి ఏ విధంగా ఉన్నాడో అను విషయము మీద ఇవాంజెలికల్ క్రైస్తవుల మధ్య గొప్ప ఐక్యత ఉన్నదని చూచుటలో మనకు సహాయపడుతుంది.
ఈ పాఠంలో ఇంతకు ముందు, మరి ఏ సృష్టము కంటే ఎక్కువగా మానవులకు దేవుని పోలియుండు ధన్యత ఇవ్వబడినదని మనము చూశాము. మరియు ఈ కారణము చేత, లేఖనములు తరచుగా దేవునిని మానవ గుణముల ఆధారంగా వర్ణిస్తాయి. అనేక విధములుగా, దేవుడు మరియు మానవత్వము మధ్య ఉన్న పోలికల మీద ఈ బైబిలు దృష్టి క్రమబద్ధ వేదాంతశాస్త్రములో దేవుని వ్యాప్తిచెందు గుణములను క్రమపరచుటకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నవి.
శతాబ్దముల తరబడి క్రమబద్ధ వేదాంతవేత్తలు మరియు విశ్వాస సూత్రములు మరియు విశ్వాసపుటొప్పుకోలులు మరియు ఇతరములు దేవుని యొక్క వ్యాప్తిచెందు గుణములను అనేక విధములుగా క్రపపరచారు... అయితే చాలా వరకు, ఒకసారి మీరు పరిశీలన చేసినట్లయితే, మీరు ఇలాంటి ప్రశ్నలను అడుగుతారు, ఇది మొదటిగా ఎందుకు తీసుకొనబడినది, మరియు ఇది రెండవదిగాను, మరియు మరొకటి మూడవదిగాను ఎందుకు పరిగణించబడింది, అనేక విధాలుగా మరలా మరలా కనిపించు ముఖ్య నియమము ఏమనగా, ప్రజలను అర్థము చేసుకొను విధానములలో దేవుని వ్యాప్తి చెందు గుణములను ప్రజలు క్రమపరచుట. మరియు దీనికి కారణం ఏమనగా, మనము దేవుని పోలికగాను రూపములుగాను ఉన్నాము, మరియు దేవుని వ్యాప్తి చెందు గుణములు ఆయన మనలను పోలియున్న మార్గములైయున్నవి... అనగా, వాస్తవమేమిటంటే, దేవుని వ్యాప్తిచెందు గుణముల యొక్క పట్టికను బైబిలు మనకు ఇవ్వదు. వాటిని మనము లేఖనముల నుండి కనుగొంటాము, మరియు ఆ విధముగా దేవుని గుణములను గూర్చి ఆలోచన చేయు విధానములో దేవునికి మనుష్యులకు మధ్య బంధమును లేక పోలికలను మీరు ఉపయోగించునప్పుడు, ప్రజలను గూర్చి మీరు ఆలోచన చేయు విధానము మీరు పనులను క్రమపరచు విధానము మీద ప్రభావము చూపుతుంది.
— డా. రిచర్డ్ ఎల్. ప్రాట్, జూ.
ఆధునిక విజ్ఞానములైన జీవశాస్త్రము, మానవ శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం మరియు సామాజిక శాస్త్రం వంటివి మానవునిగా ఉండుట అంటే ఏమిటో అర్థము చేసుకొనుటకు అనేక రకముల అవగాహనలను ఇచ్చాయి. ఈ ఆధునిక దృష్టికోణములు మనకు అనేక విషయములు తెలుయజేయవలసియున్నవి; ఇతరులు మానవత్వము యొక్క నిజమైన స్వభావమును దురన్వయం చేస్తాయి. అయితే, మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, మానవులు విశేషముగా దేవుని పోలియున్న మూడు ముఖ్యమైన మార్గముల మీద దృష్టిపెట్టాయి: మన బుద్ధి సంబంధమైన సామర్థ్యములు, మన సంకల్ప శక్తి సామర్థ్యములు, మరియు మన నైతిక స్వభావము. దేవుని పోలికెలో చేయబడుట అంటే ఏమిటో తెలియజేయు ఈ మూడింతల సమీక్ష క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని వ్యాప్తి చెందు గుణములను క్రమబద్ధీకరించిన విధానము మీద ప్రభావము చూపింది.
సాధారణంగా, దేవుని వ్యాప్తి చెందు గుణముల యొక్క పూర్ణతలన్ని, మానవులు దేవుని పోలియున్న మర్గాములకు సంబంధించిన దైవిక గుణముల యొక్క మూడు విశాలమైన విభాగములలో విభజించబడవచ్చు. దేవుని బుద్ధి సంబంధమైన గుణములు, ఆయన సంకల్పశక్తి గుణములు మరియు ఆయన నైతిక గుణములు
ఆగ్స్‌బర్గ్ కన్ఫెషన్ లోని మొదటి వ్యాసములో ప్రస్తావించబడిన దేవుని జ్ఞానము, శక్తి, మరియు మంచితనము ఈ మూడు విశాలమైన విభాగములకు అనుగుణంగా ఉంటాయని చూచుట చాలా సులువైన పని. జ్ఞానము దేవుని మనస్సుకు సంబంధించినది మరియు దేవుని యొక్క బుద్ధి సంబంధమైన గుణములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శక్తి దేవుని చిత్తమునకు సంబంధించినది మరియు దేవుని సంకల్పశక్తికి సంబంధించిన గుణములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరియు మంచితనము దేవుని నైతిక గుణములతో వ్యవహరిస్తుంది.
బెల్జిక్ కన్ఫెషన్ లో ఇవ్వబడిన నాలుగు వ్యాప్తి చెందు గుణములను గూర్చి కూడా ఇదే విషయము తెలియజేయవచ్చు. బుద్ధిగల అనే పదము దేవుని బుద్ధి సంబంధమైన గుణముల విభాగమునకు చెందినదవుతుంది. బలమైన అనే పదము దేవుని సంకల్పశక్తికి సంబంధించిన గుణములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరియు న్యాయవంతమైన, లేక నీతిగల, మరియు మంచి అను పదములు దేవుని నైతిక గుణములకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
అదే విధముగా, వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజం యొక్క నాల్గవ జవాబు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. దేవుని ఉనికి లేక సారము అనే ఒక అసాధరణమైన విభాగము తరువాత, జ్ఞానము దేవుని బుద్ధి సంబంధమైన గుణములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శక్తి దేవుని సంకల్పశక్తికి సంబంధించిన గుణములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరియు దేవుని నైతిక గుణములలో పరిశుద్ధత, న్యాయము, మంచితనము మరియు సత్యము ఉన్నాయి.
ఈ చారిత్రిక ప్రతులు ఖచ్చితముగా ఒకే విధముగా లేనప్పటికీ, అవి ఎంతో వ్యత్యాసము గల వేర్వేరు దృష్టికోణములకు ప్రాతినిధ్యము వహించవని ఈ విషయములు తెలియజేస్తాయి. వాటి మధ్య వ్యత్యాసము ఉన్నప్పటికీ, దేవుడు మరియు దేవుని స్వరూపములుగా మానవులు పంచుకొను మూడు ముఖ్యమైన గుణముల ఆధారంగా అవన్నీ దేవుని వ్యాప్తిచెందు పూర్ణతల మీద దృష్టిపెడతాయి.
ఈ మూడింతల క్రమబద్ధీకరణ వ్యక్తిగత వేదాంతవేత్తలు పరిచయం చేసిన భిన్నత్వములను సమీక్షించుటలో కూడా మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, దేవుని బుద్ధికి దేవుని జ్ఞానమును జోడించుట కేవలం ఆయన బుద్ధి సంబంధమైన గుణముల యొక్క రెండు కోణముల మధ్య వ్యత్యాసము చూపు ఒక సులువైన మార్గము మాత్రమే. సాంప్రదాయక పదమైన శక్తికి సార్వభౌమత్వము అనే పదమును జోడించుట, దేవుని బుద్ధి సంబంధమైన గుణములలోని రెండు కోణముల మధ్య వ్యత్యాసమును చూపుతుంది. కరుణ మరియు ప్రేమ అను పదములను జోడించుట దేవుని యొక్క అనేక నైతిక గుణముల మధ్య వ్యత్యాసము చూపుతుంది.
దీని వెలుగులో, దేవుని వ్యాప్తి చెందు గుణముగా దేనిని పరిగణించాలి అనే విషయమును గూర్చి ఇవాంజెలికల్ క్రమబద్ధ వేదాంతశాస్త్రములో ఒక స్పష్టమైన ఐక్యత ఉన్నదని మనము నిశ్చయతతో చెప్పగలము. ఒక అరుదైన మినహాయింపు తప్పితే, ఈ పూర్ణతలను గూర్చి అనేక విధములుగా నేర్చుకొనుట ఎల్లప్పుడు సాధ్యమైనప్పటికీ, దేవుని వ్యాప్తి చెందు గుణములన్ని దేవుని బుద్ధి సంబంధమైన, సంకల్పశక్తి సంబంధమైన మరియు నైతిక సంబంధమైన గుణములు అనే విశాలమైన విభాగములకు చెందుతాయి.
అనేకమంది క్రమబద్ధ వేదాంతవేత్తలు ఉపయోగించిన ప్రకియలు, అనేక ప్రాతినిధ్య చారిత్రిక ప్రతులు, మరియు దేవుని గూర్చిన వేదాంతశాస్త్రములోని ఈ విషయమును తార్కికముగా అమర్చుట ద్వారా దేవుని వ్యాప్తిచెందు గుణములను గూర్చిన అనేక వేదాంతశాస్త్ర దృక్పథములను మనము పరిగణించాము గనుక, ఇప్పుడు మన నాల్గవ విషయమును చూడాలి — ఈ వేదాంతశాస్త్ర దృష్టికోణముల యొక్క కొన్ని అభ్యాసిక అంతర్భావములు.
దేవుని వ్యాప్తి చెందు గుణముల యొక్క అభ్యాసిక అంతర్భావములను మనము అనేక విధములుగా చూడవచ్చు. అయితే సులభతరము చేయుట కొరకు, మనము కేవలము రెండు దశలలో మాత్రమే చూద్దాము. మొదటిగా, దేవుని గూర్చి మనము కలిగియున్న ఆపేక్షలు. మరియు రెండవదిగా, మనము దేవుని అనుకరించు విధానమును ప్రస్తావిద్దాము. దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములను పరిగణించునప్పుడు మనము కలిగియుండవలసిన ఆపేక్షల రకములతో ఆరంభించుదాము.
దురదృష్టవశాత్తు, దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములను గూర్చి అనేక మంది సద్భావముగల క్రీస్తు అనుచరులు నేర్చుకున్నప్పుడు, వారు బైబిలు కాలములలో దేవుడు కార్యము చేసిన విధానమును తప్పుగా అనువదిస్తారు, మరియు తమ సొంత జీవితములలో నేడు దేవుడు పని చేయు విధానమును గూర్చి కూడా తప్పుడు ఆపేక్షలను సృష్టిస్తారు. దేవుని గుణములు ఎల్లప్పుడు సత్యములైయున్నవి. అవి ఎన్నడును ఆగిపోవు. అవి ఎన్నడును మారవు. అంటే దీని అర్థము దేవుని వ్యాప్తి చెందు గుణములు అందరికి ప్రతి రోజు ప్రతి క్షణములో స్పష్టముగా కనిపిస్తాయని కాదు. లెక్కలేనన్ని బైబిలు ఉదాహరణలు తెలియజేయుచున్నట్లు, దేవుడు స్వయంగా ఎన్నడును మారడు, మరియు ఆయన మన జీవితములో చేయు కార్యములు ఆయన గుణములకు వ్యతిరేకముగా నిలువబడవు. అయితే అదే సమయములో, దేవుడు ఆయన గుణములను అనేక విధాలుగా ప్రదర్శిస్తాడు కాబట్టి, చరిత్రలో ప్రతి క్షణములో ఆయన ఏ విధంగా కార్యము చేస్తాడు అని మనము ఖచ్చితముగా ఊహించలేము కూడా.
దేవుని నుండి బైబిలానుసారమైన ఆపేక్షలను కలిగియుండుటకు, ఈ పాఠ్య క్రమములో మనము అనేక సార్లు ప్రస్తావించిన వ్యత్యాసమును మనము దృష్టిలో ఉంచుకోవాలి — దేవుని గుణములు మరియు ఆయన చారిత్రిక వ్యక్తీకరణముల మధ్య ఉన్న వ్యత్యాసము.
మనము ఇంతకు ముందు చూసినట్లుగా, దేవుని గుణములన్ని, ఆయన వ్యాప్తిచెందు గుణములతో సహా, పరిమితులు లేనివి, కాల పరిమితులు లేనివి మరియు మార్పులేనివై యున్నవి. అయితే దేవుడు ఈ పరిమితమైన, తాత్కాలికమైన మరియు మార్పుచెందు సృష్టిలో పాలుపంచుకొనుచుండగా, ఆయన పలు వేళలలో పలు విధములుగా తన గుణములను బయలుపరచుకుంటాడు. ఈ బయల్పాటులలో కొన్ని ఎక్కువ సమయము పాటు కొనసాగుతాయి. మరికొన్ని అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే సంభవిస్తాయి. అయితే ఎన్నడును పూర్తిగా ఊహించదగిన విధముగా దేవుడు ఆయన గుణములను కనుపరచడని సాధారణ ప్రత్యక్షత మరియు బైబిలు చరిత్ర యొక్క రికార్డు స్పష్టముగా బయలుపరచుచున్నది.
ఇది వ్యాప్తి చెందు గుణముల యొక్క మూడు సాంప్రదాయిక విభాగములన్నిటి విషయములో ఏ విధముగా నిజమైయున్నదో ఆలోచించండి. దేవుని బుద్ధి సంబంధమైన గుణములు ఎల్లప్పుడు ఆయనను ప్రతిబింబిస్తాయి. ఆయన ఎల్లప్పుడుఅన్నియు ఎరిగినవానిగాను సర్వజ్ఞానిగాను ఉన్నాడు. కాని కొన్ని సార్లు, దేవుడు తన జ్ఞానమును మరియు వివేకమును బైబిలు చరిత్రలోను మరియు నేటి మన జీవితములలోను స్పష్టముగా బయలుపరుస్తాడు; మరికొన్ని సార్లు ఆయన బయలుపరచడు. ఇందు వలననే కొందరు బైబిలు పాత్రలు దేవుడు వారికి బయలుపరచినవాటిని ఆనందముతో తెలియపరచారు, మరికొంత మంది దేవుని మనస్సును మరి ఎక్కువగా అర్థము చేసుకొనుటకు ఎదురుచూశారు.
ఇదే విధముగా, దేవుని సంకల్పశక్తికి సంబంధించిన గుణములు కూడా ఎన్నడును మారవు. ఆయన ఎల్లప్పుడు శక్తిగలవానిగా ఉన్నాడు. అయితే బైబిలు చరిత్ర అంతటిలో, మరియు మన జీవితాలలో కూడా, కొన్ని సార్లు దేవుడు ఆయన శక్తిని బహుగా ప్రదర్శిస్తాడు, మరికొన్ని సార్లు ఆయన చూపించడు. ఇందు వలననే బైబిలు పాత్రలు కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యములను బట్టి తమ స్వరములనెత్తి దేవునికి స్తుతులు చెల్లించారు, అయితే మరికొన్ని సార్లు తమ శత్రువుల బానిసత్వములో శ్రమపొందుతూ తన శక్తిని చూపమని దేవునికి ప్రార్థించారు.
ఇదే విషయమును దేవుని మార్పుచెందని నైతిక గుణములను గూర్చి కూడా చెప్పవచ్చు. దేవుడు ఎల్లప్పుడు మంచివాడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ప్రేమగలవాడు, కరుణగలవాడు మరియు కృపగలవాడైయున్నాడు. అయితే దేవుడు ఈ నైతిక గుణములను అనేక విధాలుగా స్పష్టముగా ప్రత్యక్షపరచుచున్నాడని బైబిలు చరిత్ర మరియు మన సొంత మానవ అనుభవము నిస్సందేహముగా తెలియజేయుచున్నవి. కొన్నిసార్లు, ఆయన మంచితనము అందరు చూచునట్లు సూటిగా కనిపిస్తుంది. అయితే మరికొన్ని సార్లు, ఆయన మంచితనమును వివేచించుట కష్టమవుతుంది. ఇందువలననే, అనేక మంది బైబిలు పాత్రలు తాము పొందుకున్న ఆశీర్వాదముల కొరకు కృతజ్ఞతలు చెల్లించారు, మరికొందరు తాము ఎదుర్కొన్న శ్రమలు శోధనలను బట్టి విలపించారు.
ఈ వ్యత్యాసములు తెలియజేయుచున్నట్లుగా, దేవుని వ్యాప్తిచెందు గుణములను చరిత్రలో ఆయన ఈ గుణములను వ్యక్తపరచు విధానములతో వ్యత్యాసపరచుట దేవుని నుండి సరైన ఆపేక్షలను కలిగియుండుటకు మూలమైయున్నది.
సరే, సృష్టిలో దేవుని జ్ఞానము, ప్రేమ, శక్తి, మరియు ఇలాంటి విషయములను చూడగలుగుటలోని సమస్య సాధారణంగా స్వయంగా దేవుని కంటే ఎక్కువగా మానవ దృష్టికోణమునకు సంబంధించినది అని నేననుకుంటాను. బైబిలులో నుండి ఎంతగానో ఉపయోగపడు ఒక జ్ఞాప్తి కీర్తనలు 73లో కనిపిస్తుంది, అక్కడ కీర్తనకారుడు ధనవంతులు మరియు దుష్టుల యొక్క ఐశ్వర్యమును గూర్చి విలపిస్తాడు, మరియు “నేను నీ కొరకు జీవించుటకు ప్రయత్నించుచున్నాను, కాని అన్ని వేళల శోధింపబడుచున్నాను” అని చెబుతాడు, కాని కీర్తన యొక్క మధ్య భాగములో ఒక మలుపు కనిపిస్తుంది మరియు అక్కడ ఈ విధముగా వ్రాయబడియున్నది, “మరియు ఈ విషయములు నేను దేవుని సన్నిధికి వెళ్లునంత వరకు బాధకలిగించినవి, మరియు తరువాత నేను అంతమును గ్రహించాను.” ఉదాహరణకు, ఆత్మ స్వస్థత యొక్క అవసరతను గూర్చి, పాపము మన పై ఎంత ప్రభావమును చూపిందంటే మన ఆలోచన, మన ప్రక్రియలు, విషయములను అర్థము చేసుకొనే విధానము మీద ప్రభావము చూపింది మరియు మన ఆత్మలకు దైవిక స్వస్థత యొక్క అవసరత ఉన్నది, మరియు దేవుడు కార్యము చేసినప్పుడే మనము సరైన విధానములో అర్థము చేసుకోగలము మరియు అనువదించగలము అని అగస్టిన్ మాట్లాడవచ్చు. కాబట్టి సమస్య దేవునిలో లేదుగాని, మన ఆలోచనా విధానములో ఉంది. మరియు ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా వచ్చుచుండగా ... ఈ గుణములను మరియు దేవుని కార్యములను అతడు మరింత స్పష్టముగా చూచుట ఆరంభిస్తాడు. అయితే ఇది దేవుని సమస్య కాదు; మన సమస్య.
— డా. బ్రూస్ ఎల్. ఫీల్డ్స్
దేవుని వ్యాప్తిచెందు గుణముల యొక్క అభ్యాసిక అంతర్భావములు కేవలం దేవుని గూర్చి మనము కలిగియున్న ఆపేక్షలను గూర్చి మాత్రమే మాట్లాడవు. అవి మనము దేవుని అనుకరించుటలో గల ప్రాముఖ్యతను గూర్చి కూడా మాట్లాడతాయి.
దేవుని యొక్క వ్యాప్తి చెందలేని గుణములను అనుకరించమని లేక పోలి నడచుకోమని లేఖనములు ఎన్నడును ప్రజలకు పిలుపునివ్వవు. మనము అమితముగాను, నిత్యముగాను లేక మార్పులేనివారిగాను ఉండాలని అవి బోధించవు. బదులుగా, దేవుడు ఈ విధములుగా మనకు భిన్నముగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని ఆరాధించుటలో మరియు ఘనపరచుటలో మనలను మనము వినమ్రపరచుకోవాలని లేఖనములు పిలుపునిస్తున్నాయి. కాని దేవుని వ్యాప్తిచెందు గుణముల యొక్క అభ్యాసిక అంతర్భావములు మరొక దిశలో వెళ్తాయి. అవును, ఈ పూర్ణతల కొరకు మనము దేవుని ఘనపరచాలి. కాని మరలా మరలా, దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములను అనుకరించమని లేఖనములు మనకు పిలుపునిస్తాయి.
ఉదాహరణకు, లూకా 6:36లో, యేసు ఇలా అన్నాడు:
కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్లు మీరును కనికరముగలవారై యుండుడి (లూకా 6:36).
ఇక్కడ, దేవుని కనికరమును అనుకరించమని యేసు శిష్యులకు చెప్పాడు. మానవ కనికరము ఎలా ఉండాలో ఆయన ఒక స్థాయిని స్థాపించాడు. ఇది దేవుని కనికరము యొక్క నైతిక గుణము వలె ఉండాలి.
ఎఫెసీ. 4:32లో పౌలు ఇలాంటి హెచ్చరికలనే ఇచ్చాడు, అక్కడ ఇలా వ్రాయబడియున్నది:
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి (ఎఫెసీ. 4:32).
దేవుని మంచితమును ఆయన కనికరములోను మరియు దయలోను అనుకరించుట క్రీస్తును అనుసరించువారందరికీ మంచితనము యొక్క స్థాయి వలె ఉన్నది. అదే విధముగా, 1 పేతురు 1:14-16 ఇలా చెబుతుంది:
“నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని” వ్రాయబడియున్నది... మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి (1 పేతురు 1:14-16).
ఇక్కడ లేవీయకాండములో కనిపించు పరిశుద్ధత కొరకు ఇవ్వబడిన తరచూ పిలుపులను రచయిత దేవుని పోలి యుండుటకు పిలుపుగా అనువదించాడు.
దేవుడు పరిశుద్ధుడు అని లేఖనము స్పష్టముగా మాట్లాడుతుంది, మరియు ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండుటకు 1 పేతురులో పిలువబడితిమి... దేవుని స్వభావములోని ఈ గుణమైన పరిశుద్ధతను ఈ విశ్వములో మనము మాత్రమే ప్రతిబింబించగలమని ఒక సేవకుడు నాకు చెప్పిన సన్నివేశము నాకు జ్ఞాపకమున్నది. కాబట్టి, మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, మనము పరిశుద్ధతలో నడచునప్పుడు, మనము పాపము నుండి వైదొలగినప్పుడు, మరియు ఈ విషయములో లోకముతో వేరుగా ఉన్నప్పుడు, మనము కేవలం దేవుడు మనలను పిలచిన పనినే చేయుటలేదు, ఆయన మనలను పిలచి మన నుండి కోరాడు కాబట్టి మనము పాపము నుండి వైదొలగుట లేదుగాని, మనము దేవుని యొక్క ఒక ప్రాముఖ్యమైన గుణమును ప్రజల ఎదుట ప్రతిబింబించుచున్నాము. మరియు ఈ విధముగా లోకము మనలను చూడగలదు; వారు మన పరిశుద్ధతను చూస్తారు, మనము వేరుపరచబడినట్లు వారు చూస్తారు, మరియు వారు దేవుని స్వభావములోని అతి ప్రాముఖ్యమైన గుణమును చూస్తున్నారు. కాబట్టి, లేఖనముల ఆధారంగా మాట్లాడితే, ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా ఉండవలెను, మరియు దానిని మనము ప్రభువును సంతోషపరచుటకు మాత్రమే గాక ఆయన స్వభావమును ప్రతిబింబించుటకు చేయుచున్నామని నేననుకుంటున్నాను.
— డా. మ్యాట్ కార్టర్
పాత మరియు క్రొత్త నిబంధనలు రెంటిలో, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నట్లు ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులైయుండాలని దేవుడు పిలుపునిచ్చుచున్నాడు, మరియు ఈ విధంగా ప్రతి యుగములోను దేవుని ప్రజలకు దేవుని పరిశుద్ధత గొప్ప అభ్యాసిక ప్రాముఖ్యత కలిగినదైయున్నది. మరియు పరిశుద్ధతలో కనీసం రెండు విషయములు ఉన్నాయి. దాని అర్థము ఒక వైపు ఒక విషయము నుండి “వేరుగా ఉండుట,” మరియు ఈ సందర్భములో పాపము నుండి దూరముగా ఉండుట, కాబట్టి దేవుని ప్రజలుగా పాపముతో ఏ సంబంధము లేకుండా ఉండుటకు మనము పిలువబడితిమి. మరియు భావార్థకముగా దీని అర్థము నైతికముగా దేవుని స్వరూపములోనికి మారుట, మరియు ఏ సృష్టము కూడా దేవుని పోలియున్న విధముగా ఆయనను పోలియుండుట. మరియు ఈ విధంగా, దేవుడు మనలను ఎక్కడ ఉంచినా, మన అనుబంధములు మరియు ఉద్యోగములు మరియు క్రియలన్నిటిలో దేవుని పోలియుండుటకు, మనము మాట్లాడు మరియు చేయు ప్రతిదానిలో దేవుని పోలియుండుటకు మనము వీలైనంత కృషి చేస్తాము.
— డా. గై వాటర్స్
దేవుని వ్యాప్తి చెందు గుణముల యొక్క మూడు ముఖ్య విభాగముల కోవలో, మనము మన మనస్సులను దేవుని మనస్సును పోలినవిగా చేసుకోవాలి. మనము మన చిత్తములను దేవుని చిత్తమునకు అప్పగించాలి. మన నైతిక స్వభావము దేవుని నైతిక స్వభావమును పోలినదిగా ఉండాలి. ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనము ఇంతకు ముందు చూసినట్లుగా, దేవుడు తన బుద్ధి సంబంధమైన, సంకల్ప శక్తి సంబంధమైన మరియు నైతిక సంబంధమైన గుణములను సృష్టిలో పాలుపంచుకొనుచుండగా అనేక విధములుగా బయలుపరుస్తాడు. మరియు అనేక విధాలుగా, దేవుని పోలి నడుచుకొనుటకు ప్రయత్నించు ప్రతి ఒక్కరి జీవితములో కూడా ఇదే నిజమైయుండాలి. దేవుని ఆలోచనలను ఆలోచించుట అనగా పలు సందర్భములలో పలు అర్థములనిస్తుంది. మన చిత్తములను దేవునివిగా అనుసరించుటకు, మనము పలు సందర్భములలో అనేక విధాలుగా వ్యవహరించాలి. దేవుని నైతిక గుణమును ప్రతిబింబించుటకు సరైన సమయములలో సరైన మార్గములలో జీవించుట అవసరమైయున్నది.
ఈ కారణము చేత, దేవుని నమ్మకమైన ప్రజలు లేఖనములో ఆజ్ఞాపించబడిన విధముగా దేవుని అనుకరించుటను నేర్చుకోవాలి. అనుదిన జీవితములను గడుపుచుండగా మనలను నడిపించుటకు లేఖనములు మనకు లెక్కలేనన్ని హెచ్చరికలు ఇస్తాయి. బైబిలు బోధించునదంతా పలు సందర్భములలో అన్వయించుకొనుట ద్వారా మనము దేవుని జ్ఞానమును ప్రతిబింబించుట నేర్చుకుంటాము. దేవునికి విధేయులై మన చిత్తమును అభ్యసించుటకు మనము పిలువబడిన అనేక మార్గములను అధ్యయనము చేయుట ద్వారా పలు సందర్భములలో దేవుని శక్తిని ఎలా ప్రతిబింబించాలో మనము నేర్చుకుంటాము. లేఖనము యొక్క నైతిక హెచ్చరికలన్ని పరిగణలోనికి తీసుకొని పలు సందర్భములలో దేవుని మంచితనమును ఎలా అనుకరించాలో మనము నేర్చుకుంటాము.
పరిశుద్ధాత్మ మన జీవితములలో పని చేస్తున్నాడని, మనము పూర్తిగా క్రీస్తును పోలినవారమయ్యే దినము కొరకు మనలను సిద్ధపరుస్తున్నాడను సంపూర్ణ నిశ్చయతతో మనలను మనము లేఖనము యొక్క పలు బోధనలకు సమర్పించుకుంటాము. 1 యోహాను 3:3లో ఇలా వ్రాయబడియున్నది:
క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మనము ఆయన వలె మారిపోతాము, ఎందుకంటే ఆయనను ఆయన ఉన్న విధముగా చూస్తాము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును (1 యోహాను 3:3).
ఈ పాఠంలో, దేవుని యొక్క వ్యాప్తిచెందు గుణములను పరీక్షిస్తు దేవుడు మనలను పోలి ఎలా ఉన్నాడో మనము చూశాము. బైబిలు రచయితలు దేవుని ఆయన సృష్టితో, ముఖ్యముగా ఆయన స్వరూపములో చేయబడిన మానవులతో పోల్చిన మార్గములలో దీని యొక్క బైబిలు పునాదులను మనము చూశాము. మరియు దీనిని మించి, ఈ దైవిక గుణములకు క్రమబద్ధ వేదాంతవేత్తలు అనేక అధికారిక వేదాంతశాస్త్ర దృక్పథములను ఎలా అభివృద్ధి చేశారో కూడా పరిశీలన చేశాము. వారు ఉపయోగించు ప్రక్రియలను, చారిత్రిక ప్రతులలోని ప్రాతినిధ్య పట్టికలను, దేవుని వ్యాప్తిచెందు గుణములను వారు తార్కికముగా క్రమబద్ధీకరించుటను, క్రీస్తు అనుచరులకు ఈ వేదాంతశాస్త్ర దృక్పథముల యొక్క అభ్యాసిక అంతర్భావములను మనము చూశాము.
అది అర్థము చేసుకొనుటకు ఎంత కష్టమైనప్పటికీ, దేవుడు ఆయన సృష్టి కంటే ప్రతి విషయములోను భిన్నముగా ఉన్నాడు. కాని ఈ పాఠంలో మనము చూసినట్లుగా, ఆయన అనేక విధాలుగా మనలను పోలి కూడా ఉన్నాడు. మరియు దేవుని వ్యాప్తిచెందు గుణములను గూర్చి ఈ పాఠంలో మనము చూసిన విషయములు కేవలం కొంత సమాచారము కంటే ఎక్కువగా ఉన్నాయి. దేవుని సిద్ధాంతములోని ఈ కోణమును మనము అర్థము చేసికొనుచుండగా, దేవుడు ఎవరో మనము మరింత లోతుగా అర్థము చేసుకొనవచ్చు. మరియు అనుదినము మన జీవితములలో మనము ఎలాంటి ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడో మరి ఎక్కువగా మనము అర్థము చేసుకొనుచున్నాము.
Continue reading the full transcript